Krishnudu Family Backgroud: వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, హ్యాపీడేస్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హీరో కృష్ణుడు (Krishnudu )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, ఆ తర్వాత హీరోగా కూడా చేసిన ఈయన ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమయ్యారు.. అలా ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి విరామం తీసుకున్న కృష్ణుడు ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వంటి స్టార్ హీరోల సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తిరిగి స్టార్డం పొందే ప్రయత్నం చేస్తున్నారు.
మా తాత కాటన్ దొరకి మంచి ఫ్రెండ్..
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక పాడ్ కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు కృష్ణుడు. ఇంటర్వ్యూలో భాగంగా మీరు రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా..? అని ప్రశ్నించగా.. రాయల్ ఫ్యామిలీ ఏం కాదండి.. కానీ డబ్బుకి లోటు లేదు అంటూ తెలిపారు. తమది రాజోలు అని , ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని చెప్పుకు వచ్చారు. అసలు ఈ రాజుల కుటుంబం అనే పేరు ఎలా వస్తుంది అని అడగగా.. కృష్ణుడు మాట్లాడుతూ.. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. మా తాతయ్య కాటన్ దొర కి చాలా క్లోజ్ గా ఉండేవారు. అప్పట్లో మద్రాస్ లో గవర్నమెంట్ ఉండేది. రాజోలు ఏరియాలో కాటన్ దొర తో కలిసి కాలువలను, కెనాల్స్ ను మా తాతయ్య దగ్గరుండి మరీ చేయించారు. మా తాతయ్య ఇంజనీర్ కాదు.. కానీ కాలువల పైన మంచి పట్టు ఉండేది. రాజోలు ఏరియాలో ఉన్న కాలువలు అన్నీ కూడా ఆయనే దగ్గరుండి మరీ డిజైన్ చేయించినవి. గన్నవరం నుండి అంతర్వేది వరకు ఆయన వేయించిన కాలువలే ఇప్పటికీ ఉన్నాయి. అంటూ తన తాతల బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చారు కృష్ణుడు.
ఆ కారణంగానే ఇండస్ట్రీలోకి వచ్చా..
ఇకపోతే చిన్నప్పటి నుంచి వెల్ సెటిల్డ్ కదా.. అలాంటప్పుడు మీరు ఎలా సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది అని ప్రశ్నించగా.. నేను స్కూల్ చదువుతున్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా పిచ్చి. స్కూల్లో ఉన్నప్పుడు రామాయణం నాటకం వేశాను. ఇక అప్పుడు నేను సన్నగా వుండడంతో రాముడి గెటప్ వేశాను. ఇప్పుడు వైజాగ్ ఎమ్మెల్సీ బీజేపీ నేత మాధవ్ సీతగా వేశారు. ఇక అప్పుడు నేను వేసిన గెటప్ బాగా వచ్చింది. ఆ రోజు నుంచి చాలామంది సినిమాల్లో ట్రై చేయి అవకాశాలు వస్తే ఉన్నత స్థాయికి చేరుతావు అంటూ ఎంతోమంది ఎంకరేజ్ చేశారు. ఇక ఇప్పటినుంచి సినిమాల్లోకి రావాలనే నా ఆలోచన మరింత బలం అయింది. ఇక అలా ఇండస్ట్రీలోకి వచ్చాను కానీ ఇక్కడ కొత్తగా ఏదీ లేదనిపించి ఇండస్ట్రీకి దూరం అయ్యాను. ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లభించింది అంటూ తెలిపాడు కృష్ణుడు.