E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? ప్రభా బుట్టలో పడింది.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుందా..? ప్రభా బుట్టలో పడింది.. రోహిణి ప్లాన్ సక్సెస్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 6th: ఉదయం మనోజ్ రోహిణి తీసుకొని తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని అనుకుంటాడు. అయితే ప్రభావతి మాత్రం మనోజ్ రోహిణి కలిసి వెళ్లడానికి అస్సలు ఒప్పుకోదు. మీరిద్దరూ కలిసి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వొక్కడివే వెళ్ళు అని ఎంత చెబుతున్నా సరే మనోజ్ మాత్రం ఇద్దర్ని రమ్మన్నారు అమ్మ బాగోదు కదా అని బ్రతిమలాడుతాడు కానీ ప్రభావతి మాత్రం అస్సలు వినకుండా నువ్వు ఒక్కడివే వెళ్తే వెళ్ళు లేకపోతే ఇంట్లో కూర్చొని అంటుంది. ఇక అత్తయ్యకు ఎందుకు మనోజ్ నువ్వు కోపం తెప్పిస్తావు నువ్వు వెళ్లేసి రా నేను ఇంట్లోనే ఉంటాను అని రోహిణి అంటుంది.. ఇక మనోజ్ వెళ్తుంటే అరే నీ భార్య నువ్వు తీసుకెళ్లడానికి అమ్మ పర్మిషన్ ఏంట్రా నువ్వు తీసుకొని వెళ్ళాలి గాని నీ భార్య మీద అమ్మ పెత్తనం ఏంటి అని బాలు గడ్డి పెడతాడు ఇంక మనోజ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

రోహిణిని ఇరికించేందుకు గుణ ప్లాన్..

ఇక గుణ ఎన్నిసార్లు డబ్బులు సాయం చేసినా కూడా రోహిణి ఆ కృతజ్ఞత కూడా లేకుండా నన్ను కొట్టింది ఎలాగైనా సరే తన మీద కక్ష తీర్చుకోవాలి. తనకి సరైన బుద్ధి చెప్పాలి అని గుణ ప్లాన్ చేస్తాడు. దాంతో రోహిణి ఆ ప్లాన్ గురించి తెలియక అడ్డంగా ఇరుకుంటుంది.. నా ఫోన్ చేసి రమ్మని చెప్పగానే ఏమైంది ఏంటి అని అక్కడికి వెళుతుంది. అయితే గుణ నన్ను కొట్టావు కదా.. అని అడిగితే నేను నిన్ను ఏమి కొట్టలేదు నువ్వు ఎక్కడ నిజం చెప్తావు అని అలా చేశాను అంతే అని అంటుంది. అయితే ఇక గుణ ఒక చైన్ చూపించి దాన్ని ఎలాగైనా సరే నువ్వు కొనాలి ఇది కేవలం లక్ష రూపాయలు అని చెప్తాడు. నమ్మేసిన రోహిణి దాన్ని కొనేందుకు ప్రయత్నిస్తుంది..

గుణ బుట్టలో పడ్డ రోహిణి..

Advertisement

రోహిణి ఎలాగైనా సరే ఈ నగని కొనేలా చేయాలి అని గుణ పక్క ప్లాన్ చేస్తారు. రోహిణి తనని కొట్టడానికి కారణమైంది అని ఎలాగైనా సరే.. అయితే రోహిణిని ఎలాగైనా అడ్డంగా ఇరికించాలి. అప్పుడు నేను మనశ్శాంతిగా ఉంటాను అని గుణ ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్లుగానే రోహిణి అని పిలిచి ఆ నెక్లెస్ ని చూపిస్తాడు తక్కువ రేటుకు వస్తుంది. నువ్వు కొంటావు కదా అని మీకు చూపించాను అని అంటాడు. అయితే అది చూసిన రోహిణి ఎలాగైనా సరే ఈ నెక్లెస్ తో అత్తయ్య నా బుట్టలో వేసుకోవాలి అని అనుకుంటుంది.. అయితే విద్యని అడిగి డబ్బులు తీసుకొని ఆ నగల్ని ఎలాగైనా కొనుక్కోవాలి అని ప్రభావతి అనుకుంటుంది.. మొత్తానికి గుణ ప్లాన్ లో అడ్డంగా ఇరుకుంటుంది రోహిణి..

