Meghana Lokesh: బుల్లితెరపై నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న మేఘన లోకేష్(Meghana Lokesh) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో శశిరేఖా పరిణయం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సీరియల్ తోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్న మేఘన అనంతరం తెలుగులో కళ్యాణ వైభోగం, రక్తసంబంధం, కళ్యాణం కమనీయం వంటి పలు సీరియల్స్ లో నటించి సక్సెస్ అందుకున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె జీ తెలుగులో చామంతి (Chamanthi) అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా చాలా మంచి సక్సెస్ అందుకున్న మేఘన లోకేష్ ఉన్నఫలంగా తాను చామంతి సీరియల్ నుంచి తప్పుకుంటున్నానని తెలియజేశారు. అయితే ఈమె సరైన కారణాన్ని తెలియచేయకపోయినప్పటికీ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించడంతో అభిమానులు ఈమె త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది అంటూ ప్రెగ్నెన్సీ గురించి సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తన ప్రెగ్నెన్సీ గురించి మేఘన అఫీషియల్ గా చెప్పకపోయినా ఈమె బేబీ బంప్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల తన బేబీ బంప్(Baby Bump) కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈమెకు అభినందనలు తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈమె సీమంతపు వేడుకలకు (Baby Shower)సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కుటుంబ సభ్యుల సమక్షంలో కాకుండా ఈ సీమంతపు వేడుకలు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2026(Zee telugu kutumbham Awards 2026) వేదికపై సెలబ్రిటీల సమక్షంలో నిర్వహించారు. ఇలా జీ కుటుంబం వేదికపై ఈమె సీమంతపు వేడుకను ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇలా ఈమె సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం అఫీషియల్ గా చెప్పకపోయినా అందరికీ తెలియడంతో మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా మేఘన లోకేష్ తెలియజేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక చామంతి సీరియల్ జీ తెలుగులో ప్రసారమవుతూ మంచి రేటింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ నుంచి ఈమె తప్పుకోవడంతో జీ కుటుంబం వేదికగా ఈమెకు ఘనంగా ఈ సీమంతపు వేడుకను నిర్వహించారని తెలుస్తుంది. ప్రస్తుతం మేఘన బేబీ బంప్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: కాళ్ళలో మునుపటి బలం లేదు…కన్నీళ్లు పెట్టుకున్న పండు మాస్టర్!