Rohit Naidu:బిగ్ బాస్ సీజన్ 10లోకి అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా కామనర్ కేటగిరీలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు రోహిత్. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రెండు వారాలలోనే యావత్ రియాలిటీ షో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. తన అద్భుతమైన ఆటతో.. మైండ్ గేమ్ తో అటు బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీని సైతం మెప్పించారు అంటే..ఇక ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి రోహిత్ టైటిల్ విజేత అని మొదటి రెండు వారాలలోనే ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. కానీ అనూహ్యంగా ఎనిమిదవ వారం రోహిత్ ను ఎలిమినేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో పూర్తి వ్యతిరేకతను కలిగించింది. ముఖ్యంగా కావాలనే రోహిత్ ను ఎలిమినేట్ చేశారని.. త్రిగుణ్ చెప్పినట్టే బిగ్ బాస్ నడుచుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదంతా పక్కన పెడితే మళ్లీ బిగ్ బాస్ లోకి అవకాశం కల్పించినా రోహిత్ ఆ అవకాశాన్ని అందుకోలేదు.
ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. పలు విషయాలపై స్పందిస్తున్న రోహిత్ తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik talks) కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసి.. పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా త్రిగుణ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారో.. ఆయన పీఆర్ టీమ్ కూడా అంతే దిగజారి ప్రవర్తిస్తుందని, త్రిగుణ్ మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీ కూడా అంతే దారుణంగా ప్రవర్తిస్తారు అంటూ రోహిత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కొంతమంది కావాలనే చాలా దారుణంగా లేనిది ఉన్నట్టు సృష్టిస్తూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కదా.మీ దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ? అని హోస్ట్ వర్షా ప్రశ్నించగా..” త్రిగుణ్ పీ.ఆర్ టీమ్ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. ఎంతటికైనా దిగజారడానికి సిద్ధమే. త్రిగుణ్ మేనేజర్ ఎవరో నామీద కేసు పెడతానన్నారు. నేను త్రిగుణ్ మాత్రమే ఇలా ఉన్నాడనుకున్నాను . కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే అని తెలిసి ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్లు కూడా అంతే దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ సంచలన నిజాలు బయటపెట్టారు రోహిత్.
also read:విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
నా వరకు ఓకే..నన్ను ఏమైనా అనండి. భరిస్తాను.. కానీ నా తల్లిని, చెల్లిని కూడా టార్గెట్ గా చేసుకొని కామెంట్లు చేశారు. ముఖ్యంగా నా చెల్లి గురించి దారుణంగా మాట్లాడారు. చాలా చెత్త బిహేవియర్ అంటూ రోహిత్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే త్రిగుణ్ పిఆర్ టీమ్ వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని డైరెక్ట్ గానే చెప్పారు రోహిత్. ఏదిఏమైనా మొదటి నుండి టైటిల్ విజేతగా నిలుస్తారు అని ఎంతోమంది కలలు కన్నారు. అయితే అలాంటి రోహిత్ ను విజేత కానివ్వకుండా.. త్రిగుణ్ పి ఆర్ టీం కావాలని ఇలా ప్రవర్తించి ఆయనను బయటకు పంపించేలా చేశారు అనే కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.