Illu Illalu Pillalu Today Episode April 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. చందు శ్రీవల్లిని ఏదో మాట్లాడాలి అన్నారు చెప్పాలి కదా మీరు ఇలా మౌనంగా ఉంటే నాకేం తెలుస్తుంది అని అడుగుతాడు. ఒక చిన్న సమస్య వచ్చిందండి పెళ్లిని ఒక పది రోజులు వాయిదా వేద్దామని అడుగుతుంది శ్రీవల్లి. పెళ్లి వాయిదా అంటే చాలా కష్టం అంత సమస్యలు ఏమి వచ్చాయి అని చందు అడుగుతాడు. మాది ఫైనాన్స్ బిజినెస్ కాదండి కొంచెం ఇబ్బంది వచ్చింది. పెళ్లికి కావాల్సిన డబ్బులు చేతిలో లేవు. ఎవరికో హాస్పిటల్ లో అర్జెంట్ కావాలంటే మా నాన్న డబ్బులు ఇచ్చేసాడు ఒక పది రోజుల్లో మళ్ళీ డబ్బులు అడ్జస్ట్ అవుతాయి అంతవరకు పెళ్లిని వాయిదా వేసుకుందామని అడుగుతుంది. ఇప్పుడు పెళ్లిని వాయిదా వేస్తే పరువు పోతుంది మా ఇంట్లో వాళ్ళు అస్సలు బతకలేరు అని చందు టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు పెళ్లి చేసే అంత పరిస్థితుల్లో మేము లేము కదా ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి అని శ్రీవల్లి అడుగుతుంది. పెళ్లికి ఎంత ఖర్చులు కావాల్సి వస్తాయి అని చందు అడుగుతాడు. పెళ్లిని వాయిదా వేయకుండా ఎలాగోలాగా నేను ఆ డబ్బులు అరేంజ్ చేస్తాలే అని చందు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి పెళ్లి ఆగిపోతుంది అని చెప్పినప్పటి నుంచి చందు బాధపడుతూ ఉంటాడు. తన మనసులో తాను లేకుండా అదే ఆలోచనతో ఉంటాడు. ధీరజ్ సాగరు చందు ముగ్గురు రెస్టారెంట్ కి వెళ్తారు. ధీరజ్ సాగర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు కానీ చందు మాత్రం మౌనంగా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉంటారు. అది చూసినా ధీరజ్ ఏమైంది అన్నయ్య ఎలా ఉన్నావ్ అని అడుగుతారు. ఏం లేదురా ఏం కాలేదు అంటే మా ఇద్దరి పెళ్లి ఎలాగో నాన్న చేతుల మీదుగా జరగలేదు నీ పెళ్లి నాన్న చేతుల మీదుగా జరగాలని ఎన్నో ఆశలు పడ్డాడు. నీ పెళ్లి చూడాలని కలలు కన్నాడు నువ్వు మాత్రం ఏ తప్పు చేయకు రానేసి అంటారు.
నీ మనసులో ఏదైనా ఉంటే మాకు చెప్పు మాకు వీలైనంత వరకు సాయం చేస్తాం అంతేగాని నాన్న పరువు తీసేలా ఏదీ చేయకు అని చందుకు చెప్తారు. అదేం లేదు లేరా.. పెళ్లి పనులు ఎలా ఉన్నాయని అడగడానికి శ్రీవల్లి పిలిచింది అంతేను అని అంటారు. శారదాంబ తన కూతురి ఇచ్చిన పెళ్లి పత్రికను చాటుగా వెళ్లి ఎవరు లేని సమయంలో చదువుతుంది. ఆ పెళ్లి పత్రికలో తన పేరు ఉండటాన్ని చూసి ఎమోషనల్ అవుతుంది. అప్పుడే తన కోడలు అక్కడికి రావడంతో ఆ విషయాన్ని కోడలతో పంచుకుంటుంది.
వీళ్లిద్దరు మాట్లాడుకోవడం భద్రా, సేన ఇద్దరు వింటారు. నీకు పెళ్లి పత్రిక ఇస్తే అది కాల్ చేయకుండా దాని మొహానికి కొట్టకుండా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి చదువుతున్నావా అని భద్ర అడుగుతుంది. పెళ్లికి రమ్మని పెళ్లి పత్రిక ఇస్తే ఎలా కాదని అంటారు అని ఆమె అంటుంది కానీ భద్ర మాత్రం దీన్ని కాల్చి వెయ్యాలని తీసుకెళ్తుంది. విశ్వం మాత్రం ఈ పెళ్లికి మనం కచ్చితంగా వెళ్లాలి సకుటుంబ సపరివార సమేతంగా అని పిలిచారు కదా మనం వెళ్లి ఆ పెళ్లి ఎలా జరుగుతుందో చూడాలి అని అంటాడు.
అటు రామరాజు తన కొడుకు పెళ్లి పత్రికలను సంతోషంగా అందరితో పంచుకుంటాడు. వేదవతి తన కోడలతో కలిసి పెళ్లి కావాల్సిన పిండి వంటలని తయారు చేస్తుంది. పెళ్లి కోసం అందరూ సరదాగా ఉంటూ అన్ని పనులను పూర్తి చేస్తుంటారు. ధీరజ్ చాలా సంతోషంగా ఉంటాడు. నేను ఈ రోజున అస్సలు మర్చిపోలేను మా నాన్న నన్ను ఎప్పటికీ పిలవడు అనుకున్నాను కానీ మా నాన్న నన్ను పిలిచాడు. అన్నయ్య పెళ్లి పనులను నేను దగ్గరుండి చేశాను అని సంతోషంగా ప్రేమతో అంటాడు. కానీ ప్రేమ మాత్రం నువ్వు నన్ను కావాలని తోసావు కదా అని అంటుంది.
నేనేం చెప్తున్నాను నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా అని ధీరజ్ అంటాడు. ముందు సారీ చెప్పు నువ్వు కావాలని తోచావని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ చేసేదేమీ లేక సారీ చెప్తాడు. ఇక కరెంటు పోతే ధీరజ్ ని ప్రేమ హగ్ చేసుకుంటుంది ఇద్దరూ కలిసి కాసేపు కీచులు ఆడుకుంటారు. తర్వాత రోజు ఉదయం రామరాజు పెళ్లి పనుల్లో హడావిడి చేస్తూ ఉంటాడు. సాగర్ కు కొన్ని పనులు చెప్తాడు అలాగే ధీరజ్ కి కూడా కొన్ని పనులు చెప్పబోయే ఆగుతాడు. వీళ్ళందరి సంతోషాన్ని చూసి చందు టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..