Intinti Ramayanam Today Episode November 24th: గెలిచాను అని ఇంటికి వస్తుంది.. చక్రధర్ అలాగే మీనాక్షి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. కానీ పల్లవి మాత్రం మీ కూతురు ఓడిపోయింది నేను గెలిచాను అని మీరు బాధపడుతున్నారా అని వెటకారంగా మాట్లాడుతుంది. నీకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇక మీదట నువ్వు బుద్ధిగా ఉంటే నీకు ఆపురం నిలబడుతుంది లేదంటే మాత్రం నువ్వు మళ్ళీ రోడ్డు మీదకు రావాల్సిందే అని చక్రధర్వా ర్నింగ్ ఇస్తాడు.. పల్లవి మాత్రం భరత్ ప్రణతిల మధ్య దూరం పెంచే విధంగా మాట్లాడుతుంది. నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఎలా మార్చుకోరో నాకు బాగా తెలుసు ఆ ఇంట్లో వాళ్లకి ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తాను అని అంటుంది..
ఇక తర్వాత రోజు బయట ఏదో బాంబుల సౌండ్ వినిపించడంతో అందరూ కంగారు పడిపోతూ అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ మొత్తం బాంబులు పేలుస్తూ కనిపించడంతో ఏంటబ్బా అని అందరూ చూస్తూ ఉండిపోతారు కానీ ఆ బాంబులం పొగలోంచి పల్లవి అలా నడుచుకుంటూ వస్తుంది. రానున్నావు రాలేను అన్నావు ఎలా ఉంది మన గ్రాండ్ ఎంట్రీ అని పల్లవి అవనితో అంటుంది. పర్ఫామెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ పల్లవి వెటకారంగా మాట్లాడుతుంది. అయితే పల్లవిని అలా చూస్తున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. పల్లవి మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ అందరూ సీరియస్ అవుతారు కానీ కోర్టు నన్ను పంపించింది కదా అందుకే ఇలా వచ్చాను అని పల్లవి అనగానే అందరూ మౌనంగా ఉండిపోతారు..
పల్లవి ఇంట్లోకి రావద్దని చెప్పినా కూడా రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పల్లవి మళ్ళీ వచ్చింది అండి ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి అని అనుకుంటూ భయపడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ మళ్లీ నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు కానీ కోర్టు చెప్పింది కదా కలిసుండమని అని అనగానే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ఉన్న అవని దగ్గరికి వచ్చిన పల్లవి నా వెల్కం ఎలా ఉంది అని అడుగుతుంది పల్లవి.. మీరు ఎలాగో నాకు వెల్కమ్ చెప్పరు కాబట్టి నేనే నాకు నేనే వెల్కమ్ చెప్పుకున్నాను అని పల్లవి అంటుంది చూసావా నా గ్రాండ్ వెల్కమ్ ఎలా ఉంది చూసి షాక్ అయినట్టు ఉన్నది అని పల్లవి అడుగుతుంది. నేను షాక్ అవడం కాదు నువ్వు ఇలా ఎంట్రీ ఇచ్చావంటే కోర్టు చెప్పిందనే కదా నీ గురించి నువ్వు ఆలోచించుకో అని అనగానే వెనకాలే భానుమతి సడన్గా ఎంట్రీ ఇచ్చి పల్లవి గురించి నీకు తెలియదు అంటూ ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది.
పల్లవి కమల్ గదిలోకి ఎంటర్ అవ్వగానే తను మళ్ళీ తన సామ్రాజ్యానికి తిరిగి వచ్చాను అని చాలా సంతోషంగా ఉంటుంది పల్లవి. పల్లవి మళ్లీ ఇంట్లోకి వచ్చింది అంటే ఇంట్లో వాళ్లకి ఎన్నో సమస్యలు తెచ్చి పెడుతుంది. తనని అస్సలు ఇంట్లో ఉండడానికి వీలులేదని కమల్ చాలా సీరియస్ అవుతాడు. కానీ కోర్టు ఇచ్చిన పర్మిషన్ వల్లే అది వచ్చింది కదా. తనని బయటకు వెళ్ళమని చెప్పే హక్కు మీకు లేదు అని భానుమతి అంటుంది. ఇక పల్లవి లోపలికి వెళ్ళగానే కమల్ కూడా వెళ్లి మీరు వచ్చారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది బావ కోర్టు మనిద్దని కలిసి ఉండమని చెప్పింది కదా అని పల్లవి ఎంత చెప్తున్నా సరే పల్లవి బ్రీఫ్ కేస్ ని బయటికి తోసేస్తాడు కమల్. కోటి చా తీర్పు కాబట్టి కచ్చితంగా ఉండాలి అని పల్లవి అంటుంది అయితే కమల్ నువ్వు ఉంటే నేను ఉండను అని తన బ్యాగ్స్ ఒద్దుకొని వస్తాడు..
కమల్ నేను ఇంట్లో ఉండను అది ఈ నెల రోజులు ఉంటుంది కదా ఈ నెల రోజులు నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయాయి కమల్లి పక్కకు తీసుకొని వెళ్తారు. అయితే కమల్ని పక్కకు తీసుకుని వెళ్లిన అవని కమల్ బయటికి వెళ్తే జరిగే పరిస్థితుల గురించి వివరించి కమల్ అవని మాట విని లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :భావన లాస్య నెలకు ఎంత సంపాదిస్తుంది..? క్రేజే వేరప్పా..