 
					UP Crime: కూతురికి ఆమె కుటుంబం ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో యువతి ప్రియుడు అక్కడికి వెళ్లాడు. వాడ్ని చూడగానే కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఆ యువకుడ్ని కొట్టి చంపేశారు. ఈ ఘటనను చూసిన యువతి గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.
యూపీలో దారుణమైన ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రవి-మనీషా ప్రేమించుకున్నారు. రవి వయస్సు 35 ఏళ్లు కాగా, మనీషాకు 18 ఏళ్లు. మనీషా సొంతూరు పర్చాచా గ్రామం. గతంలో వీరిద్దరు ఓసారి ఇళ్ల నుంచి పారిపోయి మళ్లీ ఇంటికి వచ్చేశారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ప్రేమికులు.
ఆ ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మనీషా ప్రేమ వ్యవహారం ఇంట్లోకి వారికి తెలిసింది. ఈ క్రమంలో యువతికి మ్యారేజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదిలావుండగా మనీషాకు ఆమె కుటుంబసభ్యులు మరో వ్యక్తితో బలవంతంగా వివాహం చేస్తున్న విషయం రవి చెవిలో పడింది. ఈ విషయం తెలియగానే రగిలిపోయాడు. ఆ వివాహాన్ని ఆపేందుకు మనీషా ఇంటికి వెళ్లాడు రవి.
పెళ్లి ఆపేందుకు వెళ్లిన యువతి ప్రియుడ్ని చంపేశారు
అతడ్ని చూడగానే మనీషా ఫ్యామిలీ సభ్యులు సీరియస్ అయ్యారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. అందుకు ససేమిరా అనడంతో రవిని చెట్టుకి కట్టేసి దారుణంగా కొట్టి చంపారు. తీవ్రంగా గాయపడిన రవి, తనను కాపాడాలంటూ అరుస్తున్నా ఎవరూ దగ్గరకు వెళ్లలేదు. రవి చనిపోయిన విషయం తెలియగానే మనీషా మేనమామ పింటు ఆందోళన చెందాడు.
ఈ కేసు తన మెడకు చుట్టు కుంటుందని భావించాడు. దీన్ని నుంచి తప్పించుకునేందుకు తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రవి మృతి వార్త తెలియగానే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్యానికి పాల్పడింది మనీషా. వెంటనే కుటుంబసభ్యులు మనీషా, పింటును ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: పెళ్లి వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ముగ్గురు మృతి
వారిద్దరి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పిందని డాక్టర్లు చెప్పారు. అయితే పింటు పరిస్థితి సీరియస్‌గా ఉందని సమాచారం. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. పింటూపై రవి కత్తితో దాడి చేశాడని మనీషా బంధువులు ఆరోపిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.