E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. అడ్డంగా దొరికిపోయాడే.. అయ్యో పాపం..

Podarillu Today Episode : చక్రీకి మైండ్ బ్లాక్.. అడ్డంగా దొరికిపోయాడే.. అయ్యో పాపం..
Advertisement

Podarillu Today Episode November 3rd: శైలు కేశవ ఇద్దరూ ప్రతి ఎపిసోడ్లను గొడవ పడుతూనే కనిపిస్తారు. మహాలక్ష్మి తన షాపు గురించి మంచి పోస్టర్ని ఇచ్చింది అని కేశవ చాలా సంతోషంగా ఉంటాడు.. అప్పుడు అక్కడే ఉన్నా శైలు అది చూసి మహాలక్ష్మిని అంతగా పొగుడుతున్నాడు అని చాలా కుళ్ళుకుంటూ కనిపిస్తుంది.. అయితే ఏమిలిద్దరూ గొడవపడతారు. మహాలక్ష్మి అంటే నేను నీకు ఇష్టం కదా మహాలక్ష్మితోనే మాట్లాడుకో పో నాతో ఏం మాట్లాడద్దు అని ఇద్దరు కూడా చాలా గొడవ పడుతూ ఉంటారు.. కానీ కేశవ్ మాత్రం ఇకమీదట గొడవ పడే ఓపిక నాకు లేదు కాబట్టి నీతోనే ఉంటాను అని వెటకారంగా మాట్లాడడంతో శైలు నిజమే అని నమ్ముతుంది..

చక్రికీ మహా ప్రపోజ్ చేస్తుందా..?

మహాలక్ష్మి ఫోన్ చేసి ఎక్కడున్నారు? నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి మీకు ఒక విషయం చెప్పాలి నా మనసులోని మాటని మీకు చెప్పాలనుకుంటున్నాను అని అనగానే చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. కొంపతీసి నా మీద ప్రేమ ఉందని చెప్తుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి కూడా చాలా సంతోషంగా తనకి చెప్పాలి అని అనుకోవడంతో చక్రి ఇంకా నాకు ప్రపోజ్ చేస్తుందనుకుంట నేనంటే ఇంత త్వరగా ఇష్టం కలుగుతుందని అస్సలు అనుకోలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి మహాలక్ష్మి నిజంగానే చక్రీకి ప్రపోజ్ చేస్తుందా లేదంటే తన బాసు విక్కీ ప్రపోజల్ గురించి చెప్తుందా లేదా తన ప్రాజెక్టు గురించి చెప్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా మహాలక్ష్మి చక్రి కలిసిపోతే ఆ తర్వాత ఎపిసోడ్లో చాలా బాగుంటాయని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇంత త్వరగా వాళ్ళిద్దరూ కలిసిపోతారా లేదా ఇంకేదైనా ట్విస్ట్ ని డైరెక్టర్ పెడతాడా అన్నది ముందు ఎపిసోడ్లో చూడాల్సిందే..

అయ్యో చక్రీ..

Advertisement

మహాలక్ష్మి నిజంగానే ప్రపోజ్ చేసింది అని చక్రి ఊహల్లో తేలిపోతుంటాడు. కార్లో కూర్చొని తనకి ప్రపోజ్ చేసింది అని చాలా సంతోషంగా ఉంటాడు. అయితే మధ్యలో విక్కీ వచ్చి ఆ ప్రపోజల్ కాస్త ఫెయిల్ అయ్యేలా చేశాడు అని బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పుడే మహాలక్ష్మి ఫోన్ చేసి వచ్చారా అని అడుగుతుంది సరే వచ్చాను అని చెప్పగానే చూసి వీడికి నాకు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉన్నాడు అని అనుకుంటాడు. లేకపోతే మహాలక్ష్మి ఏదో చెప్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న చక్రికి నిరాశ మిగిలింది. మహాలక్ష్మి నా స్కూటీ పాడైపోయింది అందుకే మిమ్మల్ని రమ్మన్నాను చాలా థాంక్స్ అని అంటుంది. ఇందుకోసం నన్ను పిలిచారా అని చక్రీ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు..

కన్నా, సత్య కలిసిపోయారు..?

కన్నా సత్య కోపంగా ఉండడంతో తన దగ్గరికి వెళ్లి నిజం చెప్పాలని అనుకుంటాడు. కానీ సత్య మాత్రం కన్నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. నేను నిన్న చాలా కోపంగా ఉన్నాను. అందుకే మీతో ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు మంచిగానే ఉన్నాను కదా.. అందుకే నీకు సారీ చెప్తున్నాను అని ప్రత్యేక కర్ణ ఎంతగా సారీ చెప్పినా కూడా తను మాత్రం చాలా కోపంగా ఉంటుంది.. అయితే ఇప్పటివరకు కర్ణ మాట్లాడిన తర్వాత కూడా తను చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అంతేకాదు చివరికి కన్న ఏదో ఒక విధంగా చెప్పడంతో మొత్తానికి సత్య కూల్ అయిపోతుంది ఇక ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ గా మిగిలిపోతారు. కన్నా ట్రాక్ లోకి సత్య ఇద్దరు త్వరలోనే ప్రేమలో పడేలా కనిపిస్తారు.

అడ్డంగా బుక్కయిన చక్రీ..

Advertisement

చక్రి మహాలక్ష్మి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్లిపోతూ ఉండగా ఒక ఇద్దరు అమ్మాయిలు కారుని ఆపుతారు.. అయితే ఆ అమ్మాయిలు చక్రి గతంలో ఎలా ఉండేవారు ఏం చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు. చక్రి అప్పట్లో చాలా బాగుండేవాడు ఇప్పుడు ఏమైంది రావట్లేదు నీకోసం ఒక అమ్మాయి ఏకంగా డ్యూయేట్ పాడుకుంటుంది నువ్వు అంత బాగా నచ్చేసావు. నువ్వు పెళ్లి కానప్పుడు పెళ్లి కాని అమ్మాయిలకి ఆఫర్ కూడా ఇచ్చావు కదా ఇప్పుడు ఇక్కడ ఆఫర్ అంత అడుగుతున్నావేంటి అని కావాలనే మహాలక్ష్మి వింటూ ఉంటుంది. చక్రి నేను అడ్డంగా బుక్కయ్య అనే అనవసరంగా వీళ్ళని ఎక్కించుకున్నాను అని అనుకుంటాడు ఇక మధ్యలోనే వాళ్ళని దింపేస్తాడు కానీ మహాలక్ష్మి మాత్రం చాలా కోపంగా ఉంటుంది.

అయ్యో చక్రీ పాపం..

కారు దిగిన తర్వాత మహాలక్ష్మి వెళ్లిపోతుంటే మహాలక్ష్మిని పిలుస్తాడు. అయితే మహాలక్ష్మి వచ్చి అయ్యో మీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను కదా అని ఇస్తుంది.అయితే పెళ్లి కాని అమ్మాయిలకి 50% ఆఫర్ అని పెట్టారు కదా అందుకే 150 రూపాయలు ఇచ్చాను అని అది చేతులు పెడుతుంది. మీరు ఇలాంటి ఆఫర్లు పెట్టారా ఆంటీలకి కూడా ఏవైనా ఆఫర్లు పెట్టారా అని మహాలక్ష్మి అంటుంది. అయితే మహాలక్ష్మి మాటలు వినయ్ అయ్యయ్యో ఈ అమ్మాయిలు నా పరువు తీసేసరే ఏదేదో ఊహించుకున్నాను ఏమీ లేదు అని బాధ పడిపోతూ ఉంటాడు చక్రి.

చక్రీని ఆడుకున్న మహా..

ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టిన తర్వాత చక్రీపై చాలా కోపంగా ఉంటుంది. అయితే మహాలక్ష్మి అంత కోపంగా ఉండడానికి చూసి కేశవ ఏమైంది రా నీ మీద అంత కోపంగా ఉంది ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక కేశవ జరిగిన విషయాన్ని చెప్పడంతో మొత్తానికి చక్రిని ప్రతి దానికి సగం సగం చేసి మిగిలిన విషయాన్ని అంతా అందరికి చెప్పేస్తుంది మహాలక్ష్మి. ప్రతి విషయం లను మహాలక్ష్మి అలా అనడంతో చక్రీ చాలా ఫీల్ అయిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఓటీటీ లవర్స్ కు పండగే.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సినవి సినిమాలు..!

Related News

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. శ్రీకర్ గుడ్ న్యూస్.. పల్లవికి మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని గురించి మేనేజర్ నిజం చెప్తాడా..?   

Gundeninda GudiGantalu Today episode: శోభా ఎంట్రీతో షాక్..మనోజ్ మళ్లీ మింగాడు.. చింతామణి మాటతో ప్రభా షాక్..

Tuesday TV Movies : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

ఎలిమినేషన్ తర్వాత రోహిత్ ఫస్ట్ పోస్ట్ చూసారా?ఎంత క్యూట్ గా ఉందో!

రోహిత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?

మీ ఇంట్లో భార్య,బిడ్డలు లేరా.. నెగెటివ్ ట్రోల్స్ పై ప్రియాంక ఫైర్!

Big Stories

Advertisement
×