Gundeninda GudiGantalu Today episode November 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం ను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు. నాన్న ఇప్పుడు అయింది ఇకమీదట ఇలా అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే మీకు స్టంట్ లు వేశారు మీరు జాగ్రత్తగా ఉండాలని మనోజ్ చెప్తాడు. అసలు లక్షల అయ్యాయి. డబ్బులు ఎక్కడి నుంచి కట్టారు అని అడగగానే ఎవరు నోరు మెదపరు. ప్రభావతి నువ్వైన చెప్పు అనేసి అడుగుతాడు. బాలు కారు అమ్మేశాడని చెబుతుంది. బిల్ ఎంత అయిందని అడుగుతాడు. ఐదు లక్షల అయ్యాయని చెప్తుంది. ఇంటి పత్రాలు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు అని సత్యం అడుగుతాడు. ఇంకెక్కడ ఇంటి పత్రాలు అది పోతూ పోతూ ఇంటి పత్రాలు కూడా తీసుకొని పోయిందని ప్రభావతి అంటుంది. ఇంటి పత్రాలు నా దగ్గరే ఉన్నాయి మీనా నాకు అదే రోజు ఇచ్చింది అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఇక మీనాను బాలు తీసుకొని వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనాను బాలు ఇంటికి తీసుకొని వస్తాడు. మీనా సత్యం కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. నా తప్పు లేదు అని చెబుతుంది. రవి నాకు చెప్పకుండా చేసుకున్నాడు. పెళ్లి ఆపమని చెప్పి తీసుకెళ్లాడు. కానీ ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు అని అంటుంది. ఇక మీనా ను అందరూ తలా ఒక మాట అంటారు. అల్లరి ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని నాకు దూరం చేసింది అని ప్రభావతి మీనా పై కోపంతో రగిలిపోతుంది. ఇక మీనా శృతి తో మాట్లాడి పెళ్లిని వాయిదా చేసుకోమని చెప్పడానికే వెళ్లాను మామయ్య కానీ నన్ను బయట పెట్టి లోపల పెళ్లి చేసుకున్నాడు నేను లోపలికి వెళ్లి చూస్తే లోగా పెళ్లయిపోయింది అనేసి అంటుంది. కానీ బాలు మాత్రం వినడు. సాక్షి సంతకం పెట్టావా వీళ్ళ పెళ్లికి నేనే పెద్ద అని అక్కడే ఉన్నావా అంటాడు. ఇక రోహిణి కూడా ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి పెద్ద తప్పు చేశావు మీనా? ఇంట్లో వాళ్లకి చెప్పి ఉంటే ఇప్పుడు మావయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు కాదు ఆరోగ్యం ఎంత క్షీణించిందో చూసావు కదా అనేసి అంటుంది. నువ్వు నాతో ఉన్నవని మనతో ఎవరు లేకపోయినా ఇక సత్యం చివరగా నా కూతురుగా నేను ఇంటికి తీసుకొచ్చాను కానీ నాకు అబద్ధం చెప్పావు చూడు అదే నాకు బాధగా ఉంది అమ్మ అనేసి అంటాడు. దానికి మీనా నన్ను నమ్మించి అబద్ధం చెప్పేలా చేశాడు మావయ్య ఆ రవి అందుకే అలా చెప్పాను నన్ను క్షమించు మామయ్య ఇకమీదట మీ మాటను ఎప్పుడూ జవదాటననేసి చెప్తుంది.
ఇక మీనా బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. బాలు పెట్టిన వస్తువులను చూసి ఈయన ఇక మారడు అనుకుంటూ ఆ వస్తువులను తీసి సర్దుతుంది. ఇంటి వాళ్లకి భారం కాకూడదు మేటినిటి వాళ్ళకి ఇకమీదట నా గురించి ఎటువంటి సమస్యలు రావద్దు అనేసి అనుకుంటుంది. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. భోజనం పెట్టమంటారా అని అడుగుతుంది. దానికి బాలు నేను తినేసి వచ్చాను అనేసి అంటాడు. మీరు నాతోనే ఉన్నారు కదా.. మరి భోజనం ఎప్పుడు చేశారు అంటుంది మీనా.. కోపం భోజనం మీద చూపించకండి అంటుంది. బాలు నేను నీ మీద ప్రేమతో ఇక్కడికి తీసుకురాలేదు మా నాన్న చెప్తే నేను ఇక్కడికి తీసుకు వచ్చాను అని మీనా తో అంటాడు. మన పరువు పోవడానికి నువ్వే కారణం అనేసి మీనా పై కోపంతో రగిలిపోతాడు. ఇక మీనా నేను చెయ్యను తప్పుకి నన్ను అక్కడ పోలీసులు దొంగలు అందరూ ఉన్నారు అందరూ చూస్తుండగానే నన్ను కొట్టారు మరి నేను మిమ్మల్ని అడగలేదే అనేసి అంటుంది. నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టలేదు నువ్వు నీ మీద ప్రేమ పొంగిపోయి నేను ఇక్కడికి తీసుకురాలేదు మా నాన్న చెప్తేనే నేను ఇక్కడ తీసుకొచ్చాను ఈ కూర్చి ఈ బల్ల ఈ మంచం ఎలా ఉన్నాయో నువ్వు అలానే ఒక వస్తువుతో సమానం అని బాలు అంటాడు. ఎప్పటి వరకు అని నేను అడుగుతుంది. దానికి బాలు జీవితాంతం ఇలానే ఉంటాను ఇంతే అని వెళ్ళిపోతాడు.
