E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర దశరథ ను వదిలేసి వెళ్లిపోతుందా..?     

Karthika Deepam 2 Serial Today Episode October 30th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర దశరథ ను వదిలేసి వెళ్లిపోతుందా..?     
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  కార్తీక్‌, దీపలు టిపిన్‌ బండి దగ్గరకు వెళ్తారు. అక్కడ ఉన్న గిన్నెలు కడుతుంది దీప. శివనారాయణ వద్దంటాడు. కానీ దీప అలాగే కడగబోతుంటే.. జ్యోత్స్న వచ్చి దీప నువ్వు వద్దు నువ్వు ప్రెగ్నెంట్‌వు కింద కూర్చోకూడదు నేను కడుగుతాను ఉండు అంటుంది. నీకు కడగడం రాదు జ్యోత్స్న అని దీప అంటే అవసరమే మనిషికి అన్ని నేర్పిస్తుంది అంటూ జ్యోత్స్న కడగబోతుంటే.. ఎవరూ కడగొద్దు.. అవసరం ఉన్నచోట గౌరవం కాపాడలేదు కానీ ఇప్పుడు వచ్చి పోటీ పడుతున్నారా… అంటాడు శివనారాయణ. నువ్వు గిన్నెలు కడగడం అత్త చూసింది అనుకో అంటూ కార్తీక్‌ చెప్తుండగానే..

సుమిత్ర, దశరథలు వస్తారు. జ్యోత్స్న నువ్వెందుకు చేస్తున్నావు ఈ పనులు అంటుంది సుమిత్ర. నేను చేస్తానులే అమ్మ అంటుంది దశరథ కూడా చేయనివ్వు సుమిత్ర అంటాడు. శివనారాయణ కోపంగా అందరినీ తిడుతూ సూరజ్‌ను తిడుతుంటే.. అప్పుడే సూరజ్‌ వస్తాడు. జ్యోత్స్న గిన్నెలు కడగడం చూసి షాక్‌ అవుతాడు. తన కారులో పారిజాతాన్ని తీసుకొస్తాడు సూరజ్‌. పారిజాతం నిద్రపోతున్నట్టు నటిస్తుంది. సూరజ్‌, జ్యోత్స్నను పిలిస్తే.. సూరజ్ కోపంగా నా ముందే నా మనవరాలిని పిలుస్తావా..? అంటూ శివనారాయణ కోప్పడతాడు. కార్తీక్‌, పారిజాతాన్ని చూసి తాత సూరజ్‌, జ్యోత్స్నను పలిచేది వేరే కారణం అంటాడు. అవును అంటూ పారిజాతంను చూపిస్తాడు. అందరూ వెళ్లి పారిజాతాన్ని చూసి కంగారు పడతారు. తర్వాత జ్యోత్స్న గిన్నెలు కడగడం చూసిన ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాడు. ఆ వీడయో వైరల్‌ అవుతుంది.

Advertisement

వైరల్‌ అయిన జ్యోత్స్న గిన్నెలు కడిగే వీడియో సూరజ్‌ చూసి దక్షిణమూర్తికి చూపిస్తాడు. ఆ వీడియో చూసిన దక్షిణమూర్తి ఎమోషనల్‌ అవుతాడు. కూతురు కష్టపడితేనే చూసి తట్టుకోలేని ఈ దక్షిణమూర్తి మనవరాలు కష్టపడుతుంటే ఎలా తట్టుకుంటాడురా సూరజ్‌. దీనికంతటికీ నువ్వే కారణం. అమ్మాయి పెళ్లి అయితే జీవితం మారిపోతుంది అంటారు. కానీ నువ్వు దాన్ని పెళ్లి చేసుకోకుండానే జీవితాన్ని మర్చేశావురా అంటూ కోపంగా బాధపడుతూ వెళ్లిపోతాడు దక్షిణమూర్తి.

అదే వీడియోను సూరజ్‌, జ్యోత్స్నకు సెండ్‌ చేస్తాడు. అది చూడకుండానే జ్యోత్స్న పక్కన పెట్టేస్తుంది. అప్పుడే జ్యోత్స్న దగ్గరకు వెళ్లిన శౌర్య వీడియో గేమ్‌ ఆడుకుంటానని జ్యోత్స్న ఫోన్‌ తీసుకుంటుంది. అందులో సూరజ్‌ పంపించిన వీడియోకు లవ్‌ సింబల్‌ రిప్లై ఇస్తుంది. అది చూసిన సూరజ్‌ షాక్‌ అవుతాడు. ఇదేంటి ఇలా రిప్లై ఇచ్చింది అనుకుంటాడు. వెంటనే సూరజ్‌, జ్యోత్స్నకు ఫోన్‌ చేసి రేపు మనం కలుస్తున్నాం.. మన రెగ్యులర్‌గా కలిసే ప్లేస్ లోనే అంటాడు. ఎందుకు అని జ్యోత్స్న అడిగినా సూరజ్‌ చెప్పడు.. కలుస్తున్నాం నువ్వు రావాలి అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు సూరజ్‌.

Advertisement

దశరథ, సుమిత్ర తమ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. దశరథ బాధగా మీ నాన్న రమ్మంటున్నాడు కదా నువ్వు జ్యోత్స్న వెళ్లిపోవచ్చు కదా ఈ కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నావు అని చెప్తే.. సరే వెళ్తాను ఎప్పుడు వెళ్లమంటారు అని సుమిత్ర అడుగుతుంది. చాటు నుంచి వింటున్న కార్తీక్‌, దీప, జ్యోత్స్న షాక్‌ అవుతారు. నువ్వు ఎప్పుడు వెళితే అప్పుడే పంపిస్తాను అంటాడు దశరథ. అయితే రేపు ఉదయమే వెళ్లిపోతాము అంటూ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను అంటూ సుమిత్ర ఒకవేళ నేను కష్టాల్లో ఉండి.. నువ్వు నా ప్లేస్‌లో ఉండి ఉంటే వదిలేసి వెళ్లిపోతావా..? అని దశరథను అడుగుతుంది. అలా ఎలా వెళ్లగలను అంటాడు దశరథ. మరి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను ఎలా వెళ్తాను అనుకున్నారండి అంటూ సుమిత్ర బాధపడుతుంది. తర్వాత ఇద్దరూ జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడుకుంటూ బాధపడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : చక్రీ ని తిట్టిన కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్.. నారాయణ పై కొడుకులు ప్రేమ..

Gundeninda GudiGantalu Today episode: గుడిలో బాలు కుటుంబం సందడి.. అత్తా vs కోడలు.. గుణకు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: భరత్ పై భానుమతి సీరియస్..అయ్యో రమ్య.. పల్లవికి వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: షాకిచ్చిన చందు.. వల్లికి ఘోర అవమానం.. చందు లైఫ్ లోకి కొత్త అమ్మాయి..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode October 30th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి సూసైడ్‌ ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందా..?       

గాజులు గలగలతో ఊపేసింది.. ఇప్పుడు ఈ డ్యాన్స్‌తో అడ్డంగా బుక్కైందా?

Big Stories

Advertisement
×