Singer Jhansi: సింగర్ ఝాన్సీ పరిచయం అవసరం లేని పేరు. రైతు బిడ్డగా పొలం పనులు చేస్తూ తనకు సంబంధించిన అన్ని వీడియోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తున్నారు. ఇక సింగర్ గా కొనసాగుతున్న ఝాన్సీ(Singer Jhansi) ఇటీవల బిగ్ బాస్ 10(bigg boss 10) కార్యక్రమంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అగ్ని పరీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఝాన్సీ అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి నేరుగా టికెట్ సాధించి అడుగుపెట్టారు. ఇలా టాస్కులలో గట్టి పోటీ ఇస్తున్న ఈమె టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ భావించారు.
ఇలా హౌస్ లో మంచి ఆట తీరును కనబరుస్తున్న ఝాన్సీ ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఝాన్సీ నిత్యం పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఝాన్సీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులందరికీ ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. నవంబర్ 28వ తేదీ ఝాన్సీ పుట్టినరోజు కావడంతో ఈసారి తన పుట్టినరోజు (Birthday)కాస్త ప్రత్యేకంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు ఈమె తెలియజేశారు. పుట్టినరోజు అంటే కేక్ కటింగ్ చేయడం సెలబ్రేషన్స్ మాత్రమే కాదని, నలుగురికి ఉపయోగపడే మంచి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఝాన్సీ తెలిపారు.
పుట్టినరోజు నవంబర్ 28వ తేదీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (chiranjeevi blood bank ) లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఝాన్సీ తెలిపారు. రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న విషయం అందరికీ తెలిసిందే. పనం చేసే ఈ రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగం కావాలి అంటూ ఝాన్సీ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. నా అభిమానులు స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని ఈమె కోరారు.
మీ అందరిని రక్తదాన శిబిరం కార్యక్రమంలో కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అక్కడ మీరందరూ నాతో మాట్లాడుతూ ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చని తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ఇచ్చే గిఫ్ట్ ఇదేనని రక్త దానం చేసి ఒకరి ప్రాణాన్ని కాపాడటమేనని తెలిపారు. రండి మనమంతా కలిసి ఒక మంచి పని చేద్దాం.. రక్తదానం చేద్దాం.. ప్రాణదాతలుగా నిలుద్దాం అంటూ ఝాన్సీ పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమం నవంబర్ 28వ తేదీ ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరగబోతుందని తెలియజేశారు.
Also Read: పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి పేరు కూడా రివీల్!