Karthika Deepam 2 serial today Episode: సూరజ్ కు బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి బ్లడ్ ఇవ్వడం కోసం బేరం ఆడుతుంటాడు. తనకు డబ్బులు ఇస్తేనే బ్లడ్ డొనేట్ చేస్తానని అంటాడు. ఆ మాటలకు కార్తీక్ ఆ వ్యక్తిని తిడుతుంటే.. జ్యోత్స్న మాత్రం తాను దీప ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నప్పుడు కార్తీక్ సంతకం చేస్తేనే దీప ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుంటానని బలవంతం చేసిన విషయం గుర్తు చేసుకుంటుంది.
ఆ వ్యక్తి ఈ భూమ్మీద ఏదీ ఫ్రీగా దొరకదండి.. డబ్బులు ఇస్తేనే రక్తం ఇస్తాను పొమ్మంటే పోతాను అంటాడు. అప్పుడే నర్స్ వచ్చి డోనర్ వచ్చాడా..? పేషెంట్ కండీషన్ సీరియస్‌గా ఉంది అంటూ చెప్పగానే.. జ్యోత్స్న తాను డబ్బులు ఇస్తానంటుంది. అంత డబ్బు ఎలా ఇస్తావని కార్తీక్ అడిగితే.. మాలిని అత్త నా అకౌంట్‌లో వేయించిన రెండు కోట్లు ఉన్నాయి కదా అంటూ తన బ్యాగ్‌లో ఉన్న చెక్ బుక్ తీసి ఇరవై ఐదు లక్షలకు చెక్ రాసి ఇస్తుంది. డోనర్ చెక్ తీసుకుని బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తాడు. డాక్టర్ వెళ్లి కాసేపట్లో ఆపరేషన్ చేస్తామని చెప్పి వెళ్లిపోతాడు.
మాలిని మనిషి హాస్పిటల్‌కు వచ్చి జ్యోత్స్న, కార్తీక్, దీప ఇక్కడే ఉన్నారు. మరి జ్యోత్స్నను సేవ్ చేసింది ఎవరు..? వాడు బుల్లెట్ తగిలి చచ్చిపోయి ఉంటాడని ఆ రౌడీ వెధవ చెప్పాడు.. జ్యోత్స్నను సేవ్ చేసింది ఎవరో చూద్దాం అనుకుంటూ ఐసీయూ దగ్గరకు వెళ్తాడు మాలిని మనిషి. జ్యోత్స్న కూర్చుని ఏడుస్తూ దేవుడిని మొక్కుతూ ఉంటుంది. నర్స్ వచ్చి కార్తీక్‌ను మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పగానే కార్తీక్ వెళ్లిపోతాడు.
రాత్రి అవుతుంది. మాలిని ఇంట్లో కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసురా కార్తీక్. జ్యోత్స్నను షూట్ చేస్తారు అని తెలుసు అనుమానంతో నాకు కాల్ చేస్తావని కూడా తెలుసు. జ్యోత్స్నను ఎవరో షూట్ చేసి చంపేశారు అనే మాట వినకూడదు అనే నా ఫోన్ స్విచ్చాప్ చేశాను. మామయ్య గారి ఫోన్ కూడా నా దగ్గరే పెట్టుకున్నాను ఎవ్వరూ ఫోన్ చేసినా నాకు రాదు అనుకుంటుంది.
హాస్పిటల్‌లో ఉన్న మాలిని మనిషి సూరజ్‌ను చూసి షాక్ అవుతాడు. ఆ రౌడీ వెధవలు షూట్ చేసింది మాలిని మేడం కోడుకు సూరజ్ సార్‌ను ఈ విషయం తెలిస్తే మాలిని మేడం నన్ను బతకనివ్వదు.. కార్తీక్ నన్ను ఇక్కడ చూస్తే అనుమానపడతాడు అనుకుంటూ మాలిని మనిషి వెళ్లిపోతాడు. బయటకు వెల్లి మాలినికి ఫోన్ చేస్తాడు. స్విచ్చాప్ వస్తుంది. దేవుడా సూరజ్ సార్‌ను బతికించు లేకుంటే నేను చస్తాను అనుకుంటాడు ఆ వ్యక్తి.
డాక్టర్ ఆఫరేషన్ చేసి బయటకు వచ్చి బుల్లెట్ తీశామని పేషెంట్ స్పృహలోకి వస్తే ఏం చెప్పలేము అంటాడు. అందుకు కార్తీక్, దీప, జ్యోత్స్న బాధగా కూర్చుని ఉంటారు. ఇదంతా మాలిని చేయించిందా ఏంటి అని దీప అనుమానిస్తుంది. ఏమీ ఉండదని కార్తీక్ చెప్తాడు. మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుందని ఇంతకు ముందు నువ్వు చెప్పావు కదా బావ అదే ఇప్పుడు నాకు తిరిగి వచ్చింది అంటుంది.
మాలిని బాడీగార్డ్ దక్షిణమూర్తికి ఫోన్ చేసి మాలినికి ఫోన్ ఇవ్వమంటాడు. మాలిని ఫోన్ తీసుకోగానే.. సూరజ్‌కు బుల్లెట్ తగిలిందని చెప్తాడు. భయంతో మాలిని దక్షిణమూర్తికి విషయం చెప్పి హాస్పిటల్ కు తీసుకెళ్తుంది. హాస్పిటల్ లో పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే.. దక్షిణమూర్తి, మాలిని వెళ్తారు. మాలిని గొడవ చేస్తుంటే డాక్టర్ వచ్చి సౌండ్ చేయోద్దని తిడతాడు. సూరజ్‌ను చూడటానికి ఐసీయూలోకి వెళ్తుంది మాలిని డాక్టర్ బయటకు పంపిస్తాడు. బయటకు వచ్చిన మాలిని కోపంగా నా కొడుకును ఏం చేశావే జ్యోత్స్న అంటూ నిలదీస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.