Gundeninda GudiGantalu Today episode November 24th : మీనా సుమతిని కలవడానికి అని ఆ ఇంటికి వెళ్తే సుమతి పడుకొని దీనంగా కనిపిస్తుంది.. దాంతో సుమతి బాధని చూసిన మేన ఏంటి సుమతి నువ్విలా బాధపడుతూ ఉంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అని మీనా అంటుంది. నేను ఎవరికీ చెప్పలేను అక్క ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని సుమతి అంటుంది. అయితే నేను అక్కడ ఉండగానే అరుణ్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది సుమతీ పరిస్థితిని చూసి ఇలా బాధపడిపోతూ ఉంటే ఎలా ఎలాగైనా సరే మీ భర్తని కాస్త ఒప్పించమని అడుగుతుంది. మరి అరుణ్ వాళ్ళ అమ్మ మాట విని సుమతికి న్యాయం చేయాలని మీనా బాలు తో మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది.
బాలు వెళ్తూ ఉండగా మీనా ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అని అంటుంది. సుమతి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు సుమతి పరిస్థితి చాలా దారుణంగా మారింది. మీరు అరుణ్ క్షమాపణ చెప్తే ఒప్పుకుంటారా అని అడుగుతుంది.. కానీ మీనా మాత్రం మాట్లాడిన మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీనా ఇకమీదట నా గురించి ఆలోచించడం మానేయి ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని వార్నింగ్ కూడా ఇస్తాడు. నన్ను కాదని సుమతి పెళ్లి చేస్తే ఇకమీదట నాకు కూడా శాశ్వతంగా దూరం అయిపోతావు అని బాలు హెచ్చరిస్తాడు.. ఇక మనోజ్ మాత్రం రోహిణి మీద అనుమానంతో తనని ఫాలో అవుతూ వెళ్ళిపోతాడు. మనోజ్ ఇక బేకరీ కి వెళ్లి ఎవరికోసం కేక్ తయారు చేపించింది తెలుసుకోవాలని అనుకుంటాడు అక్కడ మహేష్ అన్న పేరు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యి, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి రోహిణి మీద మనోజ్ కి డౌట్ మొదలవుతుంది..
ప్రభావతి మీనా చాలా కోపంగా ఉన్నా సరే తనతో పని చేయించాలని అనుకుంటుంది. అయితే ప్రభావతి పాలు అడగగానే మీన పాలు తెచ్చి ప్రభావతికి ఇస్తుంది. నేను చాలా చిరాగ్గా ఉన్నాను అత్తయ్య నన్ను ఏమీ అనద్దు అని మీనా అంటుంది. అప్పుడే బాలు ఫుల్లుగా తాగేసి ఇంటికి వచ్చి ప్రభావతి కాలు పట్టుకుంటాడు నన్ను క్షమించు నాన్న అని అంటాడు అయితే ఏమైందిరా నీకు నా కాళ్లు పట్టుకున్న ప్రభావతి అంటుంది. అయితే నువ్వా నేను మా నాన్న అనుకున్నాను అమ్మావతి నువ్వేనా ఇక్కడే ఉన్నావా మా నాన్న తాగ వస్తే ఫీల్ అవుతాడు కదా అందుకే నేను కాళ్లు పట్టుకున్నాను అని బాలు అంటాడు. ఇక ప్రభావతిని కూర్చోబెట్టి బాలు చిన్నప్పటినుంచి నాకు ఒక్కసారి కూడా నువ్వు జోల పాడలేదు నేనంటే నీకు ఎందుకమ్మా ఇష్టం లేదు నువ్వు వస్తావని నేను ఎంతో ఎదురు చూస్తాను అంటూ ఎమోషనల్ అయిపోతాడు బాలు మాటలు విన్న ప్రభావతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన కొడుకు మీద ప్రేమ ఉన్న సరే తన మీద కోపంతో ఆ ప్రేమ నీకు అంత కోపంగా మార్చుకునింది అని ప్రభావతి అనుకుంటుంది.
బాలు నాన్న నన్ను క్షమించు నాన్న నువ్వు రావాలి నాన్న నాకు న్యాయం చేయాలి అంటూ అరుస్తాడు. అదేవిధంగా ఇంట్లో వాళ్ళందరినీ పేరు పెట్టి పేరుపేరునా అందరు రావాలి అని అరుస్తారు. అయితే బాలు అలా అరవడంతో ఇంట్లోని వారందరూ ఏమైందని కంగారు పడిపోతూ అక్కడికొస్తారు. ఏంట్రా మల్లి తాగొచ్చావా ఇన్ని రోజులు తాగావు అని అనుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ నువ్వు తాగుతున్నావు అంటే ఏమనుకోవాలి అర్థం కావడం లేదు అని అందరూ కూడా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతారు.. సత్యం మాత్రం చాలా ఫీల్ అయిపోతాడు. అయితే నాన్న నేను తాగకూడదు అనుకున్నాను నాన్న కానీ కొన్ని నాకు తెలియకుండా జరిగిపోతున్నాయి. కాబట్టి తాగేసి వచ్చాను అని బాలు అనగానే ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ఏం జరిగింది రా? ఎందుకు నువ్వు మళ్ళీ తాగావు అని అడుగుతాడు.
బాలు ఒక చాక్ పీస్ తీసుకొని వచ్చి అక్కడ లైన్ గీస్తాడు అయితే ఆ లైన్ ఏంట్రా ఇప్పుడు ఏం చేస్తున్నావ్ రా అని అందరూ అడుగుతూ ఉంటే బాలు మాత్రం నేనేం చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను మీరు ఏమి కంగారు పడకండి అని అంటాడు. నాన్న ఈ గీత మీద నుంచి అమ్మ నీకు దాటమని చెప్పండి అని అడుగుతాడు అయితే ప్రభావతి దాటతు ఉండగా వద్దు అని అంటాడు. అయితే ఈ ప్రభావతి ఏంట్రా ఏమన్నా పిచ్చమైన పట్టిందా నన్ను ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు అని అడుగుతుంది అయితే ప్రభావతి కాలు పట్టుకొని అమ్మ చూసావా నువ్వు ఎంత మంచి దానివో నాన్న మాట ఎలా వింటున్నావో అని అంటాడు బాలు మాత్రం చాలా ఫీల్ అయిపోతుంది. మీనా నిజం చెప్పకుండా అందరినీ అక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది.
ఇక రవి అందరూ వెళ్ళిపోయిన తర్వాత శృతిని ఆ గీతం మీద దాటమని అంటాడు. శృతి నా మాట వింటాదో లేదో అని రవి చాలా క్యూరియాసిటీతో వెతుకుతూ ఉంటాడు. అయితే శృతిని ఆ లైన్ మీద నుంచి దాటమని చెప్పగానే.. శృతి వెళ్లి దాన్ని చెరిపేస్తుంది ఆ మాటతో రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు మీకు లైన్ దాటాలా నీ మాట వినాలి అంటూ శృతి కూడా తన వెనకాల వెళ్ళిపోతుంది. ఇక బాలు మాత్రం మీనా వెళ్లిపోయిందని తన వెనకాల వెళ్లిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : విక్కీ పై చక్రీ సీరియస్.. మహాకు టెన్షన్.. చక్రీ కాపాడతాడా..?