ప్రభావతి పై బాలు సెటైర్..

ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది అయితే అప్పుడే మనోజ్ వచ్చి రోహిణి ఎక్కడ అని అడుగుతాడు ఏమో ఎవరు కొంపలు కూల్చడానికి వెళ్లిందో అని అంటుంది.. అయితే ప్రభావతి మాటతో రోహిణి చాలా ఫీల్ అవుతుంది. ఇక ఏమీ మాట్లాడకుండా అప్పుడే రోహిణి ఇంట్లోకి వచ్చి అత్తయ్య ఇది మా అమ్మ కోసం తీసుకుని వచ్చాను.ఎలా ఉందో చూడండి అంటే ఇక్కడ ఎవరు మీ అమ్మ మీ అమ్మ ఉందా అని అడుగుతుంది ప్రభావతి. మా అమ్మ లాంటి మీ కోసమే ఇది తీసుకుని వచ్చాను అని అనగానే శృతి సైడ్ గా బిస్కెట్ అంటూ కౌంటర్లు వేస్తుంది.. అయితే రవి శృతి ఇద్దరూ ప్రభావతి ఆ నక్లెస్ ని తీసుకుంటుంది అని బెట్టు పెట్టుకుంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు మాత్రం సెటైర్ల వర్షం కురిపిస్తాడు.

ప్రభాను రెచ్చగొట్టిన బాలు..

Advertisement

ప్రభావతి మాటతో బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఇలా నగలు తీసుకొని వచ్చి నన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా.. నగల కి వగలు చూపించే ఆడదాన్ని కాదు. నేను నాకు నగలు మీద అంత మోసేమీ లేదు అని ప్రభావతి అనగానే బాలు ఏంటి నాగావతి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తాడు. ఇక తర్వాత ప్రభావతిపై కౌంటర్లు వేయడంతో పాటుగా రోహిణి అని కూడా కలిపి తిడుతూ ఉంటాడు అంతే కాదు ఇంటి కోసం అని కూడా పెట్టాలి కదా అని ఒక డబ్బా తీసుకొని వచ్చి అందులో వేయమని అంటాడు మనోజ్ సచ్చిన వెయ్యను అని అంటాడు. మింగింది మీరే కాబట్టి మీరే ఇంటిని విడిపించాలి అని మనోజ్ కి కూడా చుక్కలు చూపించేలా మాట్లాడుతాడు.. మొత్తానికి ఆ డబ్బాలు వేసేటప్పుడు ప్రభావతి రోహిణి తెచ్చిన అన్నాక చాలా బాగుంది అని దాన్ని తీసుకుంటుంది. ఇక బాలు అస్సలు సిగ్గులేదు అంటూ ఒకడి నుంచి వెళ్ళిపోతాడు రోహిణి తెచ్చిన తీసుకుంటుంది అని బెట్టు వేసిన శృతి గెలుస్తుంది. మొత్తానికి ఎపిసోడ్ కాస్త సరదాగా సందడిగా సాగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. భరత్ మాటతో షాక్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Related News

Brahmamudi Serial Today Episode November 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు విషయంలో ఐశ్వర్య సక్సెస్ అవుతుందా..?   

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. భరత్ మాటతో షాక్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Telugu TV Serials: వీక్లీ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..!

Friday TV Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

బిగ్ బాస్ లో సుధీర్‌ను గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మి స్పెషల్ రిక్వెస్ట్!

మంగ్లీ వర్సెస్ ప్రభ.. ఫోక్ సాంగ్స్‌లో అసలు వార్ మొదలైందా?

వీధికొక రాక్షసులు ఉన్నారు.. రాజకీయ నాయకులపై మురళీమోహన్ కామెంట్స్!

Big Stories

Advertisement
×