కిందకు వెళ్లగానే సత్యం కూర్చుని ఉంటాడు. ఇంకా ఆయింట్మెంట్ రాసుకోలేదా నువ్వు ఇంకా పడుకోలేదా నాన్నా అనేసి బాలు అంటాడు. నువ్వు ఇంకా పడుకోమని తెలిసే నేను వచ్చాను రాసుకొని పడుకో నాన్న ఈ చేతికే కదా స్టంట్ వేసింది. రెండు మూడు రోజులు నొప్పి వాపు ఉంటుందని డాక్టర్ చెప్పాడు ఆయింట్మెంట్ రాసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పాడు నేను ఆయింట్మెంట్ రాస్తానని చెప్తాడు. సత్యం మీనా తండ్రి లేని పిల్ల అందరూ మీనానంటే తండ్రి లాంటి భర్తకు చెప్పుకుంటుంది కానీ నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అనేసి క్లాస్ పీకుతాడు సత్యం. అలాగే నాన్న నువ్వు వెళ్లి పడుకో అనేసి బాలు అంటాడు.
ఇక రవి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శృతి షాపింగ్ వెళ్లి వస్తుంది. నన్ను పిలిచి ఉంటే నేను వచ్చేవాడిని కదా అని అడుగుతాడు. ఫుల్లు నిద్రలో ఉన్నావ్ లేపడం ఎందుకులే అని నేనే వెళ్లి తీసుకొచ్చాను అని అంటుంది శృతి. నా సెలక్షన్ బాగుంటుంది నేను తీసుకెళ్లి ఉంటే నేను సెలెక్ట్ చేసేవాన్ని కదా అని రవి అంటాడు. శృతి ఒక్క నా విషయం తప్ప నీ సెలక్షన్ పూర్ అనేసి అంటుంది. మన పెళ్లికి అబ్బాయికి అమ్మ ఇంటి వాళ్ళు రింగు పెట్టాలి నేను చాలా సీరియల్స్లలో డబ్బింగ్ చేసేటప్పుడు చూశాను అందుకోసమే ఇప్పుడు మనం పెళ్లి తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నాం ఇదిగో నీ చేతికి బంగారు రింగు పెట్టాను అనేసి అంటుంది. ఇక రవి తన చిన్నప్పుడు దీపావళి రోజులను గుర్తు చేసుకుంటాడు. శృతి ఏం బాధపడకు అలానే మనం ఇప్పుడు దీపావళి చేసుకుందాం. ఇప్పుడు ఆకలి వేస్తుంది అనగానే రవి దోశ చేశానని చెప్తాడు.
ఇక తర్వాత రోజు మీనా మావయ్య టిఫిన్ చేశాను మీరు టిఫిన్ చేసి టైం కి టాబ్లెట్లు వేసుకోవాలి కదా అనేసి అంటుంది. ప్రభావతి రోహిణి పైనుంచి కిందకు దిగివస్తుంటారు. దీన్ని వీడు తీసుకొచ్చి మంచి పని చేశాడు బండెడు చాకిరీ నాకు తగ్గింది అనేసి ప్రభావతి అంటుంది. దానికి రోహిణి కూడా అవును నిజమే అంటుంది. ఇక మీ కూతురు లాంటి కోడలు టిఫిన్ చేసింది వెళ్లి టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకుని ప్రభావతి అంటుంది. అప్పుడు రోహిణి కూడా టైం కి తిని టైం కి టాబ్లెట్ వేసుకోవాలి మావయ్య అని అంటుంది. పూరి కుర్మా చేసిందని ప్రభావతి అనగానే పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఆ మీనా అనేసి రోహిణి అంటుంది. నీ ఆయిల్ ఫుడ్ వల్లే మామయ్యకు హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అంటుంది. నేను మామయ్య కోసం ఇడ్లీ చేశాను అనగానే ప్రభావతికి రోహిణికి కౌంటర్లు వేస్తాడు సత్యం. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు తాగేసి ఇంటికి వస్తాడు. మీనా పట్టుకో పోతే వద్దని చెప్తాడు. రేపు ఏం జరుగుతుందో చూడాలి..