E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode November 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరితో గేమ్‌ మొదలు పెట్టిన మంగళ  

Nindu Noorella Saavasam Serial Today Episode November 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరితో గేమ్‌ మొదలు పెట్టిన మంగళ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో జరిగిన పరిణామాలన్నీ ఆలోచిస్తూ.. అమర్‌ ఒక్కడే ఉంటే అప్పుడే రూంలోకి రాథోడ్‌, మిస్సమ్మ వెళ్తాడు. అమర్‌ కోపంగా రాథోడ్ ను వెళ్లిపోమ్మని చెప్తాడు. తనను ఒంటరిగా వదిలేయమని అంటాడు. రాథోడ్‌ వెళ్లిపోతుంటే.. మిస్సమ్మ మాత్రం అలాగే చూస్తుండిపోతుంది. అమర్‌ కోపంగా నీకు సపరేట్‌గా చెప్పాలా..? వెళ్లు ఇక్కడి నుంచి అంటాడు. మిస్సమ్మ కోపంగా చూస్తుంటే.. దిండు దుప్పటి ఇచ్చి మిస్సమ్మను రూంలోంచి గెంటేస్తాడు అమర్‌.

మిస్సమ్మ పిల్లల రూంలోకి వెళ్తుంది. రూంలో ఉన్న అమ్ము ఫోటో చూసి ఎమోషనల్‌ అవుతుంది. ఏంటి మిస్సమ్మ అలా చూస్తున్నావు అని ఆనంద్‌ అడిగితే రెండు రోజుల నుంచి అమ్ముకు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం లేదు. మీకేమైనా ఫోన్‌ చేసిందా అని అడిగితే.. తను ఎక్కడికో ఎక్స్‌కర్షన్‌ వెళ్తున్నానని చెప్పింది అందుకే ఫోన్‌ లిఫ్ట్ చేయడం లేదేమో అంటాడు ఆనంద్. అమ్మును చూడాలనిపిస్తుందని.. తనను బాగా మిస్ అవుతున్నామని మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతుంది.

Advertisement

ఆనంద్‌, ఆకాష్‌ కూడా ఎమోషనల్‌ అవుతూ అమ్ముతో ఉంటే నీతో అమ్మతో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండేదో అంత ధైర్యం ఉండేదని చెప్తారు. మిస్సమ్మ కూడా అమ్మను చూస్తే తనకు ఆరును చూసినట్టు ఉండేదని తను ఇక్కడే ఉండి చదువుకుంటానని ఎంతో ఆశపడింది కానీ హైయ్యర్‌ స్టడీస్‌ కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది అంటూ బాధపడుతుంటే.. ఎందుకు మిస్సమ్మ బాధపడతావు. అమ్ముకు మంచి లైఫ్‌ ఉండాలనే కదా డాడీ ఢిల్లీ పంపించారు అంటూ మిస్సమ్మను ఓదారుస్తారు ఆనంద్‌, ఆకాస్‌. అమ్ము త్వరలోనే తిరిగి వస్తుందిలే అంటారు. మిస్సమ్మ మాత్రం అమ్ము ఫోటో చూస్తూ కిస్‌ చేసి పక్కన పెట్టేస్తుంది.

ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లిన మంగళ తన ఫోన్‌లో కొత్త సిమ్ వేస్తుంది. పైకి ఆకాశంలోకి చూస్తూ.. రాకా రాక బంగారం లాంటి అవకాశం వచ్చింది. ఈ దెబ్బతో నేను సెటిల్‌ అయిపోవాలి నన్ను శ్రీమంతురాలిని చేసే బాధ్యత నీదే స్వామి అంటూ మొక్కుతూ నాకు లక్షలకు లక్షలు డబ్బు వస్తే నీకు నూటపదహారు రూపాయలు చదివించుకుంటాను స్వామి అంటూ మనోహరికి  కాల్‌ చేస్తుంది. మనోహరి ఫోన్‌ చంభా లిఫ్ట్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేస్తుంది. ఎవరో అనౌన్‌ నెంబర్‌ మనోహరి అని చంభా చెబితే.. ఎవరు అని మనోహరి అడుగుతుంది. మంగళ గొంతు మార్చి నేను ఎవరైతే నీకెందుకు కానీ నేను చెప్పేది శ్రద్దగా విను అంటుంది. ఏంటి చెప్పు అంటూ మనోహరి అడిగితే.. నీ భర్త పార్థు గురించి నాకు తెలుసు.. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా తెలుసు అంటుంది.

Advertisement

మంగళ మాటలకు మనోహరి, చంభా షాకింగ్‌గా చూస్తుంటారు. మనోహరి కోపంతో భయంతో ముందు నువ్వు ఎవరో చెప్పు అని అడుగుతుంది. అందుకు మంగళ కోపంగా నీకు నేను ఎవరో తెలియడం కావాలా..? పార్థు ఎక్కడున్నది కావాలా..? అని అడిగితే.. పార్థుయే కావాలి అంటూ మనోహరి చెప్తుంది. అందుకు మంగళ తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని అప్పుడే పార్థు అచూకీ చెప్తాను అంటుంది. పార్థు నీ దగ్గరే ఉన్నాడని సాక్ష్యం ఏమైనా ఉందా అంటూ మనోహరి అడిగితే.. సాక్ష్యం రేపు నీకు పంపిస్తాను.. అది చూశాకే నువ్వు నాకు డబ్బు పంపించు అంటూ మంగళ కాల్‌ కట్‌ చేస్తుంది. మనోహరి హలో హలో అంటూ తల పట్టుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

భావన లాస్య నెలకు ఎంత సంపాదిస్తుంది..? క్రేజే వేరప్పా..

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

రీల్స్‌లోనూ ఫుల్ ట్రెండింగ్.. ‘కొమ్మల బండున్నది ఉయ్యాలో’కు పెరుగుతున్న క్రేజ్!

ఏంటీ రష్మిక ముఖేష్ గౌడ్ మధ్య అలాంటి రిలేషన్ ఉందా? బిగ్ బాస్ వేదికపై బయటపడ్డ నిజం!

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

నాగవ్వ క్రేజ్ వేరే లెవల్.. వైష్ణవి సోనీ డాన్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

వర్షిణి ముఖంపై కాఫీ కొట్టిన సుధీర్.. బుద్ధిలేదన్న శివ!

Big Stories

Advertisement
×