Intinti ramayanam serial pallavi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్(Intinti ramayanam serial) ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇక ఈ సీరియల్ ముగ్గురు అన్నదమ్ముల కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లో పల్లవి పాత్ర (Pallavi Role) విలన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా పల్లవి పాత్రలో కన్నడ ముద్దుగుమ్మ యశస్విని గౌడ(Yashaswini Gowda) నటిస్తున్నారు. తన విలనిజంతో ఈమె ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా బుల్లితెరపై విలన్ గా నటిస్తున్న యశస్విని గౌడ నిజజీవితంలో ఏం చదువుకున్నారు ఈమె సీరియల్స్ చేయకముందు ఏం చేసేవారు అనే విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఇక యశస్విని గౌడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలో కొనసాగారు. ఇలా మోడలింగ్ రంగంలో కొనసాగుతున్న ఈమె నటనపై ఆసక్తి కలగడంతో కన్నడ బుల్లితెరపై ప్రసారమవుతున్న డాన్స్ షో లలో పాల్గొంటూ సందడి చేశారు. ఇలా డాన్స్ షో లలో డాన్సర్ గా కొనసాగిన ఈమె అనంతరం కన్నడ బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక తెలుగులో ఈమె భాగ్యరేఖ అనే తెలుగు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సీరియల్ అనంతరం ఇంటింటి రామాయణం సీరియల్ చేసే అవకాశాన్ని అందుకున్నారు.
ఇక ఈ సీరియల్ లో పల్లవి అనే నెగటివ్ పాత్రలో యశస్విని గౌడ ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న యశశ్విని తెలుగులో పలు సినిమాలలో కూడా నటించారు . లాస్ట్ పెగ్, నా సామి రంగ వంటి సినిమాలలో ఈమె నటించారు. ఈమె తన ఫస్ట్ రెమ్యూనరేషన్(First Remuneration ) గురించి కూడా ఈ సందర్భంగా తెలియ చేశారు. తాను మోడలింగ్ రంగంలో కొనసాగుతున్న సమయంలో మొదటి పారితోషకంగా 5000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలియజేశారు.
ఇలా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ 5 వేల రూపాయలను తీసుకున్న యశస్విని గౌడ బయటికి ప్రస్తుతం ఒకరోజు సీరియల్ షూటింగ్లో పాల్గొంటే ఏకంగా 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా సీరియల్ ద్వారా మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా భారీ స్థాయిలో సంపాదిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే యశస్విని గౌడ తనకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
Also Read: ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ కామెంట్స్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!