Jabardasth Faima: ఫైమా పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై ప్రసారం అయిన పటాస్ అనే కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం జబర్దస్త్ (Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా మరింత ఫేమస్ అయిన ఫైమా (Faima)ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఫైమా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడమే కాకుండా ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియచేస్తూ ఉంటారు. ఇకపోతే ఫైమా గత కొద్ది నెలల క్రితం తన ప్రియుడు ప్రవీణ్ (Praveen)తో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఫైమా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మరి కొంతమంది ఈమెపై విమర్శలు చేస్తున్నారు. ఫైమా తల్లి కాబోతున్నట్టు ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
ఇక ఈమె ఒక హాస్పెటల్ కి వెళ్ళాక అక్కడ డాక్టర్ కంగ్రాట్స్ చెబుతూ తన ప్రెగ్నెన్సీ (Pregency)కన్ఫర్మ్ చేశారు. ఇక ఫైమా తల్లి కాబోతున్నట్టు తెలియడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే ఈమె ఇలాంటి గుడ్ న్యూస్ మీరు కూడా వినాలి అనుకుంటే ఈ హాస్పిటల్లో చికిత్స తీసుకోండి అంటూ హాస్పిటల్ ప్రమోట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ అభిమానులు మాత్రం అయోమయంలో ఉండిపోయారు. నిజంగానే ఫైమ తల్లి కాబోతున్నారా? లేదంటే ఈ హాస్పిటల్ ప్రమోట్ చేయడం కోసం తల్లి కాబోతున్నట్టు నటించారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
?exln=MXR3aW1yajNidGJjeg%3D%3D
ఈ నేపథ్యంలోనే మరి కొంతమంది ప్రమోషన్ల కోసం మరి ఇలా తల్లి అయినట్టు సంబరపడటం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. మరి నిజంగానే ఫైమా తల్లి కాబోతున్నారా? లేదంటే హాస్పిటల్స్ ప్రమోషన్ లో భాగమా? అనేది తెలియాలి అంటే ఈ విషయంపై ఫైమా స్పందించాల్సి ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఫైమా ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించారు. ప్రస్తుతానికైతే అలాంటి గుడ్ న్యూస్ ఏమీలేదని ఏదైనా ఉంటే కచ్చితంగా ముందుగా మీతోనే షేర్ చేసుకుంటారని తెలిపారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఫైమా ఉన్నపలంగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
Also Read: రూమర్లకు చెక్.. పండగకే రాబోతున్న ‘కాకా’ .. డైరెక్టర్ క్లారిటీ!