Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి దగ్గరకు వెళ్లిన వైజయంతి కోపంగా తిడుతూ తాను చేసిన తప్పులన్నీ తెలుసుకున్నానని వార్నింగ్ ఇస్తుంది. అమర్ కోసం ఆరు చంపేశావు.. పార్థును లోయలోకి తోసేశావు.. భాగీని అమర్‌ను చంపాలని చూశావు.. కానీ నేను వాళ్లంతా మంచిదాన్ని మాత్రం కాదు.. పార్థు బతికే ఉన్నాడు. నా తమ్ముడు వచ్చి నువ్వే తనను లోయలోకి తోసేశావు అని చెప్పాలి అప్పుడు నిన్ను ఊరికే వదలను మనోహరి అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది వైజయంతి.
మిస్సమ్మ రెడీ అవుతుంటే అమర్ చూసి కిందకు వెళ్లి రాథోడ్‌ను అడుగుతాడు. మిస్సమ్మ ఎక్కడకు వెళ్తుందని పొద్దన్నే ఏదైనా వర్క్ ఉందా అని అడిగితే.. తన పుట్టింటికి వెళ్తుంది సార్ అని రాథోడ్ చెప్పగానే.. అదేంటి నాకు తనకు మాటలు లేవని కోపంతో పుట్టింటికి వెళ్తుందా అని మనసులో కంగారు పడుతూ.. అదేంటి ఇప్పుడు పుట్టింటికి వెళ్లడం ఏంటి రాథోడ్ అని అమర్ అడిగితే.. అదే సార్ వాళ్ల నాన్నగారు.. పిన్ని గారు రెండు వారాల క్రితం తీర్థయాత్రలకు వెళ్లారు కదా ఇవాళ తిరిగి వస్తున్నారు వాళ్లను చూడటానికి వెళ్తుంది. ఈ విషయం మీకు చెప్పలేదా.. ?ఓ మీకు మిస్సమ్మకు మాటలు లేవు కదా అంటాడు రాథోడ్..
అయితే తను ఒక్కతే వెళ్తుందా… అని అమర్ అడిగితే.. అవును సార్ తోడుగా నేను ఉన్నాను కదా..? అంటాడు రాథోడ్.. పుట్టింటికి భర్త తోడుగా వెళ్లాలి రాథోడ్ అంటాడు అమర్.. మీరు వస్తానంటే మిస్సమ్మ ఏమంటుందో.. అంటాడు. రాత్రి తను ఐస్‌క్రీమ్ తినడానికి నేను పర్మిషన్ ఇచ్చాను కదా అంటే అది నేను ఒప్పించాను సార్ అంటాడు రాథోడ్. ఇప్పుడు కూడా నువ్వే ఒప్పించు.. ఏం చేస్తావో నాకు తెలియదు.. కానీ నేను మిస్సమ్మతో అక్కడకు రావాలి అంటాడు అమర్. అప్పుడే మిస్సమ్మ రాథోడ్ ను పిలుస్తూ వస్తుంది. కారు రెడీగా ఉంది మిస్సమ్మ అంటాడు రాథోడ్ అయితే బయలుదేరుదామా అని మిస్సమ్మ అడిగితే.. బయలుదేరుదాము కానీ ఒక్క దానివేనా..? సార్ రావడం లేదా… అంటాడు రాథోడ్. ఏమో నాకు తెలియదు అంటుంది మిస్సమ్మ.
ఒక్కసారి నువ్వు అడుగు మిస్సమ్మ సార్ వస్తారు అని రాథోడ్ చెబితే.. అడిగి లేదనిపించుకోవడం నాకు ఇష్టం లేదు రాథోడ్.. ఆయన కచ్చితంగా రారు అంటుంది. ఆ మాటకు అమర్ కోపంగా నేను రానని నీకు చెప్పానా..? నేను తప్పకుండా వస్తాను.. అల్లుడిగా మామగారిని చూడాల్సిన బాధ్యత నాపై ఉంది అంటూ అమర్ కోపంగా రాథోడ్ పది నిమిషాలు వెయిట్ చేయ్ నేను రెడీ అయి వస్తాను అంటూ రూంలోకి వెళ్లిపోతుంటే.. పైన బెడ్ మీద మీ డ్రెస్ పెట్టాను చూడండి అంటుంది మిస్సమ్మ. దీంతో అమర్ అయితే నన్ను తీసుకెళ్లాలని ముందే డిసైడ్ అయ్యారు నేనే తొందరపడి ఓపెన్ అయ్యానా..? అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతాడు అమర్.
ఆశ్రమంలో ఉన్న మనోహరి భయంతో అటూ ఇటూ తిరుగుతూ వైజయంతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ భయపడుతుంది. అప్పుడే చంభా వస్తుంది. ఏంటి మనోహరి పొద్దున్నే అర్జెంట్‌గా రమ్మన్నావు.. ఏమైంది అని అడిగితే అర్జెంట్‌గా రమ్మని చెబితే ఇంత లేట్‌గానా రావడం అంటూ మనోహరి కోప్పడుతుంది. దీంతో నీదేం పోయింది నీ ఇష్టానికి ఆర్డర్స్ వేస్తావు.. ఆ ఇంటి నుంచి రావడానికి ఎంత కష్టపడాలో నీకు తెలియదా..? అయినా నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగితే.. ఆ వైజయంతికి నా గురించి పిన్ టూ పిన్ తెలిసిపోయింది అని చెప్పగానే.. మరి నువ్వు ఇంకా బయటే ఉన్నావేంటి..? అంటుంది చంభా.
మనోహరి కోపంగా తిడుతూ పార్థు తిరిగి వచ్చిన మరుక్షణం నన్ను జైలుకు పంపిస్తారు అని చెప్పగానే.. వెటకారం ఆడొద్దు చంభా రేపే నేను ఆ ఇంటికి రావాలి అంటుంది. వచ్చి ఏం చేస్తావు పార్థు వచ్చేలోపు భాగీని చంపి అమర్‌ను పెళ్లి చేసుకుంటావా..? అది జరిగే పనేనా..? అంటే నేను చెప్పేది విను.. నేను వెంటనే ఆ ఇంటికి రావాలి. అంటూ అందుకోసం తను ఆడబోయే నాటకం గురించి చెప్తుంది. నాటకం ప్రకారం తాను చనిపోయినట్టు నటిస్తానని చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.