E-Paper
Advertisement

జిమ్ జిమ్ తార పాటకు లక్ష్మీ ఆంటీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జిమ్ జిమ్ తార పాటకు లక్ష్మీ ఆంటీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Jim Jim Tara Singer Lakshmi Devi: జిమ్ జిమ్ తార పాట ఇటీవల కాలంలో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంస్టాగ్రామ్ యూజర్ అయినా గోగుల లక్ష్మీదేవి (Lakshmi Devi) అనే మహిళ సరదాగా వీడియోలు చేస్తూ వారి చిన్న వయసులో పాడిన పాటలను గుర్తు చేసుకుంటూ ఈమె ఒక రీల్ షేర్ చేశారు. ఇక ఈ రీల్ వీడియో భారీ స్థాయిలో ట్రెండ్ అవ్వడమే కాకుండా ఈ జిమ్ జిమ్ తార (Jim Jim Tara Song)పాటకు పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ మరింత వైరల్ చేశారు. ఇలా ఈ పాటకు మంచి క్రేజ్ ఏర్పడటంతో ఏకంగా పర్ణశాల సినిమాలో ఇదే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

రూ.5 లక్షలు ఇచ్చారంటూ వార్తలు..

తమ సినిమాలో ఈ పాటను ముందుగానే పెట్టామని అయితే మేము విడుదల చేయడానికి అంటే ముందుగానే లక్ష్మీదేవి సోషల్ మీడియాలో వాడటంతో తమ పాటకు ఊహించని ఫ్రీ ప్రమోషన్ లభించింది అంటూ పర్ణశాల నిర్మాతలు తెలిపారు. అయితే పర్ణశాల(Parnashala) సినిమాలో ఈ పాటను స్వయంగా సింగర్ లక్ష్మీదేవి చేత పాడించిన సంగతి తెలిసిందే. అయితే తన జిమ్ జిమ్ తార పాటను పర్ణశాల సినిమాలో పెట్టినందుకు పర్ణశాల టీం లక్ష్మీదేవికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. ఇలా జిమ్ జిమ్ తార పాట పర్ణశాల సినిమాలో ఉపయోగించినందుకు లక్ష్మీదేవికి ఏకంగా 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.

ఇచ్చింది రూ. 40 వేలు మాత్రమే..

Advertisement

ఇలా పర్ణశాల టీం తనకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ కామెంట్లపై సింగర్ లక్ష్మీదేవి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాను అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. అది తప్పు ఎవరు అలాంటి కామెంట్లు చేయొద్దు… నాకు వాళ్ళు ఇచ్చింది కేవలం 40 వేల రూపాయలు మాత్రమే అంటూ అసలు విషయాన్ని లక్ష్మీదేవి తెలిపారు. వాళ్ల ఇచ్చిన 40 వేల రూపాయలు చార్జీలకు సరిపోమాయని అంటూ లక్ష్మీ ఆంటీ తెలిపారు.

?mdxt=MWRhMzE0aTd6aW9pOQ==

Advertisement

ఎవరు కూడా తెలిసి తెలియకుండా ఇలాంటి కామెంట్లు పెట్టొద్దు. డబ్బులు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా.. అసలే మాది పేద కుటుంబం అక్కడికి వెళ్లాక 40 వేల రూపాయలు ఇస్తామంటే ఊరికే వెనక్కి రాలేక ఇచ్చేశామని అయితే పర్ణశాల టీంకు 40 వేలకు ఆ పాట రైట్స్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఈ పాట కోసం ఐదు లక్షలు 10 లక్షలు ఇస్తామంటూ కూడా మమ్మల్ని అడిగారు కానీ అప్పటికే మేము పర్ణశాల వాళ్లకు ఇచ్చేసామంటూ ఈమె అసలు విషయాన్ని తెలియజేశారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన ఈ జిమ్ జిమ్ తార పాట పేటెంట్ రైట్స్ కేవలం 40 వేల రూపాయలకే ఇచ్చారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది నిజంగా ఈమె కళను దోచుకోవడమే అంటూ కూడా  ఈ వీడియో పై స్పందిస్తూ వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Also Read: సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ది ట్రైటర్స్ నటి శ్రీదేవి!

Related News

త్రివిక్రమ్ కి నాగవంశీకి చెడిందా?

9 నెలల్లో రూ.132 కోట్ల ఆస్తి నష్టం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!

రాధిక ఆప్టేపై బాలయ్య ఫాన్స్ ఫైర్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ నిర్మాతానా.. కోలీవుడ్ ప్రమోటరా? తమిళ సినిమాలపై ఆ నిర్మాతకు అంత మోజు ఏంటో!

ఆ సినిమా చూసి రంపం వాడిన రాప్తాడు నిందుతుడు.. ఇదేం దరిద్రం రా బాబు!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు షురూ… సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేదిక ఫిక్స్?

గురూజీ – వెంకీ మ్యాజిక్ వర్కౌట్ కాలేదా? ఏకంగా అన్ని కోట్లు నష్టమా?

Big Stories

Advertisement
×