Jyothi Poorvaj: జ్యోతి పూర్వజ్ అంటే సినీ ప్రేక్షకులకు మాత్రమే ఈమె గుర్తుకు వస్తారు కానీ, జగతి మేడం(Jagathi Madam) అంటే మాత్రం టక్కున బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఈమె గుర్తుకొస్తారు. కన్నడ నటిగా గుర్తింపు సంపాదించుకున్న జ్యోతి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. గుప్పడంత మనసు సీరియల్లో హీరో రిషి పాత్రలో నటించిన ముఖేష్ గౌడ్ కు తల్లిగా జగతి పాత్రలో ఈమె నటించిన సందడి చేశారు.
ఇలా జగతి పాత్ర ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె ఈ సీరియల్ మధ్యలోనే తప్పకున్న సంగతి తెలిసిందే. జగతి పాత్రను మధ్యలోనే తీసేయడంతో అభిమానులు అప్పట్లో ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. అయితే ఇటీవల తన కిల్లర్ సినిమా (Killer Movie) ప్రమోషన్లలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నా జ్యోతి పూర్వజ్ గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా ఈ సీరియల్ మంచి తప్పుకోవడానికి కూడా కొన్ని కారణాలను ఈమె తెలియజేశారు.
గుప్పెడంత మనసు సీరియల్లో తన జగతీ పాత్ర చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. తన పాత్ర మొదట్లో అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేది. అయితే ఉన్నపలంగా తన పాత్రలో పూర్తిగా మార్పులు చేశారని జ్యోతి తెలిపారు. కథలో మార్పులు కారణంగా నా పాత్రకు పూర్తిగా వ్యాల్యూ తగ్గిపోయిందని, హీరో హీరోయిన్ల పాత్రలను ఎలివేట్ చేయడంతో నా పాత్రను దారుణంగా రాసేవారు. ఒకప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండే జగతి ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఇంట్లోనే ఆగిపోవడం అనేది చాలా దారుణం. తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉండడంతో చాలా బాధపడ్డానని జ్యోతి పూర్వజ్ (Jyothi Poorvaj)తెలియచేశారు.
ఇలా తన పాత్రకు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కని నేపథ్యంలోనే తన పాత్రను ఈ సీరియల్లో చంపేస్తారని జ్యోతి పూర్వజ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈమె గుప్పెడంత మనసు సీరియల్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సీరియల్ తర్వాత ఈమె పూర్తిగా బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటిగా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల తన భర్త సుఖ పూర్వజ్ దర్శకత్వంలో కిల్లర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే జ్యోతి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
Also Read: 14 ఏళ్లుగా వనవాసం చేస్తున్నా.. విడాకులపై రేణు దేశాయ్ ఎమోషనల్!