Illu Illalu Pillalu Today Episode November 3rd : భద్ర భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. ఏం జరిగింది ? ఎందుకు మమ్మల్ని రమ్మని పిలిచారు అని అడుగుతుంది భాగ్యం. ఏమీ లేదు మీ అమ్మాయికి అన్యాయం జరగబోతుంది అని ఆలోచించే మిమ్మల్ని రమ్మని పిలిచాను ఆ రామరాజు కొడుకు మీ అమ్మాయికి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆ విడాకులు నోటిస్ మా వరకు వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అని భద్ర వాళ్ళకి నిజం చెప్తుంది. అయితే భాగ్యం మీరు రెచ్చగొడుతుంది కూడా. ఒకవైపు ఆనంద్ రావు వద్దని చెప్తున్న సరే.. భాగ్య మాత్రం అస్సలు వినకుండా ఎలాగైనా సరే రామరాజు పరువు తీసేయనా సరే తన కూతుర్ని మళ్ళీ అత్తవారింటికి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటుంది. భద్ర ప్లాన్ మాత్రం సక్సెస్ అయ్యింది.
నర్మదా వల్లి తన భర్త కోసం ఎంతో తాపత్రయ పడుతుందని నిజంగానే వల్లి మారింది అని నమ్ముతుంది. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన సరే నర్మద మాత్రం శ్రీవల్లి దగ్గరికి వచ్చి అక్క నువ్వు మారిపోయావు అని నాకు అర్థం అవుతుంది. నువ్వు ఈ మార్పుని ఇలాగే కొనసాగిస్తే చందు భావ కచ్చితంగా నీ సొంతమవుతాడు అని చెప్తుంది. వల్లి తన భర్త తన కుటుంబం మళ్లీ తనని దగ్గరికి తీసుకుంటుందా లేదా అని కంగారు పడిపోతుంది..
రామరాజు కుటుంబం మొత్తం ఆడేందుకు రెడీ అవుతూ ఉంటారు అయితే బతుకమ్మ గురించి గొప్పగా చెప్పుకోవడంతో పాటుగా అక్కడ బతుకమ్మ సరదాగా ఆటలు ఆడుతూ లేడీస్ అంతా కూడా చాలా సందడి చేస్తూ ఉంటారు. అయితే లేడీస్ అలా బతుకమ్మ ఆడుతుంటే మగవాళ్ళు మాత్రం వాళ్ళని చూసి మొరిసిపోతూ ఉంటారు. ఇక బతుకమ్మని వల్లి కూడా ఆడుతుంది పొరపాటున తను ఆడుతూ అక్కడ ఉన్న చందు మీద పడిపోతుంది. అయితే అప్పుడే చందు వల్లిని పట్టుకుంటాడు. కానీ ఇలాంటి నాటకాలు నా దగ్గర మొదలు పెడితే నేను అసలు ఊరుకోను నీ సంగతి ఏంటో తెలిసి కూడా నువ్వు ఇలాంటి నాటకాలు మొదలు పెడుతున్నావా అని సీరియస్ అవుతాడు. కానీ నర్మద మాత్రం ఏంటి బావ అలా మాట్లాడుతున్నావు తను పొరపాటున పడిపోయింది కావాలని పడలేదు అని వల్లికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది.
ఇక అందరూ బతుకమ్మని నీళ్లల్లో వదిలేసి అలా వెళ్తూ ఉండగా అంజలి అప్పుడు చందు ని చూస్తుంది తన చందు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. తను కాస్త ధైర్యం చేసి ఉంటే నేను ఇప్పుడు చెందుతో చాలా సంతోషంగా ఉండేదాన్ని అని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది ఇక అయితే అందరూ బతుకమ్మని నీళ్లలో వదిలేసి వస్తారు పైకి రాగానే వేదవతి ఏం కోరుకున్నావు? నిన్ను తిట్టిన వాళ్ళు నాశనం అయిపోవాలని మమ్మల్ని ఏ పుట్టక పుట్టకు వెళ్ళిపోవాలని కోరుకున్నావా? మా నాశనాన్ని కోరుకుంటున్నావా అని వేదవతి అంటుంది. ఆ మాట వినగానే వల్లి చాలా బాధపడిపోతుంది మీ గురించి నేనెందుకు అలా కోరుకుంటాను అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇక అందరూ ఇంటికి వెళ్దాము అని అనుకునే లోపల వేదవతి గుడి లోపలికి వెళుతుంది అయితే వల్లి వచ్చి అత్తయ్య మామయ్య నన్ను క్షమించండి.నేను మీ ఇంటికి ఎంతో ద్రోహం చేశాను. మీ కన్నబిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూసాను. అయినా కూడా నన్ను మీరు ఒక పెద్ద కూతురు లాగా చూసుకున్నారు. ఇప్పుడు మీరు పెద్దమనిషి చేసుకొని నన్ను మీలో ఒకరిగా చేర్చుకోండి అంతేకానీ నన్ను చీదరించుకోవద్దు అని వేడుకుంటుంది. మీరు నాకు కన్న తండ్రి లాంటి వాళ్ళు మీరు ఇలా చేస్తే నేను అసలు ఊరుకోలేను నాకు చాలా బాధగా ఉంది మావయ్య గారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది వల్లి.. భాగ్యం సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు అయితే వల్లి ఏంటి ఆ అమ్మాయి ఏం జరిగింది అని ఆశ్చర్యపోతుంది.
రామరాజు నువ్వు ముందు లేవమ్మా అని వల్లితో అంటాడు అయితే అప్పుడే సడన్గా భాగ్యం ఎంట్రీ ఇచ్చి వాడి కాళ్లు పట్టుకున్నావ్ ఏంటి వాడికి దుర్మార్గుడు అంటూ అనడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా అంత పెద్ద మనిషిని పట్టుకొని దుర్మార్గుడు అంటావేంటి అని అంటారు. అయితే అప్పుడే రామరాజు కాలర్ పట్టుకుని నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూసావు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అని అడుగుతుంది. అయితే నేనేం చేశాను అని అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. నా కూతురికి విడాకులు పంపించి ఇంకొక పెళ్లి చెయ్యాలని చూస్తున్నావా అసలు నువ్వు ఏం పెద్దమనిషివి? నువ్వు అసలు మనిషివేనా అని భాగ్యం కడిగి పడేస్తుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.కానీ ఈ చందు మాత్రం విడాకులు నోటీసులు పంపించాను అని ఒప్పుకోవడంతో రామరాజు చందు ని కొడతాడు ఆ తర్వాత అందరూ కూడా వల్లిని చూసి జాలి పడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది.