E-Paper
Advertisement

లారీని ఢీ కొట్టిన జీపు.. స్పాట్‌లో ఆరుగురు మృతి, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు

లారీని ఢీ కొట్టిన జీపు.. స్పాట్‌లో ఆరుగురు మృతి, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
Advertisement

Road Accident: శీతాకాలం సీజన్ వేళ.. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు స్పా‌ట్‌లో మృతి చెందారు. అసలు ఘటన ఎలా జరిగింది?

విజయనగరం, పల్నాడు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు

విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుందరపేట సమీపంలో వేగంగా వస్తున్న జీపు.. లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లో మృతి చెందారు. ప్రమాదానికి గురైన వాహనం.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వస్తోంది. ఈ సమయంఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తలించారు.

Advertisement

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు భోగాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై రవాణా శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

స్పాట్‌లో ఆరుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రహదారి భద్రతా చర్యలు పటిష్టం చేయాలని అధికారులకు సూచన చేశారు. ప్రమాద బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

మరోవైపు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమరావతిలోని ఓ ఆలయంలో రాత్రి నిద్ర చేసి తిరిగి వెళ్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. స్పా్ట్‌లో ఇద్దరు మృతి చెందారు. మృతులు క్రోసూరు ప్రాంతానికి చెందినవారు. పూర్ణ చంద్ర, దగ్గుబాటి శ్రీనివాసరావు మరణించారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.

ALSO READ: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇక భక్తులకు పండగే, ఆ విధంగా చేస్తే టికెట్ ఈజీ

 

Related News

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు.. ఇక భక్తులకు పండగే, ఆ విధంగా చేస్తే టికెట్ ఈజీ

వైఎస్ షర్మిల బెంగళూరు వ్యవహారంపై అంబటి ఫైర్.. ఏమన్నారంటే?

ఎలాంటి నిర్ణయం లేకుండా ముగిసిన KRMB భేటీ.. కృష్ణా డెల్టాకు చుక్క నీరు ఇవ్వం: తెలంగాణ ENC

శ్రీకాకుళం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ జోరు.. ప్రభుత్వ వైఫల్యాలపై ధర్మాన ప్రసాద్ రావు ఫైర్

చీపురుపల్లి సభలో బొత్స సత్యనారాయణ ప్రసంగం.. మధ్యలోనే కరెంట్ నిలిపివేత!

ఏపీలో కొత్త అధ్యాయం.. నేడే కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం.. పట్టణాల్లో పండగ వాతావరణం!

యలహంక ప్యాలెస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు

Big Stories

Advertisement
×