Bangaru Gajulu:బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు అంటూ అద్భుతమైన పాటని రాసి మనందరిని ఎంతగానో ఆకట్టుకున్న లక్ష్మణ్ ఆలియాస్ బుల్లెట్ బండి లక్ష్మణ్ తాజాగా బంగారు గాజులు అంటూ మరో పాటతో నెట్టింట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
బాసింగ బలాలు పాటతో సోషల్ మీడియాని షేక్ చేసిన వైష్ణవీ సోనీ ,అత్తగారింటికి అనే పాటతో ఆడియన్స్ కి బాగా దగ్గరైన కిట్టు పవన్ జోడీగా వచ్చిన ఈ ఫోక్ సాంగ్ ఇపుడు ఆడియన్స్ ని ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని ఉర్రూతలూగిస్తుంది.ఫోక్ మ్యూజిక్ కి కేరాఫ్ అయిన కళ్యాణ్ కీస్ సంగీతంలో బొద్దు దిలీప్ ,శ్రీనిధి కలిసి పాటకి లీడింగ్ బాయ్స్ కొరియోగ్రఫీ అందించారు.
ఫోక్ ఫ్లో కి మోడరన్ మ్యూజిక్ టచ్
పాట విషయానికి వస్తే ఫోక్ ఫ్లో కి మోడరన్ మ్యూజిక్ టచ్ చేస్తూ ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ పాట ఉండటంతో ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారంతా.అయితే సాంగ్ బాగుంది అంటూ కొంతమంది అంటుంటే ఎక్కువ శాతం మంది పాటకి అన్నీ సరిగ్గా కుదిరాయి కానీ, లీడింగ్ బాయ్స్ అందించిన కొరియోగ్రఫీ అసలు ఏ మాత్రం సూట్ కాలేదంటూ పెదవి విరుస్తున్నారు,ముఖ్యంగా ఫాస్ట్ బీట్ కి అలా స్లో గా డాన్స్ కంపోజ్ చేయడం ఏంటని నెగెటివ్ కామెంట్స్ వదులుతున్నారు.అయితే కామెంట్స్ ఎలా వచ్చినప్పటికీ పాట మాత్రం నెట్టింట్లో దూసుకుపోతుండటం విశేషం.చూస్తుంటే ఇది కూడా త్వరలోనే మిలియన్ల వ్యూస్ కొట్టేలానే కనిస్తుంది.
ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మే
ఇందులో లీడ్ రోల్ పోషించిన వైష్ణవీ సోనీ విషయానికి వస్తే ఇపుడు ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మే దర్శనం ఇవ్వడం విశేషం.తట్టుకోలేనే,మల్లె చెట్టు కింద కూర్చున్న,గున్న గున్న ఓయ్,పోరి రాయే జాతర,బాగుంది బాగుంది,బాసింగ బలాలు, బుగ్గసుక్క పెట్టుకొని అంటూ ఎన్నో పాటలతో అలరించిన వైష్ణవీ సోనీ రాబోయే రోజుల్లో ఫోక్ ఇండస్ట్రీమీ ఎలేలానే కనిపిస్తుంది.
ఇక వైష్ణవీ సోనీ కి జోడీగా నటించిన కిట్టు పవన్ కూడా ఇప్పటికే ఎన్నో పాటలలో నటించి మెప్పించిన వాడే.ముఖ్యంగా అతడు స్టెప్పులేసిన అత్తగారింటికి (Athagaarintiki),మామిడాకులు (Mamidakulu),సిత్తురాల సిత్తమ్మా (Sitthuraala Sitthamma) అంటూ పలు సూపర్ హిట్ అతని కెరీర్ లో వచ్చినవే.
ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !
ఇక బుల్లెట్టు బండి లక్ష్మణ్ విషయానికి వస్తే (Bullettu Bandi),వింటున్న ఓ పిల్ల (Vintunna O Pilla),వింటున్న ఓ పిల్ల 2 (Vintunna O Pilla 2),సీనయ్య గుండున్నదే, (Seenayya Gundunnadhe),సంతూర్ పాప (Santoor Papa),అత్తగారింటికి (Athagaarintiki)అడుగేస్తే వండర్ (Aadugesthe Wonder),భాయ్ బోల్తే (Bhaai Bolthe),పెద్దిరెడ్డి (Peddi Reddy),సూటేస్కో భీంరావు భోలే (Sutesko Bheemrao Bhole),అల్లహె అల్లా అంటూ అతడి నుండి వచ్చిన ఎన్నో పాటలు మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి లక్ష్మణ్ సత్తా ఏంటో సాలిడ్ గా సత్తా చాటాయి .
చూడాలి మరి తాజాగా వచ్చిన ఈ బంగారు గాజులు అనే పాట ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !