Ashu Reddy : తెలుగు ఆడియన్స్ కి పరిచయమక్కర్లేని పేరు అషు రెడ్డి.. తన అందం అభినయంతో కుర్రకారుని మతిపో కొట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. డబ్ స్మాస్, యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకున్న ఈ అమ్మడు. ఒకవైపు టీవీ షోలను సందడి చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ మధ్య విదేశాల్లో కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్ లేస్తూ బాగానే క్రేజ్ ను పెంచుకోవడంతో పాటుగా రెండు చేతుల సంపాదిస్తూ వస్తుంది. ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది. మరి నెలకు ఈమె సంపాదన ఎలా ఉంటుంది?ఎంతవరకు సంపాదిస్తుంది? అన్నది ఇప్పుడు మనకు కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ కు అషు రెడ్డి గురించి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ చేస్తూ బాగా పాపులర్ అయిన ఈ అమ్మాయి రాంగోపాల్ వర్మ దెబ్బకి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయనతో చేసిన ఇంటర్వ్యూ వీడియో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఈమెకు ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి. పలు సినిమాలలో నటించిన అషు బిగ్ బాస్ లోకి కూడా వెళ్లే ఛాన్స్ ని కొట్టేసింది. బిగ్ బాస్ లో తన అందం, ఆట తీరుతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కట్టిపడేసింది. రాహుల్ సిబ్లిగంజ్తో ప్రేమాయణం కూడా హైలెట్ గా నిలిచింది. మొత్తానికి హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అంతే క్రేజ్ ని సొంతం చేసుకుంటూ వచ్చింది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్న ముద్దుగుమ్మల లిస్ట్ లో ఏమి కూడా చేరింది అన్న విషయం అందరికీ తెలుసు. ఈమె దాదాపు నెలకి 15 లక్షల వరకు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది అని ఓ వార్త ప్రస్తుతం షికారు చేస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే మాత్రం హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే ఆమె అంత సంపాదిస్తుందా? లేదంటే ఇది కేవలం రూమర్సేనా అన్నది తెలియాలి అంటే అషు రెడ్డి నోరు విప్పేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
నటి అషు రెడ్డి ఈమధ్య కాస్త నాజూగ్గా మారిన విషయం తెలిసిందే.. అంతేకాదు ఆమె సర్జరీ కూడా చేయించుకుంది అన్న వార్తలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. మరి నిజంగానే సర్జరీ చేయించుకున్న లేదా అన్నది మాత్రం తెలియలేదు కానీ ప్రస్తుతం ఆమె కెరియర్ బిజీగా గడుపుతుంది అని అర్థమవుతుంది. ఒకవైపు వెబ్ సిరీస్ లు మరోవైపు సినిమాలు, ఇక అంతే కాదు సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు షేర్ చేయడం.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, వీటితో పాటుగా వేరే దేశాలలో ఈవెంట్స్ చేస్తూ బాగా బిజీగా ఉంది. ఎటు లేదనుకున్న కూడా ఈ అమ్మడు సంపాదన నెలకు లక్షల్లోనే ఉంటుంది అని నెటిజెన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా కూడా ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజే వేరప్పా..