OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను టివిలకు అతుక్కుని చూస్తుంటారు మూవీ లవర్స్. అందులోనూ పోలీసు ఆఫీసర్ చేసే యాక్షన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ సినిమా, ఒక పోలీసు ఆఫీసర్ తన సోదరుడి కూతురు కిడ్నాప్ కేసులో దిమ్మ తిరిగే విషయాలను వెలుగులోకి తెస్తాడు. ఈ సినిమా క్లైమాక్స్ వరకూ ఆసక్తికరంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే
‘ట్రిగ్గర్’ (Trigger) (2022) తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సమ్ ఆంటన్ దీనికి దర్శకత్వం వహించారు. ముఖ్య పాత్రల్లో ప్రభాకరన్ (అతర్వా), తన్యా (తన్యా రవిచంద్రన్), కృష్ణ (కృష్ణ), వినోతిని (వినోతిని) నటించారు. దాదాపు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.9/10 రేటిని పొందింది. ఇది 2022 సెప్టెంబర్ 23న విడుదల అయింది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ప్రభాకరన్ అనే ఒక డేరింగ్ పోలీస్ ఆఫీసర్ ఒక మిషన్‌లో, తన ఇన్ఫార్మర్‌ను కాపాడటానికి కమిషనర్ ఆర్డర్‌ను పాటించనందుకు, అతన్ని సస్పెండ్ చేస్తారు. కానీ కమిషనర్ అతన్ని తమిళనాడు పోలీస్ ఇంటర్నల్ అఫైర్స్ విభాగంలో పోస్టింగ్ ఇస్తాడు. అక్కడ ప్రభాకరన్ తన సోదరుడు కార్తి కూతురు నిషా కిడ్నాప్ కేసు తెలుసుకుంటాడు. ఆ తరువాత నిషా శవమై కనిపిస్తుంది. ప్రభాకరన్ ఈ కేసును విచారిస్తాడు. కానీ కేసు వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తాడు. తనదైన స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.
Read Also : బాబోయ్ ఇదేం సినిమా… పోలీస్ ఆఫీసర్ మర్డర్… కిల్లర్‌కే చెమటలు పట్టించే అమ్మాయి… కిర్రాక్ క్రైమ్ థ్రిల్లర్
ప్రభాకరన్ ఈ కేసు వెనుక సైకో కిల్లర్ ఉన్నాడని తెలుసుకుంటాడు. తన్యా అనే మహిళ ఈ కేసులో అతనికి సహాయం చేస్తుంది. ఆమెతో ప్రభాకరన్ ప్రేమలో కూడా పడతాడు. కానీ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ప్రభాకరన్ తన సోదరుడు కార్తి, భార్య వినోతినితో కలిసి కేసు విచారిస్తాడు. కథ నడిచే కొద్దీ ప్రభాకరన్ కిడ్నాప్ కేసు వెనుక నిజాన్ని కనుక్కుంటాడు. ఇది షాకింగ్ ట్విస్ట్లు ఇస్తుంది. అసలు ఆ అమ్మాయిని సైకో ఎందుకు కిడ్నాప్ చేశాడు ? ప్రభాకరన్ ఎలా కిల్లర్ ని కనిపెట్టాడు ? అనే విషయాలను, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసితెలుసుకోండి.