BigTV English

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి కాఫీకి అందరు ఫిదా.. రామ రాజు ఇంట్లో చిచ్చు పెట్టిన భాగ్యం..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి కాఫీకి అందరు ఫిదా.. రామ రాజు ఇంట్లో చిచ్చు పెట్టిన భాగ్యం..

Illu Illalu Pillalu Today Episode April 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ వెళ్లాలని గీత దగ్గరకి రాగానే ఆగిపోతుంది. నువ్వు అగీత దాటి బయటికి వెళ్లలేవు అని ధీరజ్ అంటాడు. మనము ఇష్టం లేకపోయినా ఆ బంధంలోకి అడుగు పెట్టాము. ఇష్టం ఉన్నా లేకున్నా కలిసి ఉండాలి నువ్వు వెళ్లాలనుకున్న వెళ్లలేవు అని ధీరజ్ అనగానే ప్రేమ ఆలోచించి లోపలికి వెళ్ళిపోతుంది.. మా వదిన స్థానంలో నువ్వుండి ఆలోచించు అని అనగానే దీరేస్ మాటల్ని ఆలోచించుకుంటూ ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది. ధీరజ్ లోపలికి వెళ్ళిపోతుంటే రామరాజు తన మరిదితో మాట్లాడుతున్న విషయాలను వింటాడు.. ఈ పెళ్లి ఇంత బాగా జరగడానికి నా పరువు కాపాడింది నా చిన్న కొడుకే అని సంతోషంగా ఉంటాడు.  నా కొడుకు వల్లే నేను ఇలా ఈరోజు ప్రాణాలతో మిగిలి ఉన్నాను. పెళ్లి ఆగిపోయిందని అందరూ నన్ను అవమానిస్తుంటే నేను ఎక్కడ కృంగిపోతాను అని నా చిన్న కొడుకు నేను పెళ్లి సమయానికి అన్నయ్యని తీసుకొస్తాను నాన్న అని వెళ్ళాడు మాట నిలబెట్టుకున్నాడు వాడే నా పరువు నిలబెట్టింది అని గొప్పగా చెప్పుకుంటాడు.. శ్రీవల్లి మాత్రం భాగ్యం ప్లాన్ ప్రకారం అంతా అంతా చేస్తాను అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తర్వాత రోజు ఉదయం లేచి శ్రీవల్లి ఒక్కటే అన్ని పనులు చేస్తుంది. అందరు ఎవరు చేశారో అని అనుకుంటారు. అప్పుడే కాఫీ తీసుకొని శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఈ పనులు అన్ని నువ్వు చేశావా? అని అడుగుతారు.. ఆయ్ ఆ పనులు అన్ని నేనే చేశాను అని అంటుంది.. నువ్వా అని షాక్ అవుతారు. నాకు ఇంట్లో నాలుగు గంటలకు లేసి పనులన్నీ చేయడం అలవాటు అలానే ఇక్కడ కూడా చేశాను మా అమ్మ చెప్పినట్లే చేశాను అని అందరి దగ్గర మొదటి రోజే మార్కులు కొట్టేస్తుంది. శ్రీవల్లి చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ సరదాగా సంతోషంగా ఉంటారు. అందరిని తన తీరుతో బుట్టలో వేసుకుంటుంది శ్రీవల్లి..

రామరాజు వాకింగ్ కానీ బయటికి వెళ్తూ ఉంటే శ్రీవల్లి గుడ్ మార్నింగ్ అని చెప్పి ఆపుతుంది.. కాఫీ తీసుకొని మావయ్య అని అడిగితే నేను వాకింగ్ కి వెళ్లి వచ్చిన తర్వాత తాగుతానమ్మ అని శ్రీవల్లితో అంటాడు. కానీ శ్రీవల్లి మాత్రం కడుపులో ఏదైనా లేకుండా ఖాళీ కడుపుతో పోతే నీరసం వచ్చి పడిపోతారు. అసలే మీరు వయసుని దృష్టిలో పెట్టుకొని వాకింగ్ చేయాలి మావయ్య గారు అంటూ సలహాలు ఇస్తుంది. ఇక రామరాజు కోడలు చెప్పినట్లు కాఫీ తాగుతాడు. ఆ కాఫీ ని తాగగానే పొగిడేస్తాడు. ఇలాంటి కాఫీని నేను నా జన్మలో ఎప్పుడు తాగలేదని గొప్పగా అంటాడు.


