E-Paper
Advertisement

మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..

మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..
Advertisement

Finland free trip for singles| ప్రేమ కోసం వెతుకుతున్నారా? కొత్త ప్రదేశాలను చూడటంతో పాటు కొత్త వ్యక్తులను కలుసుకోవాలని ఉందా? అయితే మీకో అద్భుతమైన అవకాశం ఎదురుచూస్తోంది. ఫిన్లాండ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింగిల్స్‌కు ఉచిత విదేశీ పర్యటన ఆఫర్ చేస్తోంది. విమాన టికెట్లు, హోటల్ వసతి, భోజనం ఇలా అన్నీ ఉచితం. అంతేకాదు, ప్రత్యేక డిన్నర్ కార్యక్రమాల్లో పాల్గొని కొత్త పరిచయాలు పెంచుకోవచ్చు. మరి ఈ ప్రయాణానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 16 మంది సింగిల్స్‌కు ఫిన్లాండ్ ఆహ్వానం

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. ఈ దేశంలోని ఫుడ్ కల్చర్‌ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ‘Visit Finland’ అనే పర్యాటక సంస్థ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి ‘ఫిన్నిష్ డిన్నర్ డేట్’ అని పేరు పెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 16 మంది సింగిల్స్‌కు ఉచితంగా ఫిన్లాండ్ వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఈ పర్యటన 2027 ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది. ఎంపికైనవారు హెల్సింకి, టాంపేరే నగరాల్లో ప్రత్యేక డిన్నర్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ ఫిన్లాండ్‌కు చెందిన సింగిల్స్‌ యువతను కలుసుకోవచ్చు.

ఫిన్లాండ్ ఆహార రుచులను ఆస్వాదించే అవకాశం

Advertisement

ఈ పర్యటనలో పాల్గొనేవారికి ఫిన్లాండ్ సంప్రదాయ వంటకాలను రుచి చూసే అవకాశం లభిస్తుంది. చేపలు, బెర్రీలు, అడవుల్లో సేకరించే పుట్టగొడుగులతో ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు.
ప్రముఖ చెఫ్‌లు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక మెనూలను రూపొందిస్తారు. అందరూ కలిసి భోజనం చేస్తూ ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు. బిజినెస్ ఫిన్‌ల్యాండ్‌లో అంతర్జాతీయ మార్కెటింగ్ విభాగం సీనియర్ డైరెక్టర్ హెలీ జిమెనెజ్ ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఫిన్లాండ్ ఆహార సంస్కృతి అక్కడి జీవనశైలి, ప్రకృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.

సింగిల్స్ కోసం ఈ స్పెషల్ ప్రొగ్రామ్ వెనుక కారణం ఇదే

ఫిన్లాండ్‌లో సింక్కుకోరి (Sinkkukori) అనే ప్రత్యేక డేటింగ్ ట్రెండ్ ఉంది. దీని అర్థం ‘సింగిల్స్ బాస్కెట్’. అక్కడి కొన్ని సూపర్‌మార్కెట్లు పింక్ రంగు బుట్టలను అందుబాటులో ఉంచుతున్నాయి.
సింగిల్స్ ఈ బుట్టలను ఉపయోగించి కొత్త వ్యక్తులతో మాట్లాడేందుకు తమ ఆసక్తిని తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా స్నేహాలు, ప్రేమ పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదే ఆలోచనతో విజిట్ ఫిన్‌ల్యాండ్ కంపెనీ ఈ డిన్నర్ కార్యక్రమాన్ని రూపొందించింది.

Advertisement

Also Read: డేటింగ్ యాప్స్‌లో చాట్‌ఫిషింగ్ కలకలం.. రొమాంటిక్ మెసేజ్‌లతో మాయాజాలం

ఉచిత ఫిన్లాండ్ ట్రిప్‌కు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

18 ఏళ్లు నిండిన అవివాహితులు ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారులు ఫిన్లాండ్ నివాసితులు కాకూడదు. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ 2026 నవంబర్ 10, ఉదయం 11:59 గంటలు (ఫిన్లాండ్ సమయం). ఎంపికైనవారి వివరాలను డిసెంబర్ 1న ప్రకటిస్తారు. విజిట్ ఫిన్‌ల్యాండ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ అకౌంట్స్ ద్వారా ఫలితాలు వెల్లడిస్తారు.

ఈ ఉచిత పర్యటనలో ఏ ఖర్చులను భరిస్తారు?

ఎంపికైనవారికి విమాన టికెట్లు, హోటల్ వసతి, భోజనం, కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులను Visit Finland భరిస్తుంది. అంటే ప్రయాణంలో ప్రధాన ఖర్చుల గురించి ఆందోళన అవసరం లేదు.

Also Read: ‘ఐ లవ్ యూ’ చెప్పడం మాత్రమే సరిపోదు.. మీ లవర్‌కు నమ్మకం కలిగించడం చాలా ముఖ్యం

ఫిన్నిష్ డిన్నర్ డేట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

దరఖాస్తు చేయాలనుకునేవారు ఇంగ్లిష్‌లో చిన్న వీడియో రూపొందించాలి. అందులో “డిన్నర్ డేట్‌కు మీరు ఏ వంటకం వడ్డిస్తారు? ఎందుకు?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ లేదా యుట్యాబ్ వంటి పబ్లిక్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలి. అలాగే #FinnishDinnerDate అనే హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించి Visit Finlandను ట్యాగ్ చేయాలి.
ఈ అవకాశం ద్వారా ఫిన్లాండ్‌ సందర్శించడంతో పాటు కొత్త స్నేహాలు, ప్రేమ పరిచయాలు ఏర్పరుచుకునే అవకాశం ఉంటుంది.

Related News

ఇక కరీంనగర్-వరంగల్ నాన్‌స్టాప్ బస్సులు.. పూర్తి షెడ్యూల్ ఇదే?

ఆన్‌లైన్ హోటల్ రివ్యూలు చూసి మోసపోతున్నారా? ఫేక్ రివ్యూలను కనిపెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!

విమాన ప్రయాణం వేస్ట్.. ఈ రైలు జర్నీనే బెస్ట్.. 5-స్టార్ హోటల్ ఫీలింగ్!

ఇక విదేశాల్లోనూ వందే భారత్ పరుగులు.. రైల్వేమంత్రి సంచలన ప్రకటన!

గంటకు 280 కి.మీ వేగం.. 557 మంది ప్రయాణం.. భారత తొలి బుల్లెట్ రైలు ప్రత్యేకతలివే!

విమాన టికెట్ ధరలు భారీగా పెరిగితే కేంద్రం జోక్యం.. కొత్త రూల్స్ ఇవే!

కోనసీమలో తమిళ సంస్కృతి.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్చపోవాల్సిందే!

Big Stories

Advertisement
×