Gundeninda GudiGantalu Today episode September 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లి రోజు నాడు బాలు, మీనా ఇద్దరు గదిలో లేకుండా ఎలా అని సుశీల ఆలోచిస్తూ ఉంటుంది. కొత్తగా పెళ్లైన వాళ్లకి గది లేకుండా ఉంటే ఎలా ఉంటుంది ఇంకొక గది పైన వేపించమని చెప్పాము కదా మరి నువ్వు ఎందుకురా ఇంకా వేపించలేదు అని సుశీల అడుగుతుంది. ఆ మాట వినగానే సత్యం నేను కూడా చూస్తున్నాను అమ్మ.. కొత్తగా గది వేపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు. సుశీల మాత్రం ఎవరేమనుకున్నా సరే రా మనం మాత్రం గదిని వేపించాలి అని అంటుంది.. ఇప్పటికిప్పుడు గదిని వేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అమ్మా అని సత్యం సుశీలతో అంటాడు. ఏది ఏమైనా కూడా దీని గురించి రేపు అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాత్రి అవ్వగానే శృతి మీనాకు టెంట్ ఇస్తుంది. ఒకప్పుడు గది లేదని మేము ఈ టెంట్లో పడుకున్నాను తెలుసా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది ఎందుకు ఏంటి అని అడక్కుండా తీసుకెళ్ళు అని అంటుంది. ఆ మాట విన్న మీనా సిగ్గుపడుతుంది ఈ సిగ్గు అంతా ఏదో బాలు దగ్గర పడితే బాగుంటుంది కదా అని శృతి అంటుంది.. ఇక బాలు మీనా ఆ టెంట్ లోపల పడుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రొమాన్స్ మొదలు పెడతారు. పెళ్లిరోజు చాలా సరదాగా మరువలేని రోజుగా మార్చుకుంటారు.
తర్వాత రోజు ఉదయం సత్యం పైన గది వేయడం గురించి ఇంట్లో వాళ్ళ అందరితో చెప్తాడు. అయితే అందరూ ఒప్పుకున్న సరే ప్రభావతి మాత్రం నాన్చుతూ ఉంటుంది.. అన్ని డబ్బులు పోసి ఇప్పుడు గది కట్టాలంటే ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతుంది.. అందుకే అందరూ తలా కాసింది వెయ్యాలి అని సత్యం అడుగుతాడు. అందరి ఎందుకు వేయాలి వాడి గది కోసం మేమెందుకు వేయాలి అని మనోజ్ అంటాడు. ఇదంతా ఎవ్వరు వద్దు నాన్న నేనే వేసుకుంటాను అని బాలు అంటాడు.
అయితే గది బదులు మొత్తం ఒక ఫ్లోర్ వేస్తే బాగుంటుంది కదా అని శృతి అంటుంది. మా నాన్నని అడిగి నేను ఆ పని చేస్తాను అని శృతి అంటుంది. సత్యం మాత్రం నేను ఆ పని చేయలేనమ్మ వీలైనంతవరకూ నా తల తాకట్టు పెట్టైనా సరే నేను చేస్తాను అని అంటాడు. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు నా పెన్షన్ డబ్బుని నేను ఇలా ఖర్చు పెడతాను అని అంటాడు. వచ్చిన పెన్షన్ డబ్బులు అంతా ఇలా గదికి వేస్తే మనమేం తింటాం మన పరిస్థితి ఏంటి ఆలోచించాలని ప్రభావతి అడుగుతుంది. ఇప్పుడు గది వేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కదా అయితే అందరూ ఒకటి ఫాలో అవ్వాల్సిందే అని సుశీల కండిషన్ పెడుతుంది.
ఒక్కవారం ఒక్కొక్కరు వచ్చి హాల్లో పడుకోవాలని కండిషన్ పెడుతుంది. దీనికి ఒప్పుకుంటేనే గది వేసే దానికి లేదు. లేకుంటే మాత్రం అందరూ సద్ది గది వేయాల్సిందే అని సుశీల అంటుంది. ఇక అందరూ ఆ కండిషన్ కి ఒప్పుకుంటారు. ఇక సుశీల మేన దగ్గరికి వెళ్లి నువ్వు ఎక్కడుంటావో వెతకవలసిన అవసరం లేదు వంట గదిలో ఉంటావని నాకు అర్థం అయిపోతుంది అని అంటుంది. మీ అమ్మ నిన్ను ఈ ఇంటికి కోడలుగా పంపించిందో వంటింట్లో కుందేలుగా పంపించిందో అర్థం కావట్లేదు.. మిగతా ఇద్దరు కోడలు ఉన్నారు మీ అత్త ఉంది ఆమె చేయాలి కదా అన్ని నువ్వే చేస్తే ఎలా అని అరుస్తుంది.
Also Read : ‘మిరాయ్’ లో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?..అతనికే ఎక్కువ..?
నాకు ఈ పనిలేని ఇబ్బంది లేదు అమ్మమ్మ అని నేను అంటుంది. సరే ఇక నేను వెళ్లి వస్తాను అని సుశీల అంటుంది. అదేంటమ్మా ఇంకొక నాలుగు రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా అని అడుగుతుంది. అర్జెంటుగా ఫోన్ వచ్చింది వెళ్ళాలి అక్కడ చాలా పనులు ఉన్నాయి మీకు పెళ్లి రోజు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని సుశీలా అంటుంది. నా కొడుకు బయట వెయిట్ చేస్తున్నాడు బస్సు ఎక్కిస్తాడు నేను బస్సు పట్టుకుని వెళ్ళిపోతాను అని అంటుంది. ఇక రాత్రి గది కోసం బాలు పెద్ద రనరంగమే చేస్తాడు. మనోజ్ ను రోహిణి బయటికెళ్ళి పడుకోవాలి లేదంటే ఆ బాలు వస్తే మనల్ని చంపేస్తాడు అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..