E-Paper
Advertisement

మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు.. శివ పై వర్షిణి ఫైర్!

మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు.. శివ పై వర్షిణి ఫైర్!
Advertisement

Bigg boss 10:బిగ్ బాస్ 10 షోలో తాజాగా 8వారాలు పూర్తవగా, తొమ్మిదవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ గట్టిగానే సాగుతోంది. ఇకపోతే ఈసారి నామినేషన్ హీట్ ఎక్కడం సంగతి పక్కన పెడితే.. కంటెస్టెంట్లను ఒకరికొకరు ర్యాగింగ్ చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇక అందులో భాగంగానే తాజాగా 58వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా అందులో ఏకంగా వర్షిని శివాపై మండిపడుతూ మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వర్షిణి – నరేష్ మధ్య వాగ్వాదం..

తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. వర్షిణి తన నామినేషన్ లో భాగంగా నరేష్ ను నామినేట్ చేస్తూ హోటల్ టాస్క్ లో మీరు ఝాన్సీ లాస్ట్ మినిట్ వరకు మిమ్మల్ని అడుక్కుంది అయినా టాస్క్ అయ్యేవరకు మీరు ఆవిడకు డబ్బులు ఇవ్వలేదు అంటూ పాయింట్ చెప్పి నామినేట్ చేసింది. దేబ్జానీ చెప్పింది మీరు డబ్బులు ఇవ్వకూడదని.. అయితే నరేష్ మాత్రం తనదైన శైలిలో వర్షినికి సమాధానం చెప్పారు. ఇక వర్షిని అక్కడితో ఆగకుండా మీరు ఏదైతే చెప్పారో నువ్వు ఇంకొకరి కోసం ఆడుతున్నామని, నేను కూడా నువ్వు ఇంకొకరి కోసమే ఆడుతున్నావు అంటూ రాంప్రసాద్ ను మధ్యలోకి లాగే వర్షిని నామినేట్ చేసింది. ఇక రాంప్రసాద్ తన నామినేషన్ లో భాగంగా వర్షిణిని నామినేట్ చేశారు. నువ్వు సూపర్.. నీ ఆట బాగుంది అని చెప్పిన వాళ్లే లాస్ట్ లో కన్నింగ్ అని రాశారు కదా..అలా రాసిన వారే కన్నింగ్ అంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు.

మా బంధాన్ని విడగొట్టాలని చూసారు అంటూ ఫైర్..

Advertisement

ఆ తర్వాత శివ కుమార్ ని నామినేట్ చేస్తూ.. మీరు వచ్చిన తర్వాత మా రిలేషన్ ని బ్రేక్ చేయాలని చూశారు. అందులో మీరు చాలా సక్సెస్ అయ్యారు. ఝాన్సీ ని బయటకు పంపించారు అంటూ శివ నే ఝాన్సీ వెళ్లడానికి కారణం అన్నట్టు వర్షిని పోర్ట్రైట్ చేసింది. అయితే శివ ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతూ ఈ మతిమరుపు గల ముఖేష్ ఉన్నాడు. ఆయన వల్లే ఆవిడ బయటకు వెళ్ళిపోయింది.ఇది నిజం అంటూ ఖచ్చితమైన పాయింట్ పెట్టి వర్షినికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.

also read:రాధిక ఆప్టేపై బాలయ్య ఫాన్స్ ఫైర్.. ఏం జరిగిందంటే?

స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శివ..

Advertisement

ఇక వర్షిని మాట్లాడుతూ.. ఎమోషనల్ గా మమ్మల్ని డౌన్ చేసారండి అంటూ కామెంట్ చేసింది శివ. మేము ఎమోషనల్ గా ఎవరిని డౌన్ చేయలేదు అంటూ చెప్పాడు. మీరు అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు కదా అని వర్షిని అడగడం.. శివా కూడా మీరు ఎంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారో మాకు తెలియదా అంటూ .. అసలు నన్ను నామినేట్ చేయడానికి మీకు అంత సీన్ లేదు అంటూ కూడా శివ మండిపడ్డారు . మొత్తానికైతే ఇక్కడ నామినేషన్ మాటల కంటే కూడా ర్యాగింగ్ చేసినట్లు స్పష్టంగా అనిపించింది. ఏది ఏమైనా తాజా ప్రోమో ఒక యుద్ధంలా గడిచింది అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 

Related News

Illu Illaalu pillalu : సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భాగ్యం అవుట్..

వర్షిణినీ అవమానించిన త్రిగుణ్.. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడవా

పెళ్లి పీటలెక్కిన ‘ఇంటింటి గృహలక్ష్మి’ దివ్య – విక్రమ్.. ఫోటోలు వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode November 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి ఇంట్లో ఉన్న పార్థును అమర్‌ చూస్తాడా..?         

అషు రెడ్డి నెలకు ఎంత సంపాదిస్తుంది..? లగ్జరీ లైఫ్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని అవమానించిన వేదవతి.. భద్ర ప్లాన్ సక్సెస్.. అసలు ట్విస్ట్ ఇదే..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న రమ్య.. శ్రీకర్ గుడ్ న్యూస్.. పల్లవికి మైండ్ బ్లాక్..

Big Stories

Advertisement
×