E-Paper
Advertisement

పాకిస్తాన్ కు భ‌య‌ప‌డే 33 ఏళ్లు దాటిన వాళ్ల‌ను దించుతున్నారు..ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

పాకిస్తాన్ కు భ‌య‌ప‌డే 33 ఏళ్లు దాటిన వాళ్ల‌ను దించుతున్నారు..ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!
Advertisement

Inzamam ul Haq On ACC Men’s Asia Cup Rising Stars 2026 : ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ( ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో టీమిండియా ఏ జట్టును తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మను కెప్టెన్ చేయగా, రజత్ పటిదార్ ను వైస్ కెప్టెన్ చేశారు. అయితే, టీమిండియాను బీసీసీఐ ప్రకటించడంపై ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో 30 ఏళ్లు దాటిన క్రికెటర్లను ఎలా ఆడిస్తారంటూ ప్రశ్నించాడు. పాకిస్తాన్ చేతిలో ఓడిపోతారనే భయంతో 33 ఏళ్ల రజత్ పటిదార్, 31 ఏళ్ల షెహజాద్ అహ్మద్, 29 ఏళ్ల రింకు సింగ్ లాంటి అనుభవమైన ప్లేయర్లను సెలక్ట్ చేసినట్టు ఫైర్ అయ్యాడు. యంగ్ క్రికెటర్ల స్థానంలో సీనియర్లను తీసుకొచ్చి, అందరినీ మోసం చేస్తోందని బీసీసీఐపై మండిపడ్డాడు. చీటింగ్ చేసి గెలవడం తప్ప, టీమిండియాకు ఆట చేతకాదంటూ నిప్పులు చెరిగాడు.

రాసి పెట్టుకోండి…ధోని, కోహ్లీల‌ను దించినా టీమిండియాను ఓడిస్తాం

Advertisement

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాను ప్రకటించిన బీసీసీఐపై ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) విమర్శలు చేశాడు. పాకిస్తాన్ జట్టుకు భయపడి సీనియర్లను బరిలోకి దించుతున్నారని హేళన చేశాడు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా ఎంత మంది సీనియర్లను తీసుకువచ్చినా.. కచ్చితంగా టీమిండియాను ఓడించి తీరుతామని శపథం చేశాడు. అలా ఓడించకపోతే, తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరాడు. ఇన్ని రోజులు పాకిస్తాన్ ఓడిపోయి.. కృంగిపోయిందని గుర్తు చేశాడు. మొన్న జరిగిన హాంకాంగ్ సిక్సెస్ సందర్భంగా నే పాకిస్తాన్ పికప్ అందుతుందని.. అందుకే టీమిండియాను ఓడించినట్టు తెలిపాడు. ఇకపై ప్రతి మ్యాచ్ పాకిస్తాన్ విజయం సాధించడం గ్యారంటీ అని ఇంజమామ్ ఉల్ హక్ స్పష్టం చేశాడు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు అంటే?

Advertisement

ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నవంబర్ 22వ తేదీన ఆదివారం ఫైట్ జరగనుంది. ఖతార్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రసారాలు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే ఇంజమామ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ టోర్నమెంట్ అంటే సీనియర్లు దిగకూడదని రూల్ ఎక్కడ లేదని గుర్తు చేస్తున్నారు. క్రికెట్ లో వయసుతో పనిలేదని… టాలెంట్ ఉన్నవాళ్లు ఏ టోర్నమెంట్ అయిన ఆడవచ్చు అని వెల్లడిస్తున్నారు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

 

Related News

అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు

మహ్మద్ అమీర్ యమ డేంజర్.. వాడు ఐపీఎల్‌లోకి వస్తే కోహ్లీ, రోహిత్ లాంటోళ్లు తట్టుకోలేరు

మరోసారి పాకిస్తాన్, టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే? రివేంజ్‌కు సిద్ధమవుతున్న వైభవ్

ఛీ..ఛీ.. ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్.. నా కాళ్లు మొక్కినా ఆడను!

బీసీసీఐ డ‌బ్బుల‌కు ఆశ‌ప‌డి, 3-2 తేడాతో కావాల‌నే న్యూజిలాండ్ ఓడిపోయింది!

కేఎల్ రాహుల్ కు దూల ఎక్కువ‌..టీమిండియా ప్లేయ‌ర్ల హోట‌ల్ బిల్ అంతా క‌ట్టేస్తాడు!

టీమిండియాలో నో ఛాన్స్‌…దిక్కులేక ఆర్మీలో చేరిన శివ‌మ్ దూబే!

Big Stories

Advertisement
×