Intinti Gruhalakshmi serial:సాధారణంగా వెండితెరపై సినిమాలలో నటిస్తున్నప్పుడే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ రీల్ జోడీలు కాస్త రియల్ జోడీలుగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే వెండితెర పైనే కాదు బుల్లితెరపై కూడా సీరియల్స్ లో జంటగా నటించి, ఆ తర్వాత ఇష్టపడి పెళ్లి పీటలెక్కన జంటలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక బుల్లితెర జంట స్క్రీన్ పై తమదైన నటనతో, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో దివ్య, విక్రమ్ పాత్రలతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరైన కళ్యాణ్ రెడ్డి , ఇంచార శెట్టి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. ఈ సీరియల్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అలా గత కొన్నాళ్లుగా ప్రేమించుకున్న వీళ్ళు ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి అక్టోబర్ 31వ తేదీన వైవాహిక బద్దంలోకి అడుగు పెట్టారు. ఇక వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ జంట ఇప్పుడు ఎట్టకేలకు వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.
ఇంచరా శెట్టి విషయానికి వస్తే.. కన్నడలో పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈమె , ఆ తర్వాత రాధిక సీరియల్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో గమ్య పాత్రతో ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత కెండ సంపిగే అనే మరో సీరియల్లో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇక తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో పరిచయమయ్యింది. ఇందులో తులసి కూతురు దివ్య పాత్రలో నటించింది. అయితే మొదట ఈ పాత్రలో తెలుగు నటి పూజిత రెడ్డి నటించిన విషయం తెలిసిందే. ఆమె తప్పుకోవడంతో కన్నడ నటి అయిన ఈమె దివ్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది..ప్రస్తుతం బొమ్మరిల్లులో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
also read:రోహిత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?
కళ్యాణ్ రెడ్డి విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన ఈయన స్నేహమే ఎదురైతే, చెలి క్షమించవే వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కుస్తీ కళ్యాణి, గుండమ్మ కథ తదితర సీరియల్స్ లో చేస్తున్నాడు. మరోవైపు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో దివ్య భర్త కార్తీక్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలా అందులో ఆన్ స్క్రీన్ జంటగా నటించిన ఈ జోడి ఇప్పుడు రియల్ జోడిగా మారి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు..ఈ జంట పెళ్లి చేసుకోవడంతో తోటి నటీనటులు, అభిమానులు, ప్రేక్షకులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు