E-Paper
Advertisement

కాళ్ళలో మునుపటి బలం లేదు…కన్నీళ్లు పెట్టుకున్న పండు మాస్టర్!

కాళ్ళలో మునుపటి బలం లేదు…కన్నీళ్లు పెట్టుకున్న పండు మాస్టర్!
Advertisement

Pandu Master: పండు మాస్టర్ పరిచయం అవసరం లేని పేరు ఢీ డాన్స్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పండు మాస్టర్(Pandu Master) గత కొద్ది నెలలుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈయన రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తన రెండు కాళ్లకు పూర్తిస్థాయిలో ప్రమాదం జరగడంతో కొన్ని నెలలుగా బెడ్ కి పరిమితం అయ్యారు. ఇప్పటికే తన కాళ్లకు పెద్ద ఎత్తున సర్జరీలు జరిగాయి. విశ్రాంతి తీసుకుంటున్న ఈయన తాజాగా తన హెల్త్ కి సంబంధించిన ఒక అప్డేట్ తెలియజేశారు.

కాళ్లల్లో తిమ్మిరి..

రోడ్డు ప్రమాదంలో తన కాళ్లకు పూర్తిగా గాయాలు కావడంతో ప్రమాద సమయంలో తనకు ఎడమ కాలికి సర్జరీ చేశారని అయితే ఇప్పుడు తన ఎడమ కాలు పూర్తిగా కోలుకుందని తెలిపారు . అయితే గత కొద్ది రోజుల క్రితం కుడి కాలికి సర్జరీ చేయడంతో ప్రస్తుతం నడవలేని పరిస్థితులలో ఉన్నానని తెలిపారు.. అయితే కుడికాలు కూడా ఎప్పటిలాగే పని చేయాలి అంటే సర్జరీ తర్వాత తనకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారని వాటిని చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ తన హెల్త్ అప్డేట్ తెలిపారు. అయితే మునపటిలాగా తన కాళ్లలో బలం లేదని, నడుస్తుంటే కాలు తిమ్మిరిగా ఉందని, నడవడానికి, ఎక్సర్సైజ్ చేయటానికి కూడా తనకు కాలు సపోర్ట్ చేయడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

త్వరగా కోలుకొని డాన్స్ చేయాలి..

Advertisement

పండు మాస్టర్ తిరిగి డాన్స్ చేయాలంటే ఇప్పుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. డాక్టర్స్ చెప్పిన విధంగా ఎక్సర్సైజ్ చేయకపోతే కాలు పొజిషన్ పూర్తిగా మారిపోతుందని ఈయన పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే ఎక్సర్సైజ్ చేసే సమయంలో భరించలేని నొప్పి కలుగుతుంది అంటూ పండు మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు మీరు తొందరగా కోలుకొని మళ్ళీ డాన్స్ చేస్తూ అందరిని నవ్విస్తారు.. ఇదే మా శాపం అంటూ ఈయన త్వరగా కోలుకోవాలని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

పండు మాస్టర్ ఈ ఏడాది జూన్ నెలలో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈయన తగరపువలసలో జరిగిన ఒక డ్యాన్స్ ఈవెంట్ ముగించుకొని తన టీం తో కలిసి తిరిగి హైదరాబాద్ వెళుతుండగా తన బృందంలో ఒకరికి అస్వస్థత చేయడంతో కారు రోడ్డు పక్కకు ఆపి ఉన్నారు. అదే సమయంలో పండు మాస్టర్ కిందికి దిగగా వెనుక నుంచి కోళ్ల లోడ్ తో వస్తున్న వాహనం ఢీ కొట్టి పండు మాస్టర్ ను కొంత దూరం పాటు ఈడ్చుకెళ్ళింది. ఈ నేపథ్యంలోనే పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. మొదట్లో ఈయన తిరిగి డాన్స్ చేయగలరా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ క్రమక్రమంగా పండు మాస్టర్ కోలుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: జిమ్ జిమ్ తార పాటకు లక్ష్మీ ఆంటీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Related News

బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!

ఘనంగా బుల్లితెర నటి మేఘన లోకేష్ సీమంతపు వేడుక..

ముఖేష్ మరీ ఇంత దిగజారిపోయావా.. దేబ్జానీ కన్నీటికి సమాధానం చెప్పగలవా?

మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు.. శివ పై వర్షిణి ఫైర్!

Illu Illaalu pillalu : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భాగ్యం అవుట్..

వర్షిణినీ అవమానించిన త్రిగుణ్.. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడవా

పెళ్లి పీటలెక్కిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ దివ్య – విక్రమ్.. ఫోటోలు వైరల్!

Big Stories

Advertisement
×