Illu illaalu pillalu Kamakshi : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఎక్కువగా ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇందులో కుటుంబ విలువల గురించి ఒక తండ్రి తన కొడుకులకు ఎలా చెప్తాడు? తన ఫ్యామిలీని ఎలా ముందుకు నడిపిస్తాడు అనే స్టోరీతో సీరియల్ సాగుతుంది. ఈ సీరియల్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్. అయితే ప్రతి క్యారెక్టర్ జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇందులో రామరాజు పెద్ద కూతురు పాత్రలో కామాక్షి నటించింది.. కామాక్షి సీరియల్ లో ఎంత పద్ధతిగా కనిపిస్తుందో బయట మాత్రం అందాల ఆటంబాంబ్ అని చెప్పాలి.. ఆమె రియల్ లైఫ్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ సుందరి ఫోటోలకు ఫాన్స్ ఫీదా అవుతున్నారు..
సుందరి బోల్డ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా..
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలు ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తమ నటనతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీరియల్ లో కామాక్షి పాత్రలో సుందరి నటించింది.. పేరుకు తగ్గట్లుగానే ఈమె చాలా సుందరంగా అందంగా ఉంటుంది. సీరియల్ లో చీర కట్టుకొని చాలా పద్ధతిగా కనిపించే ఈమె రియల్ లైఫ్ లో మాత్రం బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చి ఆడియన్స్ కి మతిపోగొడుతుంది. ట్రెండి వేర్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్ వేసుకోండి..
ఈ సుందరి మొదట జెమినీ టీవీలో ప్రసారమైన కన్యాదానం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆమెకు క్రేజ్ కూడా పెరిగింది. దాంతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సీరియల్లో రామరాజు పెద్ద కూతురు కామాక్షి అనే క్యారెక్టర్ లో నటిస్తుంది. ఇందులో ఈమె క్యారెక్టర్ తక్కువే అయినా సరే తన పిచ్చితనంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే అందరితో పోలిస్తే ఈమె క్యారెక్టర్ తక్కువ. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఎక్కువే.. ఒక్క రోజుకి ఈమె దాదాపు 15 వేలకు పైగా చార్జ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల ఈ సీరియల్ ద్వారా ఈమె లక్షలు సంపాదిస్తుంది. అటు సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండడంతో అక్కడ కూడా బాగానే సంపాదిస్తూ బిజీ లైఫ్ని గడుపుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ లో నటిస్తుంది. ఇక మరో రెండు సీరియల్స్ కు సైన్ చేసినట్లు తెలుస్తుంది. అవేంటనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.