E-Paper
Advertisement

నా జీవితంలో దారుణమైన చీకటి రోజులవే: రోహిత్!

నా జీవితంలో దారుణమైన చీకటి రోజులవే: రోహిత్!
Advertisement

Rohit Naidu:అందరిలాగే సామాన్యుడిగా తన చదువును పూర్తి చేసి.. బీటెక్ పూర్తయ్యాక ఐటీ ఉద్యోగం చేసుకుంటూ ఆరంకెల జీతంతో జీవితం కొనసాగిస్తున్న సమయంలో.. అనూహ్యంగా బిగ్ బాస్ లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది. ఆ కోరికతో కామనర్ గా హౌస్ లోకి వెళ్లాలంటే కుదరదు. అందులోకి వెళ్ళాలి అంటే అగ్నిపరీక్ష సీజన్ 2 లో బలాబలాలు నిరూపించి.. హౌస్ లోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే అగ్నిపరీక్ష సీజన్ 2 కి దరఖాస్తు చేసుకొని.. అక్కడికి వెళ్లి తనదైన ఆట తీరుతో.. మాట తీరుతో జ్యూరీస్ ని మెప్పించి మొదటి ప్రయత్నంలోనే హౌస్ లోకి అడుగుపెట్టారు రోహిత్ నాయుడు పట్నం.

కిస్సిక్ టాక్స్ లో రోహిత్ బిగ్ బాస్ జర్నీ విశేషాలు..

బిగ్ బాస్ సీజన్ 10లోకి అడుగుపెట్టిన మొదటి, రెండు వారాలలోనే టైటిల్ విజేత అని.. అందరి చేత పిలిపించుకున్నారు. అలాంటి రోహిత్ అనూహ్యంగా ఎనిమిదవ వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఆడియన్స్ ఓటింగ్ వల్ల రోహిత్ ఎలిమినేట్ కాలేదని.. ఆయనది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. రోహిత్ ను మళ్లీ హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆడియన్స్ డిమాండ్ మేరకు రోహిత్ ను తీసుకోవాలని ప్రయత్నించినా.. రోహిత్ రిజక్ట్ చేశారు. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా మారిన రోహిత్ బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బాస్ జర్నీకి సంబంధించిన ఎన్నో విషయాలను రోహిత్ ఇందులో పంచుకున్నారు.

నా దాంట్లో అవే చీకటి రోజులు..

Advertisement

పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ వర్ష మాట్లాడుతూ.. మీ లైఫ్ లో అత్యంత బాధను కలిగించిన సందర్భం ఏదైనా ఉందా? అని ప్రశ్నించగా.. “నా లైఫ్ లో కీ రోల్ ప్లే చేయాలి అనుకున్నప్పుడు.. అక్కడ మనం లేకపోతే ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్యాప్ లో ఒంటరితనం ఏర్పడుతుంది. భయం పుడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే నా జీవితంలో అత్యంత భయంకరమైన చీకటి రోజులు అవే” అంటూ రోహిత్ చెప్పుకొచ్చారు.

also read:‘ఐ హేట్ మ్యారేజ్’ మూవీ రివ్యూ.. క్లైమాక్స్ కోసమైనా చూడాల్సిందేనా?

రోహిత్ లో మంచి సింగర్ కూడా..

Advertisement

ఇకపోతే ఈ సందర్భానికి తగ్గట్టుగా ఒక పాటను మ్యాచ్ చేస్తూ మరీ ఆలపించారు రోహిత్. ధనుష్ 3 సినిమాలోని “వై దిస్ కొలవరి ” సాంగ్లో ఉన్న హ్యాండ్ లో గ్లాస్.. గ్లాస్ లో స్కార్చ్.. ఐస్ ఫుల్లా టియర్.. ఎంప్టీ లైఫ్.. గర్ల్ కమ్.. లైఫ్ రివర్స్.. క్లియర్” అంటూ సాంగ్ పాడాడు. అయితే ఈ పాట పాడుతున్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ ఒంటరిగా ఉన్న సందర్భాన్ని, శాలిని ఎంటర్ ఇచ్చిన విషయాలను మ్యాచ్ చేస్తూ ప్రోమో ముగించారు. ఈ బిగ్ బాస్ జర్నీ పూర్తి వివరాలు తెలియాలి అంటే ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

ఝాన్సీ పుట్టినరోజు.. మంచి పనికి శ్రీకారం చుట్టిన రైతుబిడ్డ.. ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్!

నాపై కేస్ పెడతామని బెదిరించారు..నిజాలు బయటపెట్టిన రోహిత్!

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట.. బాలు దెబ్బకు మీనా షాక్.. ఇదేం ట్విస్ట్ గురు..

Brahmamudi Serial Today Episode November 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కాళ్ల మీద పడిపోయిన ప్రశాంత్ 

Illu Illalu Pillalu Today Episodes: చందుకు టెన్షన్.. ధీరజ్, ప్రేమ లవ్ ఆసనం.. రామారాజుకు టెన్షన్..

Big Stories

Advertisement
×