Illu Illalu Pillalu Today Episode October 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు తన కొడుకుల గురించి బాధపడుతూ ఉంటాడు.. నేను పెళ్లికి ముందు ఒక అనాధని.. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది బుజ్జమ్మ. ఒకప్పుడు నన్ను ఏరా రామరాజు అని ప్రేమగా పిలిచే వాళ్ళు కూడా లేరు. పెళ్లి తర్వాత నువ్వు అందర్నీ దూరం చేసుకుని నా ఇంటికి వచ్చాక నేను నీ ప్రేమని ఎంతగా పొందానో అది నీకు కూడా తెలుసు. నిన్ను ఎప్పటికీ సంతోషంగా చూసుకోవాలని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. అలా మనకు ఇంత మంది పిల్లలు కలిగిన తర్వాత నా కుటుంబము అన్నది నాకు వచ్చింది మళ్ళీ నా కుటుంబాన్ని నేను దూరం చేసుకోలేను అని బాధపడుతూ ఉంటాడు.. సాగర్ కోపాన్ని నర్మద తగ్గిస్తుంది. ప్రేమ ధీరజ్ ల మధ్య దూరం మాయం. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. భద్ర విశ్వం శ్రీవల్లితో మాట్లాడటం నర్మదా చూస్తుంది. వేసిన శ్రీవల్లి లోపలికి రాగానే ఏంటి వాళ్లతో మాట్లాడుతున్నావు? ఎదురింటి వాళ్ళతో నీకేం పని? మావయ్య గారి గురించి వాళ్ళు చండాలంగా మాట్లాడుతున్నారు అందుకే వార్నింగ్ ఇస్తున్నాను అని శ్రీవల్లి అంటుంది. నర్మదకు మాత్రం ఎక్కడో డౌట్ కొడుతుంది. నీ ముందరే వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను కదా మరి నువ్వు నమ్మవేంటి నమ్మాలి బాబా అని శ్రీవల్లి అంటుంది. ఏదో జరుగుతుంది అది గనక తెలిస్తే నీ ఆట కట్టిస్తాను అని శ్రీవల్లికి నర్మదా వార్నింగ్ ఇస్తుంది.
అయ్యబాబోయ్ ఎవరికి దొరకకూడదు వారికే దొరికేసానుగా జరనుంటే నన్ను ఇంట్లో నుంచి గంటసేవాళ్ళు అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్లి పూజ చేసి దేవుడిని వింత కోరికలు కోరుతుంది. ఆ తర్వాత కాఫీ పెట్టి చందు కి ఇస్తుంది.. చందు మాత్రం శ్రీవల్లిని దూరం పెట్టడంతో బాధపడుతుంది. మా వాళ్ళు చేసిన తప్పుకి అమాయకురాలు అయిన నన్ను పెళ్లి చేసావేంటి బావ నేనేం చేశాను అని బాధపడుతుంది. చందు శ్రీవల్లి బాధను చూసి ఓర్వలేక దగ్గరకొచ్చి ముద్దు పెట్టేస్తాడు. ఆ ఆనందం తట్టుకోలేని శ్రీవల్లి బయటకొచ్చి మా ఆయన ముద్దు పెట్టాడో అంటూ కేకలు వేస్తుంది.
బయట కూర్చుని ఉన్న వేదవతి నర్మదా ప్రేమ ముగ్గురు కూడా శ్రీవల్లి ప్రవర్తనతో షాక్ అవుతారు. మీ ఆయన నీకే కదా ముద్దు పెట్టింది. అదేదో చేయకూడని పని చెప్పుకోలే నీది అన్నట్లుగా అంతగా అరుస్తున్నావ్ ఏంటి అని నర్మదా అడుగుతుంది. మా ఆయన కూడా నాకు రాత్రి ముద్దు పెట్టాడు అదేమైనా నేను చెప్పుకున్నానా? అంతెందుకు అత్తయ్యకు మావయ్య ఎన్నోసార్లు ముద్దు పెట్టి ఉంటాడు అది చెప్పిందా? మొన్న బ్యాచిలర్ పార్టీకి వెళ్ళిన ప్రేమ కు ధీరజ్ ముద్దు పెట్టాడు ప్రేమ చెప్పుకుందా? నువ్వెందుకు ఇలా చంకల గుద్దుకుంటున్నావో అర్థం కావడం లేదు అని శ్రీవల్లి పరువు తీయడంతో పాటుగా వేదవతిని ఇరికిస్తుంది నర్మదా.
మీతో చేరితే నేను కూడా మీలాగా మారిపోతానేమో నేను వెళ్ళిపోతాను అని వేదవతి అంటున్న సరే నర్మదా కూర్చొని అత్తయ్య అని అంటుంది. మొత్తానికి శ్రీవల్లికి సంతోషంగా ఉన్నా సరే నర్మద ఇచ్చిన క్లాస్ తో శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. ధీరజు ప్రేమకు ముద్దొచ్చాడా? శ్రీవల్లి నువ్వు లోపలికి వెళ్ళు అని వేదవతి హిందీలో చెప్తుంది. నర్మదను ఆ ముద్దు గురించి అడుగుతుంటే ప్రేమ సిగ్గు పడుతుంది. మొత్తానికి ప్రేమ గురించి వేదవతికి నర్మదా పూస గుచ్చినట్లు అంతా చెప్పేస్తుంది. ఇక తర్వాత రోజు ధీరజ్ కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంటాడు.
Also Read: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ కామాక్షి రియల్ లైఫ్.. కుర్రాళ్ల మతిపోగొడుతుంది మావా..
ప్రేమ నాకు కుడి కన్ను అదిరింది ధీరజ్ నువ్వు ఈరోజు వెళ్లొద్దు అని అంటుంది. కొత్తగా ఇవాళ నేను జాబ్ లో జాయిన్ అవుతున్నాను అలాంటిది వెళ్ళొద్దని అంటావు నీకేమైనా పిచ్చా అని అంటాడు. నాకు కుడికన్ను అదురుతుంది ఏదో కీడు సంఖ్యేస్తుంది నువ్వు వెళ్ళద్దు అని బ్రతిమలాడుతుంది.. నువ్వు నీ మూఢనమ్మకాలు అని ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ ఎంతగా ఆపాలని ప్రయత్నించినా సరే ధీరజ్ ప్రేమని పక్కకు నెట్టేసి వచ్చేస్తాడు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ప్రేమ చెప్పింది కూడా నీ మంచి కోసమే కదరా విను అని అంటారు. ప్రేమకు సపోర్ట్ చేస్తూ అందరూ ధీరజ్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపాలని ప్రయత్నిస్తారు. ఎదురుగా వచ్చిన రామరాజు ఏమైంది అని అడుగుతాడు. నర్మదా అసలు విషయాన్నీ చెప్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రామరాజు ధీరజ్ ని వెళ్లమని అంటాడా..? లేక అందరితో కలిసి ప్రేమ సెంటిమెంట్ కి సపోర్ట్ చేస్తాడా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..