Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంటికి వచ్చిన భాగీతో మంగళ కోపంగా మాట్లాడుతుంటే.. రామ్మూర్తి, మంగళను తిడతాడు. తీర్థయాత్రల్లో పుణ్య స్థానాలు చేయించినా దీని బుద్ది మాత్రం మారలేదమ్మా అంటూ రామ్మూర్తి తిడుతుంటే.. అది సరే కానీ మామయ్య మీరు వస్తూ వస్తూ మీతో పాటు ఎవరినో తీసుకొచ్చారని రాథోడ్‌తో చెప్పారట ఎవరు అని అమర్ అడిగితే.. మేము వస్తున్న బస్సుకు అడ్డు పడ్డాడు బాబు.. ఎవరా అని చూస్తే మన తెలుగువాడే.. అందుకే తీసుకొచ్చాను.. కొంచెం పిచ్చి వాడిలా ఉన్నాడు అని రామ్మూర్తి చెబితే.. హైదరాబాద్‌లో దిగగానే పోలీసులకు అప్పజెప్తానన్నాడు.. కానీ దారినపోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని మంగళ తిడుతుంది.
ఎవరతను చూద్దాం అని అమర్ అడిగితే ఉండు బాబు తీసుకొస్తాను అంటూ రామ్మూర్తి, పార్థు పడుకున్న రూంలోకి వెళ్లి నిద్ర లేపి ఆ అల్లుడు కూతురు వచ్చారు. అల్లుడు గారు నిన్ను చూస్తరట రా అని పిలిస్తే పార్థు భయపడుతుంటాడు. నేను రాను అంటూ దుప్పటి మూసుకుని పడుకుంటాడు. ఏం భయపడకు బాబు మా అల్లుడు పెద్ద ఆర్మీ ఆఫీసర్. మీ వాళ్లు ఎవరో వెతికి నిన్ను మీ ఇంటికి పంపిస్తాడు అని రామ్మూర్తి చెప్పినా.. వినకుండా పార్థు నేను రాను నేను రాను అంటుంటాడు. రామ్మూర్తి బయటకు వెళ్లి తను బయటకు రావడానికి బయపడుతున్నాడు బాబు అని అమర్‌కు చెబితే.. అయితే నేనే లోపలికి వెళ్తాను అంటూ అమర్ వెళ్తుంటే..
రామ్మూర్తి ముందే వెళ్లి పార్థును నిద్ర లేపుతాడు. అయినా దుప్పటి కప్పుకుని పార్థు ఉలకడు పలకడు.. అమర్ రూంలోకి వెళ్లి పార్థును చూడబోతుంటే.. రాజు ఫోన్ చేసి మనోహరి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఇప్పుడు తాము కారులో మనోహరిని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామని చెప్తాడు. అమర్ కంగారు పడుతూ రామ్మూర్తికి, భాగీకి విషయం చెప్తాడు. అంతా విన్న మంగళ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి..? అంతలా నేనేం మాట్లాడాను అని మనసులో అనుకుంటుంది. అమర్ తాను హాస్పిటల్‌కు వెళ్తున్నాననంటే.. రామ్మూర్తి తాను వస్తానంటాడు. మంగళ కూడా వస్తానంటే.. వద్దని ఆ బాబుకు బోజనం ఏర్పాటు చేయమని చెప్పి అమర్, మిస్సమ్మ, రామ్మూర్తి వెళ్ళిపోతారు.
మనోహరిని హాస్పిటల్‌లోకి తీసుకెళ్తారు. స్ట్రెచర్ మీద తీసుకెళ్తూ.. రాజు డాక్టర్ అని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి కామెడీగా మాట్లాడుతుంటాడు. ఒకవైపు మనోహరి స్ట్రెచర్ మీద ఆయాస పడుతుంటే.. డాక్టర్ సెటైర్లు పంచ్ డైలాగులే వేస్తుంటాడు. డాక్టర్ మాటలకు మనోహరి మనసులో తిట్టుకుంటుంది. నేనిక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంటే.. నువ్వు కామెడీ చేస్తున్నావా.. డాక్టర్ అని మనసులో అనుకుంటుంది. అసలేం జరిగింది అని డాక్టర్ అడిగితే.. నిద్ర మాత్రలు మింగిందని సరస్వతి చెప్తుంది. ఎందుకు మింగిది ఏమైనా లవ్ ప్రాబ్లమ్సా..? అని డాక్టర్ అడిగితే..
అవన్నీ దీనికి ఎప్పుడో అయిపోయాయి అంటుంది సరస్వతి. మరి ఇప్పుడు ఏం జరిగింది అని డాక్టర్ అడిగితే.. ఇప్పుడు మళ్లీ పెళ్లి జరిగింది. అని రాజు చెప్తాడు. అందుకు డాక్టర్ కంగ్రాచ్యులేషన్స్.. పెళ్లి అయితే నిద్ర మాత్రలు మింగాలా..? అంటూ కామెడీగా అడుగుతుంటాడు. పెళ్లైన మూడు రోజులకే దీని భర్త చనిపోయాడు అని సరస్వతి చెబితే.. అది కూడా కామనే కదా ఈ మధ్య అమ్మాయిలు పెళ్లి ఇష్టం లేక భర్తలను చంపేసి డ్రమ్ముల్లో పార్శిల్ చేస్తున్నారు అంటూ డాక్టర్ చెబితే.. ఈ మనోహరి కూడా అలాంటి బాపతే అని యాదమ్మ మనసులో అనుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.