E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు ప్రాణగండం ముంచుకొస్తుందన్న స్వామిజీ

Brahmamudi Serial Today Episode November 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు ప్రాణగండం ముంచుకొస్తుందన్న స్వామిజీ
Advertisement

Brahmamudi serial today Episode: రేఖ, భ్రమరాంబ ఇద్దరూ కలిసి శోభనం జరిగిన రూంలోకి వెళ్తారు. ఎందుకు రాజు, ఇందులకు షాక్‌ కొట్టలేదని వెతుకుతుంటారు. అప్పుడే శేషు వెళ్లి హ్యాండ్సప్‌ అంటాడు. మీరిద్దరూ శోభనం జరిగిన గదిలో ఏం వెతుకుతున్నారు. అంటూ అడగ్గానే.. మేమే ఏం చేయడం లేదు ముందు నువ్వు బయటకు వెళ్లు అన్నయ్య అంటుంది రేఖ. నేను వెళ్లను కదా అదేంటో తెలుసుకోవాలని అంటాడు శేషు. రేఖ బెడ్‌ మీద వెతికితే వైర్‌ కనిపిస్తుంది. వైర్‌ ఇక్కడే ఉంది కానీ వాళ్లిద్దరికీ ఏం కాలేదు ఏంటి అనుకుంటారు. వైర్‌ చెక్‌ చేస్తారు. వైర్‌ బాగానే ఉంటుంది. భ్రమరాంబ వైర్ తీసుకుని చెక్‌ చేస్తుంటే..

శేషు ఎందుకు రావడం లేదబ్బా ఏమై ఉంటుంది అంటూ వెతుకుతూ వెళ్లి స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆన్‌ చేస్తాడు. భ్రమరాంబకు షాక్ తగిలి కింద పడిపోతుంది. రేఖ భయంతో అన్నయ్య ఏం చేశావు అని అడిగితే స్విచ్‌ ఆఫ్‌లో ఉంటే ఆన్‌ చేశాను అంటాడు. ఇప్పుడెలా అంటూ రేఖ అడిగితే.. చేస్తాను ఉండు అంటూ మళ్లీ వైర్లు తీసుకుని భ్రమరాంబకు షాక్‌ ఇస్తాడు. దెబ్బకు భ్రమరాంబ లేచి కూర్చుంటుంది. కోపంతో శేషును తిడుతుంది. శేషు మాత్రం ఆ దేవుడి స్క్రిప్ట్‌ ముందు మీ స్క్రిప్ట్‌ ఏం పనిచేయదు అంటాడు.

Advertisement

కిచెన్‌లో ఉన్న ఇందు దగ్గరకు వెనక నుంచి వెళ్లిన రాజు చేయి వేయగానే.. ఇందు ఉలిక్కిపడుతుంది. ఏంటి అలా అరిచావు అంటూ రాజు అడిగితే.. వెనక నుంచి చేయి వేస్తే గుండె ఝల్లుమంది అంటుంది ఇందు. నీ మీద  వెనక నుంచి వేరే ఎవరు చేయి వేస్తారు.. చంపేస్తా అంటే.. అది సరే కానీ ఎందుకు వచ్చావు చెప్పు అంటే ముద్దు ఇవ్వమని రాజు అడుగుతాడు. ఇవ్వనని నన్ను ముట్టుకోవాలంటే బెడ్‌ రూంలోనే అంటుంది. ఎలాగైనా నిన్ను ముద్దు పెట్టుకుంటానని కిస్‌ చేయబోతుంటే.. అపర్ణ వస్తుంది. ఇద్దరూ షాక్‌ అవుతారు. అపర్ణ, రూంలోకి వెళ్లి సుభాష్‌తో విషయం చెప్పి చాలా హ్యాపీగా ఫీలవుతుంది.

ప్రశాంత్‌ ఎవరో డాక్టర్‌కు ఫోన్‌ చేసి డబ్బు త్వరలోనే ఇస్తానని నాకు మా అమ్మకంటే ఏదీ ఎక్కువ కాదని చెప్తాడు. వెనక నుంచి వచ్చిన రాజు, ఇందు ఏం ప్రశాంత్‌ ఏదో ప్రశాంతంగా మాట్లాడుతున్నావు అని అడిగితే.. ఏదో సార్‌ ఫ్యామిలీ మ్యాటర్‌ అని ప్రశాంత్‌ చెబితే.. ఏంటి గర్ల్‌ఫ్రెండా అంటాడు ఇందు. అంత లేదు సార్‌ నాకు అంటూ ప్రశాంత్‌ చెప్పగానే.. రాజు అదేం లేదు అంటూ అమ్మాయిలతో ఎలా ఉండాలో చెప్తాడు రాజు.

Advertisement

మరోవైపు అపర్ణ, సుభాష్‌ గుడికి వెళ్లి స్వామిని కలుస్తారు. మీరు చెప్పినట్టే రాజు, ఇందులకు పెళ్లి చేశామని వాళ్లిప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్తారు. కానీ స్వామిజీ మాత్రం ఎవరికో నిర్ణయించిన ముహూర్తంలో రాజు తాళి కట్టాడు. అంటే అది రాజు జీవితంలో ఏ మార్పును తీసుకురాలేదు. రాజుకు ప్రాణగండం ఇంకా పొంచి ఉంది. గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. ప్రమాద ఘడియలు సమీపిస్తున్నాయి. మృత్యువు ఏ క్షణంలోనైనా..? ఏ రూపంలోనైనా రావొచ్చు. మృత్యువు శత్రువు రూపంలో ఇప్పటికే రాజు జీవితంలోకి ప్రవేశించింది అంటూ స్వామిజీ చెప్పగానే.. అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు.

రుద్రప్రతాప్‌ డీల్‌ ఐశ్వర్య కంపెనీకే దక్కుతుంది. ఆ విషయం తెలిసి ఇందు బాధపడుతుంది. నేను అనుకున్నట్టుగానే జరిగింది. ఇక ఆ ఐశ్వర్య రెచ్చిపోతుంది. అంటే అవును వాళ్లు ఏదో చేశారు.. అందుకే ఇలా జరిగింది అంటాడు రాజు. ఆఫీసులో ఉన్న ఐశ్వర్య డీల్‌ తమకే వచ్చిందని చూసి హ్యాపీగా ఫీలవుతుంది. రఘువీర్‌ను హగ్ చేసుకుంటుంది. వెంటనే దూరంగా జరిగి.. ఈ డీల్‌ తనకు ఎంత ముఖ్యమో చెప్తుంది. రఘువీర్‌ నవ్వుతుంటాడు. ఐశ్వర్య తాను చేయాల్సిన పనుల గురించి రఘువీర్‌కు చెప్తుంది. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: ఇదేం ట్విస్ట్ రా అయ్యా.. అవనికి బిగ్ షాక్.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరితో గేమ్‌ మొదలు పెట్టిన మంగళ  

భావన లాస్య నెలకు ఎంత సంపాదిస్తుంది..? క్రేజే వేరప్పా..

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

రీల్స్‌లోనూ ఫుల్ ట్రెండింగ్.. ‘కొమ్మల బండున్నది ఉయ్యాలో’కు పెరుగుతున్న క్రేజ్!

ఏంటీ రష్మిక ముఖేష్ గౌడ్ మధ్య అలాంటి రిలేషన్ ఉందా? బిగ్ బాస్ వేదికపై బయటపడ్డ నిజం!

లక్ష రూపాయల ఖర్చు, మూడేళ్ల ఆర్థిక కష్టాలు.. ‘అమృతం’ వెనుక ఇంత కథ ఉందా?

Big Stories

Advertisement
×