Karthika Deepam 2 serial today Episode: వంటల బాధ్యత తాను తీసుకుంటానని దీప చెబితే ఏం చేస్తారు. వేరే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెడతారా.. అని వెటకారంగా అడుగుతాడు సూరజ్. లేదని తానే వంట చేస్తానని చెప్తుంది దీప. ఇదేమీ ఇంట్లో చేసే వంట కాదని వెయ్యి మందికి భోజనాలు అంటాడు సూరజ్. వెయ్యి మందికి అయినా పదివేల మందికి అయినా నేను చేయాలనుకుంటే చేస్తాను సార్ అంటుంది దీప. ఈ వంటల్లో నాతో కలిసి వచ్చేదెవరు అంటూ దీప అడిగితే.. కార్తీక్, జ్యోత్స్న, మిగతా పని వారందరూ కలిసి వంట చేస్తామని చెప్తారు. దీప వంట మొదలు పెడుతుంది. సూరజ్ వెళ్లిపోతాడు.
దశరథ పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వెళ్తాడు. అదే ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న సుమిత్ర కాఫీ తీసుకుని వచ్చి దశరథకు ఇవ్వబోతుంది. అప్పుడు ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. అక్కడే ఉన్న ఇంటి ఓనరు ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేస్తాడు. ఇద్దరు షాకింగ్‌లోనే ఉంటారు. సుమిత్ర బాధగా కాఫీ ఇస్తుంది. వంట మనిషిగా ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు అని దశరథ అడిగితే.. పరిచయం ఉన్న వాళ్లలాగా మాట్లాడుకుంటున్నారు మీకు ముందే తెలుసా..? అని అడిగితే.. ఈ మాస్టారు నేను ఇంతకు ముందు పని చేసిన ఇంట్లో వాళ్ల పాపకు ట్యూషన్ చెప్పేవారని అంటుంది. సుమిత్ర ఈ ఇంట్లో వంట మనిషా అని దశరథ మనసులోనే బాధపడుతుంటాడు.
దీప వంట చేయడానికి మెటీరియల్ తెప్పిస్తుంది. అప్పుడే మాలిని వచ్చి ఇక్కడేం జరుగుతుంది అని అడిగితే.. అత్త ఇప్పుడు వచ్చి మీరేం టైం వేస్ట్ చేయోద్దు.. అంటుంది. అప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఆ వ్యక్తికి కార్తీక్ రిప్లై ఇస్తాడు. మటన్ బిర్యాని రాదని దాని ప్లేస్‌లో మరో స్పెషల్ బిర్యానీ వస్తుందని చెప్తాడు. ఆ వ్యక్తి సరే అంటాడు. ఇక అందరూ కలిసి వంట చేయడం ప్రారంభిస్తారు. అప్పుడే సూరజ్ కారు దగ్గరకు వెళ్తుంటే.. మీ చావు మీరు చావండి నేను వెళ్తున్నాను అంటూ వెళ్తున్నాడు అని జ్యోత్స్న మనసులో తిట్టుకుంటుంది. కానీ సూరజ్ తన డ్రెస్ తీసేసి కుకింగ్ డ్రెస్ వేసుకుని వస్తాడు. అది చూసిన జ్యోత్స్న, దీప ఆశ్చర్యపోతారు. అందరూ కలిసి వంట పూర్తి చేస్తారు.
తర్వాత ఆఫీసుకు వెళ్లాక మాలిని, దీపను తిడుతుంది. చైర్మన్ చేత వంట చేయించారు అంటూ నిలదీస్తుంది. నా కొడుకు సాయం చేస్తే తప్ప ఆర్డర్ పూర్తి చేయలేని చెత్త మేనేజ్‌మెంట్ చేసింది దీప అంటూ తిడుతుంది. ఆర్డర్ వెళ్లింది కదా మేడం అంటూ జ్యోత్స్న చెబితే.. నాకు తెలియదా..? కానీ పుడ్ ఆర్డర్ వెళ్లడం వల్ల లాభం గురించి ఆలోచించాల్సింది. నష్టం గురించి ఆలోచిస్తున్నాము.. సీఈవో పోస్ట్‌కు రిజైన్ చేసేయ్ మా రెస్టారెంట్‌ను మేము రన్ చేసుకోగలము అంటుంది. నువ్వేం మాట్లాడవు సార్ అని సూరజ్‌ను కార్తీక్ అడిగితే.. మా అమ్మ మాటే నాది అంటాడు సూరజ్. అందరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడే కస్టమర్ కాల్ చేస్తాడు. సూరజ్ లిఫ్ట్ చేయడానికి భయపడతాడు. మాలిని స్పీకర్ ఆన్‌లో పెట్టి మాట్లాడమని చెప్తుంది. సూరజ్ స్పీకర్ ఆన్‌లో పెట్టి మాట్లాడుతుంటాడు.
ఆ వ్యక్తి భోజనం అందరం తిన్నాం.. దాన్ని ఎవరైనా భోజనం అంటారా..? అనగానే.. అందరూ షాక్.. సైలెంట్‌గా చూస్తుంటారు. అప్పుడే ఆ వ్యక్తి నవ్వుతూ అమృతం అంటారు బాబు అంటాడు. ఆ మాటకు అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఫుడ్డు అదిరిపోయింది. మా వాళ్లు అయితే లొట్టలేసుకుంటూ తింటున్నారు.. మా వాడికి కాల్ చేస్తుంటే.. కలవడం లేదు అక్కడున్నాడా..? అని అడిగితే ఎవరని సూరజ్ అంటే.. కార్తీక్ అనగానే.. కార్తీక్ ఫోన్ తీసుకుని మాట్లాడతాడు. మాలిని కోపంగా చూస్తుంది. అప్పుడే ఆ వ్యక్తి సూరజ్‌ను ఒరేయ్ బాబు శివనారాయణ పరువు నిలబెట్టారురా..? జ్యోత్స్న రెస్టారెంట్ దమ్మేంటో చూపించారు అంటాడు.
ఆ మాటలకు సూరజ్, మాలిని షాక్ అవుతారు. కాల్ కట్ చేసిన తర్వాత కార్తీక్ మేనేజర్‌ను పిలిచి సరుకులు మార్చింది ఎవరు..? అంటూ కార్తీక్ గట్టిగా అడిగితే మేనేజర్ తానే సరుకులు మార్చింది అంటాడు. నాసిరకం సరుకులు కొనమన్నది ఎవరు..? చెప్పు అనగానే.. మాలిని తన పేరు చెప్తాడేమోనని భయపడుతుంది. వెంటనే వెళ్లి మేనేజర్‌ను కొడుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.