OTT Movie : సీరియల్ కిల్లర్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. ప్రతి క్షణం ఆడియన్స్ కి వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. ఇవి ఇచ్చే బ్లడ్ బాత్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి సినిమాలలో దెయ్యాలకన్నా, ఇలాంటి కిల్లర్ లను చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు మనంచెప్పుకోబోయే సినిమా, ఒక జపాన్ సీరియల్ కిల్లర్, ఇండోనేషియన్ జర్నలిస్ట్ మధ్య తిరుగుతుంది. వీళ్ళు చేసే వయలెన్స్ భయంకరం ఉంటుంది. కానీ కథ కూడా ఇంట్రెస్టింగ్ నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘కిల్లర్స్’ (Killers) 2014లో వచ్చిన ఇండోనేషియన్ హారర్ మూవీ. కిమో స్టాంబోల్, తిమో తజాంటో (ది మో బ్రదర్స్) దీనికి దర్శకత్వం వహించారు. . ఇందులో నోమురా (కాజుకి కిటమురా), బాయు (ఓకా అంతరా) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 18 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2014 జనవరీ 31 ఇండోనేషియాలో విడుదల అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో అవుతోంది. దీనికి IMDb లో 6.4/10 రేటింగ్ ఉంది.
టోక్యోలో నోమురా అనే సీరియల్ కిల్లర్, మహిళలను చంపి, ఆ హత్యల వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తుంటాడు. నోమురా చాలా క్రూరమైనవాడు, హత్యలు చేయడం అతనికి ఆటలాగా ఉంటుంది. మరో వైపు జాకార్తాలో బాయు అనే జర్నలిస్ట్ ఉంటాడు. బాయు తన జాబ్, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. ఒక రోజు అతను నోమురా వీడియోలు చూస్తాడు. నోమురా ధైర్యం, క్రూరత్వం బాయును ఆకర్షిస్తాయి. దీంతో బాయు తనలోని వైల్డ్ యాంగిల్ ని బయటికి తెస్తాడు. ఇతను చెడ్డ వాళ్లను చంపడం మొదలెడతాడు. అతను కూడా తన హత్యల వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తాడు. నోమురా, బాయు వీడియోలు చూసి, అతన్ని ఆన్‌లైన్‌లో కలుస్తాడు. వాళ్ల మధ్య విచిత్రమైన బంధం మొదలవుతుంది.
Read Also : అర్దరాత్రి అమ్మాయిల్ని చంపే సైకో… ఒంటరి ఆడపిల్లలే టార్గెట్… మెంటల్ మాస్ ట్విస్టులు