ఇక మీ అత్తయ్య కూడా ఎప్పుడూ ఇలాంటి మంచి కాఫీ ని పెట్టలేదని అంటాడు దాంతో వేదవతి చిన్న బుచ్చుకుంటుంది.. నర్మదాను కాఫీ చూసి నేర్చుకోమని చెప్తాడు. దానికి కాఫీతో శ్రీవల్లికి మంచి మార్కులే పడతాయి.. ఇక ధీరజ్ ప్రేమ కోసం కాఫీ ని తీసుకెళ్లి ప్రేమగా లేపుతాడు. ప్రేమపై సెటైర్లు వేస్తాడు. కనీసం కాఫీ పెట్టడమైన నేర్చుకో అని అంటాడు. చూడు ఉదయాన్నే నాలుగు గంటలకు లేసి అన్ని పనులు చేసి కాఫీ ఎలా పెట్టిందో కనీసం నువ్వు ఒక్కరోజైనా అలా కాఫీ పెడితే చూడాలని ఉంది అని ప్రేమ అంటాడు. దానికి ప్రేమ నాకు కాఫీ తీసుకురానికి నువ్వు ఉన్నావు కదా ఎక్కువైతే కాఫీ పెట్టక చేస్తావు కదా అనేసి అంటుంది.

ఇక భాగ్యం అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ. శ్రీవల్లి చూడగానే ఏంటమ్మా అప్పుడే నువ్వు ఇంత సన్నగా తగ్గిపోయావు అనేసి అనగానే. అందరూ మీ అమ్మాయి వచ్చి ఒక్కరోజే అయింది. అప్పుడే ఎలా సన్నగా తగ్గిపోతుంది అని అంటారు. అమ్మ చాటు బిడ్డ అండి అమ్మని మీద ప్రేమతో తగ్గిపోయింది అని అంటుంది. ఇక అప్పుడే రామరాజు ఇంట్లోకి వస్తాడు. అన్నయ్య గారు మీకు నూరేళ్లండి మీ గురించి ఇప్పుడే అడుగుతున్నాను. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు అని అనగానే రండి చెల్లమ్మ కూర్చుందురని రామరాజు అంటాడు.

తన చేతిలో ఉన్న బ్యాగుల్ని తీసుకెళ్లి నీ గదిలో పెట్టని శ్రీవల్లితో అంటుంది. శ్రీవల్లి మాత్రం తెల్ల మొహం వేసుకుని అక్కడే ఉంటుంది. అదేంటే బ్యాగులు నీ గదిలో పెట్టమంటే అలా గమ్మున నిలుచున్నావ్ ఏంటి? అని భాగ్యం అడుగుతుంది.. తర్వాత మీకు గదిలేకపోవడమేంటి? అని భాగ్యం అడుగుతుంది. ఇంట్లో ఉన్నదే మూడు గదులు అందులో ఒక గదిలో నర్మదా సాగర్ ఉంటారు. ఇంకొక గదిలో ప్రేమ ధీరజ్ ఉంటారు. మూడో గదిలో మావయ్య గారు అత్తయ్య గారు ఉంటారని శ్రీవల్లి అంటుంది.

అదేంటి కొత్తగా పెళ్లయిన జంట కదా మీకు అచ్చట ముచ్చట ఉంటుంది. రేపు అన్ని సాంప్రదాయ ప్రకారం జరిపించాలి మరి గది లేకపోతే ఎక్కడ పెడతారు. అన్నయ్యగారు అని భాగ్యం ఇంట్లో చిచ్చు పెడుతుంది. మీకు ముందే చెప్పాను కదా చెల్లెమ్మ ఇంట్లో ఇంకొక గది కట్టించాలని ఇప్పుడే మేస్త్రిని పిలిపిస్తాను ఇంకొక గది కట్టిస్తానని అంటాడు.. మేస్త్రి వచ్చి ఇప్పుడు గది కట్టడానికి ఎలా లేదన్న 10 15 రోజులు పడుతుంది అన్నయ్యగారు అప్పటివరకు వీళ్ళు ఇలానే బయట పడుకోవాలా అని అడుగుతుంది.

అదేం పని లేదమ్మా వీళ్ళు మా గదిలో ఉంటారని రామరాజు అంటాడు. కానీ సాగర్ మాత్రం మీరు మా గదిలో ఉండొచ్చు అని అంటారు. అటు ధీరజ్ కూడా అన్నయ్య వదిన మా గదిలోనే ఉంటారు. ఆ గది కట్టేంతవరకు మేము బయట పడుకుంటామని అంటాడు. రామరాజు మీరందరూ కొత్తగా పెళ్లయినోళ్లు మాకు మా గదేమో అవసరం లేదు మీరు మా గదిలో ఉండొచ్చు అని అంటాడు. కానీ ధీరజ్ మాత్రం మీరు రైస్ మిల్లులో రోజంతా నిల్చనే ఉంటారు. అమ్మ రోజంతా ఇంట్లో పనులు చేస్తూనే ఉంటుంది మీరు మా గదిలో ఉండొచ్చు అని అనగానే రామరాజు ఏం మాట్లాడకుండా నిలుచుంటాడు. భాగ్యం చూసావా అమ్మడు వచ్చి రాగానే నీకు గదా చాలా చేశాను ఇక ఇంట్లో పెత్తనం కూడా నువ్వే మెల్లగా నీ చేతిలోకి తీసుకోవాలని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×