Bigg Boss 10:బిగ్ బాగ్ సీజన్ 10లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ముఖేష్ (Mukhesh )టైటిల్ విజేత అవుతాడు అని ఆడియన్స్ కామెంట్లు చేస్తుంటే.. ఆయన ప్రవర్తన మాత్రం రోజురోజుకు దిగజారిపోతోంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. లేనిపోని అభాండాలు, నిందలు వేస్తూ ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎదుటి వాళ్లకు అసహ్యంగా ఉంది అనే మాటలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. మరి తాజాగా విడుదల చేసిన ప్రోమోలో దేబ్జాని కన్నీటికి ముకేష్ సమాధానం చెప్పగలవా ? అంటూ అడిగిన ప్రశ్న అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న 9వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ముఖేష్ నోరు జారినట్టు కనిపిస్తోంది. డర్టీ మైండ్, అనర్హుడు అంటూ ముఖేష్ ని దేబ్జానీ నామినేట్ చేసింది. దేబ్జానీ మేడం వెనుకాల నేను తిరుగుతున్నానంట అని శివ అనడం.. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు.. ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. అసలు టాస్కులు, స్పీడు, బ్యాలెన్స్ కాదు.. బిహేవియర్ ఇంపార్టెంట్ అంటూ దెబ్జానీ మండిపడింది. అసలు ఈ మనిషికి బుద్ధుందా అని శివ అనడం.. మనం ఏం ఆలోచిస్తున్నామో అదే బయటకు వస్తుంది అని దెబ్జానీ చెప్పడం చూస్తుంటే మొత్తానికైతే ముఖేష్ అన్న మాటలు వీరిని బాగా హర్ట్ చేసినట్టు అనిపిస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. హోటల్ టాస్క్ లో భాగంగా మూడు స్టార్ల కోసం ముఖేష్ ఏకంగా దెబ్జానీ వెంట శివ పడుతున్నాడు అంటూ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు నామినేషన్ లో మరింత హీట్ పుట్టించింది. ఇదే విషయాన్ని నామినేషన్ పాయింట్ గా తీసుకొస్తూ..దేబ్ జానీ, శివ ముఖేష్ ను నామినేట్ చేశారు. ముఖ్యంగా వర్షిని , ముఖేష్ లను నామినేట్ చేస్తూ మీ రియాలిటీ ఇదే.. మీది జీరో పర్సనాలిటీ.. మీరిద్దరూ జీరో అని శివ అన్నాడు. అమ్మాయి వెనకాల నేను తిరుగుతున్నానా? ఛీ అని తిడతాడు. గేమ్ కోసం, మూడు స్టార్ల కోసం ఇంతలా దిగుజారుతాడా అని కూడా ముఖేష్ పై మండిపడ్డాడు.
ఆ తర్వాత త్రిగుణ్ రంగంలోకి దిగి.. ఆ డర్టీ మైండ్, వల్గర్ మైండ్ ని మూసుకొని కూర్చోమని చెప్పండి త్రిగుణ్ తిడతాడు. మీలాంటి వాళ్లకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడమే నా తప్పు అని శివా కూడా ఊగిపోయాడు ఇక పర్సనాలిటీ గురించి నువ్వు నాకు చెప్తున్నావా అని దేబ్జానీ తో ముఖేష్ అంటే.. ఆమె తనదైన శైలిలో మండిపడింది. ఇలా దేబ్జానీ , శివ, త్రిగుణ్ అందరూ ముఖేష్, వర్షినిలను నామినేట్ చేశారు.
also read:త్రివిక్రమ్ కి నాగవంశీకి చెడిందా?
నువ్వు ఫ్రెండ్షిప్ మీద చూపించిన వ్యాల్యూ జీరో.. నీకున్న వాల్యూ జీరో.. నీ విలువలు జీరో.. నోరు తెరిస్తే అబద్ధం.. ఆట ఆడడం రాదు.. బిహేవియర్ లేదు.. ఆడవాళ్ళతో మాట్లాడడం రాదు.. అంటూ ఇద్దరిపై కూడా మండిపడ్డారు త్రిగుణ్. అంతేకాదు ఈ సమాజానికి నువ్వు హానికరం అంటూ ముఖేష్ ను అనడం ఇక్కడ మరింత వైరల్ గా మారింది. ఒక్కొక్కరు ముఖేష్ ప్రవర్తన ను తిడుతుంటే అటు దేబ్జానీ కన్నీళ్లు పెట్టుకున్నట్లు చూపించారు. మొత్తానికైతే ముఖేష్ ప్రవర్తనతో ఆమె బాగానే హర్ట్ అయింది. మరి ఈ విషయానికి ఆయన సమాధానం చెప్పగలరా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ముఖేష్ ప్రవర్తన ఒకరకంగా ఇబ్బందిగా ఉందని అటు నాగార్జున కూడా ఈ విషయంపై ముఖేష్ ని మందలించాడు. అయితే ఇప్పుడు రోహిత్ ఇంట్లో లేడు.. ఝాన్సీ కూడా ఎలిమినేట్ అయింది. మరి ఇప్పటికైనా ముఖేష్ ప్రవర్తనలో మార్పు వస్తుందో లేదో చూడాలి.