Illu illaalu Pillalu Narmada : బుల్లి తెరపై పలు సీరియల్స్లలో నటిస్తున్న యాక్టర్స్ అంతా కూడా పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు. చాలామంది ఎన్నో కష్టాలను అనుభవించి ప్రస్తుతం సీరియల్స్లలో తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదా ఒకటి. ఈ సీరియల్ లో కోడలంటే ఇలా ఉండాలని ప్రతి అత్త.. భార్య అంటే ఇలా ఉండాలని భర్త.. అక్క అంటే ఇలా ఉండాలని చెల్లెలు.. వదిన అంటే ఇలా ఉండాలని మరిది కోరుకుంటారంటే ఆ పాత్ర ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒక్కటే కాదు. సీరియల్ మొత్తం ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. నర్మద గురించి కొన్ని ఆసక్తికరవిషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం..
అన్షు రెడ్డి జీవితంలో కన్నీళ్లు, కష్టాలు..
నర్మద అలియాస్ అన్షు రెడ్డి.. తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఎన్నో సీరియల్స్ లలో నటించి అందరిని ఆకట్టుకుంది. అందరిలాగే తాను కూడా చాలా ఇబ్బందులు పడి ఇక్కడికి వరకూ వచ్చానని చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది అన్షురెడ్డి. అంతేకాదు.. తెలుగు ఇండస్ట్రీలో కన్నడ బ్యాచ్ హవాపై కూడా మాట్లాడింది అన్షురెడ్డి.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె తన పర్సనల్ లైఫ్ గురించి బయట పెట్టింది. కన్నీళ్లు తెప్పిస్తున్న తన లైఫ్ లో ఎదుర్కొన్న సవాళ్ళను బయటపెట్టింది.
ఆర్ధికంగా ఇబ్బందులు ఉండేవి. హైదరాబాద్‌కి షిఫ్ట్ కాగానే.. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఓ చాక్లెట్ కంపెనీలో పనిచేసాను. అందులో చాక్లెట్ ప్యాకింగ్ చేసి పంపేదాన్ని. డైలీ కూలీ గా పని చేశాను. ఇంటర్‌లో చదువు ఆపేసి.. పనికి వెళ్లేదాన్ని. డైలీ రూ.70 ఇచ్చేవారు. 12 గంటలు కష్టపడితే రూ.70 ఇచ్చేవారు.. బస్ ఎక్కితే ఎక్కడ డబ్బులు అయిపోతాయో అని నడిచి వెళ్లేదాన్ని.నాతో పాటు మా అమ్మ, అక్క కూడా పనిచేసేవారు. మేం సంపాదించిన డబ్బుతో అన్నయ్యని చదివించే వాళ్లం. అప్పటికి అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు మెరుగుపరడంతో నేను కూడా చదువుకున్నాను అని అన్షు చెప్పారు.
Also Read: మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. డోంట్ మిస్..
అన్షు కెరీర్..
ఈమె ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చింది. అసలు నేను యాక్టర్ అవుతానని అనుకోలేదు. అనుకోకుండా అయ్యాను. వణుకుతూనే ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. మనకి ఇలా రాసిపెట్టి ఉంది.. అందుకే ఇలా వచ్చేసాను అని ఆమె అన్నారు. జెమినీ టీవీలో శ్రావణ సమీరాలు సీరియల్‌లో ఆఫర్ వచ్చింది. కానీ అన్నయ్య వద్దన్నాడు. చివరికి ఒప్పుకున్నాడు. అలాగే ఆమె భార్యామణి సీరియల్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అన్షురెడ్డి.. చాలా సీరియల్స్ నటించింది. అయితే ఆ సీరియల్స్ ఇవి అంతగా ఫేమస్ అయ్యేలా చేయలేదని ఆమె అన్నారు. ప్రస్తుతం నటిస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మాత్రమే ఆమెకు మంచి క్రేజ్ ను అందించిందని చెప్పింది. ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా బాగా పాపులారిటిని సంపాదించుకుంది. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు ఢీ షోలో డ్యాన్సర్ గా కూడా చేస్తుంది.