E-Paper
Advertisement

గాజులు గలగల హిట్.. గజ్జెలు గలగల ఫ్లాప్.. రాధమ్మ కూతురికి ఏంటీ షాక్!

గాజులు గలగల హిట్.. గజ్జెలు గలగల ఫ్లాప్.. రాధమ్మ కూతురికి ఏంటీ షాక్!
Advertisement

Gajjalu Gajjalu Galagala:గాజులు గాజులు గాజులు గల గల అంటూ పాట పాడి ఓవర్ నైట్ ఫేమస్ అయిన రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య ఈ మధ్యనే గజ్జెలు గజ్జెలు గలగల అంటూ అయ్యప్ప స్వామి పై మరో పాట చేసిన సంగతి తెల్సిందే .భవాని మాల వేసి చేసిన అమ్మవారి పాట ఏకంగా ఒక్కరోజులో మిలియన్ వ్యూస్ దాటేసి ఇప్పటికి ఏకంగా 25 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి సెన్సేషన్ అయిందని చెప్పక్కర్లేదు.

అది మిలియన్ల వ్యూస్ వెనకేసింది కాబట్టే ఇపుడు గాజులు గల గల స్థానంలో గజ్జెలు గజ్జెలు గల గల అని మార్చి ఈ పాట చేసిందని క్లియర్ గా అర్థం అవుతుంది.అయితే ఆ పాట హిట్ అయినంతగా ఈ పాట హిట్ కాలేదని ఇప్పటి వరకు వచ్చిన 6 లక్షల వ్యూసే చెబుతున్నాయి.

Advertisement

 

Advertisement

మొదటిసారిగా ఖండించిన కల్యాణి అమ్మ

ఇదిలా ఉంటే గాజులు గల గల పాట వచ్చినప్పుడు మొదటిసారిగా గొంతెత్తి ఖండించిన కల్యాణి అమ్మ ఇపుడు మరోసారి వార్తల్లో నిలిచింది.ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్యపై మండిపడింది.అప్పుడు పాట బాగా హిట్ అయిందని రెచ్చిపోయావ్ ,మేము ఏమైనా అంటే నాకొచ్చిన క్రేజ్ ని ఓర్వలేకే ఇలా విమర్శలు చేస్తున్నారు అంటూ మా మీదికి చెప్పు చూపించావు.పైగా నా వెనక అమ్మవారు ఉన్నారు అంటూ మా మీదకి సీరియస్ అయ్యావు.మరిప్పుడు గజ్జెలు గజ్జెలు గల గల అంటూ చేసిన పాటని అసలు చూడట్లేదు కదా ..అంటే ఇపుడు నీ వెనక అయ్యప్ప లేడనే అర్థమా అంటూ ఒక రేంజ్ లో ఉతికిఆరేసింది.

గజ్జెలు గజ్జెలు అనాల్సిన అవసరం ఏమొచ్చింది

అయినా గాజులు అన్నావంటే భవానీ అమ్మవారు కాబట్టి ఒకే .కాని అయ్యప్ప పాట పాడుతూ గజ్జెలు గజ్జెలు అనాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎకిపారేసింది.అసలు గజ్జెలకి అయ్యప్పకి ఏం సంబంధం ఉందని మండిపడింది.ఇక ఎప్పటిలాగే మళ్ళీ నేను అన్నానని నా పై ట్రోల్స్ చేస్తారని అయినా ఎక్కడా వెనకకి పోయేది లేదని కుండబద్దలు కొట్టేసింది.పైగా దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రీల్స్ అసలే చేయవద్దని,ఎవరు చేసినా , ధర్మాన్ని అవహేళన చేసే విధంగా ఎవరు రీల్స్ చేసినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుందని తేల్చేసింది.

అప్పుడు గాజులు గల గల ఇప్పుడు అయ్యప్ప మాల ..నీకో దండం తల్లీ

ఇక కల్యాణి అమ్మ లాగే చాలా మంది కూడా రాధమ్మ కూతురిపై మండిపడుతున్నారు.అప్పుడు గాజులు గల గల ఇప్పుడు అయ్యప్ప మాల ..నీకో దండం తల్లీ అని కొందరంటే అయ్యప్ప మాల అంటే కొన్ని నియమాలు ఉంటాయి, కాని ఇలా రీల్స్ కోసం దేవుడిపై ఎలా పడితే అలా పాటలు చేస్తే మా పిల్లలు ఏం నేర్చుకోవాలి అంటూ మరొకరు ఎకిపారేసారు.ఇక ఈ ఒక్క పాటే ఈమెకి వచ్చా అని , నువ్వు పాడకు నీకో నమస్కారం అని ఇంకొందరంటే, ఇష్టం ఉన్నప్పుడు పాడితే ఇక్కడ ఎవరూ ఊరుకోరు అంటూ ఊరుకోరు అంటూ వార్నింగ్ ఇచ్చారు .

ALSO READ:అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!

ముందు ముందు ఇంకే దేవుళ్ళపై పాటలు కట్టి పాడుతుందో !

ఇక కొంత మంది అయితే పాట పాట పాట నీ పాటా ..వచ్చేది వచ్చేది వాంతి అంటూ సెటైర్ వేసారు కూడా.అయితే ఎంత మంది ఎన్ని కామెంట్స్ చేసినా ఎక్కడా తగ్గకపోవడానికి కారణం గాజులు గాజులు గల గల పాటకి వచ్చిన వ్యూసే అని క్లియర్ గా అర్థం అవుతుంది.చూడాలి మరి గాజులు గాజులు గల గల ,గజ్జెలు గజ్జెలు గల గల అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రాధమ్మ కూతురు ముందు ముందు ఇంకే దేవుళ్ళపై పాటలు కట్టి పాడుతుందో !

Tags

Related News

నా జీవితంలో దారుణమైన చీకటి రోజులవే: రోహిత్!

ఝాన్సీ పుట్టినరోజు.. మంచి పనికి శ్రీకారం చుట్టిన రైతుబిడ్డ.. ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్!

నాపై కేస్ పెడతామని బెదిరించారు..నిజాలు బయటపెట్టిన రోహిత్!

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. నవంబర్ నెల హైలెట్స్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి కడుపుమంట.. బాలు దెబ్బకు మీనా షాక్.. ఇదేం ట్విస్ట్ గురు..

Brahmamudi Serial Today Episode November 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కాళ్ల మీద పడిపోయిన ప్రశాంత్ 

Big Stories

Advertisement
×