E-Paper
Advertisement

బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!

బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!
Advertisement

Dakshi Guttikonda:దక్షి గుత్తికొండ(Dakshi Guttikonda).. రామ్ గోపాల్ వర్మ(RGV) హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలు షోలు.. సోషల్ మీడియా అంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అలాంటి ఈమె బిగ్ బాస్ సీజన్ 10 లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే హౌస్ లోకి వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే నరేష్ తో లవ్ ట్రాక్, ఆ తర్వాత పెళ్లి అంటూ సరదాగా ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత శాలినితో గొడవ పెట్టుకోవడం లాంటివి చేసి కొంతవరకు స్క్రీన్ స్పేస్ దక్కించుకుంది. కానీ ఆటలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో హౌస్ నుండి రెండు వారాలకే బయటకొచ్చింది.

స్మోకింగ్ జోన్ చూపించకపోవడంతో దక్షి కామెంట్స్..

అయితే ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉండే స్మోకింగ్ ఏరియా గురించి నిజాలు బయట పెట్టడమే కాకుండా వీకెండ్ ఎపిసోడ్స్ షూటింగ్, అసలు తమకు ఏ రోజు ఫ్రీగా ఉంటుందో అలా అన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా..” గత సీజన్లలో బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ చూపించారు. మరి సీజన్ 10 లో చూపించకపోవడం వెనుక అసలు కారణం ఏమిటి?” అని ప్రశ్నించగా.. దక్షి మాట్లాడుతూ..” బిగ్ బాస్ రియాలిటీ షోని చాలామంది చూస్తారు. చిన్న పిల్లల్ని మొదలుకొని పెద్దవాళ్లు వరకు ఈ షో అందరికీ ఇష్టమే. అయితే అక్కడ ఉన్న స్ట్రెస్ కి , వాళ్లు ఎలా మళ్లీ కాపప్ అవుతున్నారు అనేది మనకు ఎలా తెలుస్తుంది. అందుకే స్మోకింగ్ జోన్ కి వెళ్లి.. వారు తమ స్ట్రెస్ ని తగ్గించుకుంటారు. అయితే వాళ్లు హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ స్మోకింగ్ కంటిన్యూ చేస్తారా? లేదా ? అన్నది కూడా మనకు తెలియదు. కాబట్టి ఆ స్మోకింగ్ జోన్ చూపించకపోవడమే మంచిది కదా అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది దక్షి.

అందుకే చూపించకపోవడమే మంచిది..

Advertisement

స్మోకింగ్ జోన్ ఈ సీజన్లో చూపించమని మీకు ముందే చెప్పారా ?అని అడగగా.. అలాంటిదేమీ లేదు. సాధారణంగా ఇలాంటి జోన్స్ ను చూపించకపోవడమే మంచిది. ఎక్కువగా పల్లెటూర్లను మొదలుకొని పట్టణాల వరకు ఎంతో మంది చూస్తూ ఉంటారు. అయితే వంశీ , త్రిగుణ్ గారిది చూపించారు . అది అవాయిడ్ చేయలేని సిచ్యూవేషన్. అలాగే రోహిత్, శాలిని వాళ్లది చూపించారు. ఎందుకంటే వారి ఎమోషన్స్ అన్ని అక్కడే బయటపడతాయి. నా ఒపీనియన్ ప్రకారం అది చూపించకపోవడమే మంచిది.. ఇలాంటివి చూపించడం వల్ల పిల్లలు కూడా త్వరగా అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూపించరు కూడా” అంటూ తెలిపింది.

also read:ఘనంగా బుల్లితెర నటి మేఘన లోకేష్ సీమంతపు వేడుక..

ఆ ఒక్క రోజే ప్రశాంతత..

Advertisement

హౌస్ లో మీకు ఏ రోజు ప్రశాంతంగా ఉంటుంది అని ప్రశ్నించగా.. శనివారం రోజు.. శనివారం, ఆదివారం ఎపిసోడ్ ల షూటింగు అయిపోతుంది. ఆదివారం రోజు సోమవారం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అసలు రిలాక్స్ అవ్వడానికి టైం ఉండదు. కాకపోతే శుక్రవారం రోజు మాత్రమే కాస్త రిలాక్స్ గా ఉంటాము. కాస్ట్యూమ్స్ వస్తాయి. స్పాన్సర్ వస్తుంటారు. ఆరోజు కొంచెం ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంటాము అంతే అంటూ హౌస్ లో జరిగే విషయాలను దక్షి బయట పెట్టింది.

Related News

రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?

ఘనంగా బుల్లితెర నటి మేఘన లోకేష్ సీమంతపు వేడుక..

ముఖేష్ మరీ ఇంత దిగజారిపోయావా.. దేబ్జానీ కన్నీటికి సమాధానం చెప్పగలవా?

కాళ్ళలో మునుపటి బలం లేదు…కన్నీళ్లు పెట్టుకున్న పండు మాస్టర్!

మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు.. శివ పై వర్షిణి ఫైర్!

Illu Illaalu pillalu : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భాగ్యం అవుట్..

వర్షిణినీ అవమానించిన త్రిగుణ్.. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడవా

Big Stories

Advertisement
×