Brahmamudi serial today Episode: ఇంట్లోంచి బయటకు వెళ్లి ఎమోషనల్ అవుతున్న రేవతిని వెనకే వెళ్లిన కావ్య, రాజ్ ఓదారుస్తారు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు తలుచుకుని ఎందుకు బాధపడుతున్నావు అక్కా అంటాడు రాజ్. రేవతి గారు ఈ రోజు మీరు కోరుకుంది జరిగింది కదా ఎందుకు బాధపడుతున్నారు పదండి భోజనం చేద్దాం అంటుంది కావ్య. వాళ్లు చూపించే ప్రేమను చూసి తట్టుకోలేకపోయాను. అందుకే దొరికిపోతానేమోనని భయపడ్డాను అంటుంది రేవతి. అక్కడే ఉంటే నువ్వు ఒక్కదానివే దొరికిపోయేదానివి ఇక్కడైతే మన ముగ్గురం దొరికిపోతాము పద అక్కా లోపలికి వెళ్దాం అంటాడు రాజ్. ముగ్గురు కలిసి లోపలికి వస్తారు.
లోపల భోజనం వడ్డిస్తున్న రాహుల్ ఓ ఆట ఆడుకుంటారు అందరూ.. ఒకరి తర్వాత ఒకరు అప్పడాలు ఇవ్వమని తికమకపెడుతుంటారు. ఇంతలో రాజ్ వాళ్లు లోపలికి వస్తారు. అదేంటి రాధ అలా వెళ్లిపోయావేంటి..? అని అపర్ణ అడుగుతుంది. దీంతో వాళ్ల అమ్మ వాళ్లు గుర్తుకు వచ్చారట అని కావ్య చెప్తుంది. దీంతో రుద్రాని ఎందుకు మీరు మీ అమ్మ వాళ్లతో కలిసి ఉండటం లేదా..? ఎందుకు దూరంగా ఉన్నారు.. గొడవ అయిందా..? అని అడుగుతుంది. అంటే అత్తా వాళ్ల అమ్మా నాన్నలు ఈ ఊరిలో ఉండరట.. ఎక్కడో వైజాగ్‌లో ఉంటారట.. ఎప్పుడో తప్పితే రారట. అలాంటిది అమ్మ వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తుంటే చూసి కొంచెం ఎమోషనల్ అయింది అంతే అంటూ రాజ్ చెప్తాడు.
కావ్య కూడా ఏ బిడ్డకైనా అలా అమ్మమ్మ ప్రేమ దొరికితే తన తల్లికి ఆనందమే కదా రుద్రాణి గారు ఈ చిన్న విషయం మీకు తెలియకపోవడం విచిత్రంగా ఉంది అని చెప్తుంది. దీంతో అపర్ణ దీనికే కన్నీళ్లు పెట్టుకోవాలా రాధ. వీడే కాదు నువ్వు కూడా ఎప్పుడు కావాలన్న ఇంటికి రావొచ్చు.. వీడికి నాకు మధ్య బంధం ఏంటో నాకు తెలియదు కానీ వీడిని చూసిన ప్రతిసారి ఈ ఇంటి మనిషిలా అనిపిస్తాడు. మీ అమ్మా నాన్నలు దూరంగా ఉన్నారని అస్సలు బాధపడొద్దు నేను కూడా మీ అమ్మే అనుకో అని అపర్ణ చెప్పగానే.. ఇరిటేటింగ్‌గా చూస్తున్న రుద్రాణి అమ్మలా అనుకోవడం ఏంటి..? అమ్మే కదా అని చిన్నగా అంటుంది. ఆ విషయం మనం ఫ్రూవ్ చేయాలి మమ్మీ అంటాడు రాహుల్. వీళ్ల భోజనం పూర్తి అయ్యే లోపు దాని ముసుగును ఎలా తొలిగిస్తానో చూడు అంటుంది రుద్రాణి. ఇంద్రాదేవి ఇక సరే అందరూ తినండి అంటుంది. అందరూ తింటుంటారు.
ఇంతలో రుద్రాణి వాటర్ తీసుకుని రేవతి దగ్గరకు వెళ్లి మీద పోస్తుంది. ద ఈ ముసుగుతో ఎలా అన్నం తింటారు తీసేయండి అంటూ బలవంతంగా తీసేయడానికి ప్రయత్నిస్తూ.. ఇక్కడ ఎవరు పరాయి వాళ్లు ఉన్నారు.. పైగా మా వదిన కూడా అమ్మ లాంటిది అని చెప్పింది. ఆలోచించకుండా ముసుగు తేసేయండి అంటూ లాగుతుంటే అయ్యో పర్వాలేదండి.. ఉండని అంటూ రేవతి గట్టిగా పట్టుకుంటుంది ఇంతలో అపర్ణ కోపంగా రుద్రాణి ఎవరి ఆచారాలు వాళ్లవి పర్వాలేదు అంటుంది కదా..? ఎందుకు బలవంతం చేస్తావు.. తన మీద నీళ్లు పోయడం నీ తప్పు.. అమ్మ రాధ నీకు ఇబ్బందిగా ఉంటే రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి రా అని చెప్తుంది. సరే అంటూ రేవతి వెళ్లిపోతుంది. ఇప్పుడైతే తప్పించుకోగలిగావు కానీ తర్వాత జరిగే ఫంక్షన్‌లో తప్పించుకోలేవు అనుకుంటుంది రుద్రాణి.
తర్వాత బయటకు వెళ్లి కావ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే.. కళ్యాణ్ వెళ్లి ఓదారుస్తాడు. అంతా మంచే జరగాలని దేవుణ్ని ప్రార్థిద్దాం అంటూ చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. లోపల రుద్రాణి ఏవో చిట్టీలు రాసుకుని వచ్చి అందరినీ పిలుస్తుంది. దీంతో స్వప్న షాక్ అవుతుంది. ఫ్యామిలీ అన్నా ఫంక్షన్స్ అన్నా అసలు నచ్చని మా అత్తయ్య గారు ఈరోజేంటే.. ఈ పంక్షన్ ని బలే ప్లాన్ చేశారు అంటుంది. దీంతో హ్యాపీగా ఉండటం కూడా తప్పేనా అంటుంది రుద్రాణి.. అదంతా తర్వాత కానీ ఇంతకీ ఆ బౌల్‌లో ఏం రాసుకొచ్చావు అని ఇంద్రాదేవి అడుగుతుంది.
దీంతో ఈ చీటిలలో ఎవరేం చేయాలో రాసుకొచ్చాను. ఒక్కోక్కరు వచ్చి చీటీలు తీయాలి. అందులో వాళ్లకు ఏం చేయాలని వస్తుందో అది చేయాలి అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. సరే కానివ్వు అని చెప్తారు. సరే ముందు నాన్న గారితో మొదలు పెడదాం అని బౌల్ తీసుకెళ్లి సీతారామయ్య ముందు పెడుతుంది. ఆయన తీసిన చీటిలో ఒక తెలుగు డైలాగ్ చెప్పాలి అని ఉంటుంది. దీంతో సీతారామయ్య వెళ్లి డైలాగ్ చెప్తాడు. సీతారామయ్య డైలాగ్‌కు అందరూ పిదా అయిపోతారు. తర్వాత అందరూ ఒక్కోక్కరుగా చీటీలు తీసి వాళ్లకు వచ్చింది వాళ్లు చేస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.