Illu Illalu Pillalu Today Episode july 10 th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం వెళ్ళేది వెళ్లకుండా నర్మద దగ్గరికి వెళ్లి నా కూతుర్లకు ఏం జరిగినా నేను చూసుకుంటాను. నీకు ఎవరున్నారు చూసుకోవడానికి అని ఇంకా బాధపెడితే వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నర్మద కూడా నువ్వు అన్నదానికి ఇంకాస్త ఎక్కువ చేసి చూపిస్తానని భాగ్యంతో ఛాలెంజ్ చేస్తుంది. ఇంకొకసారి నా కూతురు జోలికొస్తే మర్యాదగా ఉండదు ఏంటమ్మాయి అర్థం అవుతుందా అని భాగ్యం సైలెంట్ గాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటుంది.. నర్మదా మొదట సైలెంట్ గా ఉన్న భాగ్యం వెళ్ళిపోతుంటే చిటికేసి మరి పిలుస్తుంది. ఏంటి పిన్ని గారు ఏదో అంటున్నారు.. ఇప్పటివరకు నాకు కేవలం అనుమానం మాత్రమే ఉంది ఇప్పటినుంచి ఆ అనుమానం నిజమా కాదా అని తెలుసుకొనే పనిలోనే ఉంటాను అని నర్మదా అంటుంది. ఇది నా ఇల్లు ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళకి ద్రోహం చేయాలని చూసినా మోసం చేయాలని చూసినా నేను అస్సలు సహించను అని నర్మదా అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా బాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అక్కడ గేటు చూస్తే తాళం వేసి ఉంటుంది.. ఆ పక్కనే ఒక పేపర్లో ఇంటిని అద్దెకి ఇవ్వబడును అని నెంబర్ రాసి ఉంటుంది. ఆ నెంబర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్నీ తెలుసుకుంటుంది నర్మదా. భాగ్యం వాళ్లది అసలు ఇల్లు ఇది కాదని ఈ విషయాన్ని వల్లి అక్క తోనే కన్ఫామ్ చేసుకోవాలని అనుకుంటారు..వెంటనే వేదవతి కి ఫోన్ చేసి నర్మదా వల్లి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కోమని అడుగుతుంది. శ్రీవల్లి దగ్గరికి వెళ్లి మీ అమ్మ వాళ్లు ఇంట్లోనే ఉన్నారా అమ్మ అని అడుగుతుంది..
శ్రీవల్లి మొదట ఇంట్లోనే ఉన్నారండి అని అంటుంది. ఆ విషయం నీ వేదవతి నర్మదా వాళ్లకు చెప్పడం విని షాక్ అవుతుంది శ్రీ వల్లి. ఒకసారి స్పీకర్ ఆన్ చేసి వల్లి అక్క దగ్గరికి ఇవ్వరా అని నర్మదా ప్రేమ అంటారు.. మా అమ్మ వాళ్లు లేరు అనగానే సరే మేము వెనక్కి వచ్చేస్తాం లేని నర్మదాప్రేమ అంటారు. ఆ తర్వాత శ్రీవల్లి మళ్లీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఏంటే బాబా మళ్లీ ఫోన్ చేశావు నేనంటే నీకు ఎంత ఇష్టమే అని భాగ్యం అంటుంది. ఇష్టమా కాకరకాయ రసమా నువ్వు చేసిన దానికి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను మన బండారం మొత్తం బయటపడేలా ఉంది అని టెన్షన్ పడుతుంది.
అయితే నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావే ఈ ప్రపంచంలో మనల్ని కనుక్కోవడం చాలా కష్టం. మనం అద్దెకి తీసుకుంటున్న ఇంటి దగ్గరికి వెళ్లిన అక్కడ కనుక్కునే ఛాన్స్ లేదు.. ఆ తర్వాత మళ్లీ ఈ బస్తిలో మనల్ని వెతకడం అంత సులువు కాదు అని భాగ్యం అంటుంది.. నువ్వేమీ టెన్షన్ పడకు అంతా నేను చూసుకుంటాను అని భాగ్యం కూతురికి భరోసా ఇస్తుంది.. ఆ మాట వినగానే ఆనందరావు టెన్షన్ తో బయటికి వచ్చి మీద నీళ్లు పోసుకుంటాడు.
ఆనందరావు చేసిన భాగ్యం ఏంటండీ ఇలా పిచ్చి పనులు చేస్తున్నారు అని అంటుంది. నేను ముందే చెప్పాను కదా ఆ నర్మద మామూలుది కాదు తోక తొక్కిన త్రాచు లాగా విరుచుకుపడుతుంది అని. ఏవండీ ఆవిడ గారు మీరు మళ్ళీ ఆ నర్మద దగ్గరికి వెళ్లి మీ ఇంటికి వచ్చాను.. నేను అట్టింటికి వచ్చాను.. నా కూతురు జోలికొస్తే అసలు ఊరుకోను అని డైలాగులు చెప్పారు. అది మనల్ని వెతుకుండు కచ్చితంగా వస్తుంది అని టెన్షన్ పడతాడు.
నా తల్లో నెరిసిన వెంట్రుకంత లేదు దాని వయసు అనుకున్నాను.. ఇలా రివర్స్ అవుతుందని అసలు ఊహించలేదు దానికి ఏం చేయాలో అది చేస్తాను లాంటిది కనుక్కోవడం అంత సులువు కాదు అని అంటుంది. శ్రీవల్లి ప్రేమ మాత్రం భాగ్యం వాళ్ళ కోసం వేట మొదలు పెడతారు. ఇద్దరూ కలిసి వెతుకుతూ ఉంటారు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమకు డాన్స్ క్లాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇక నేను అర్జెంటు వెళ్లాలి సాయంత్రం వెతుకుదాం అని ప్రేమా నర్మద ఇద్దరు వెళ్ళిపోతారు.
Also Read :అక్షయ్ కు సీరియస్.. అవని ఇంట్లో పెయిడ్ గెస్ట్.. పార్వతి దెబ్బకు కోడళ్లు షాక్..
ఏమా ఆటో కోసం చూస్తుంటే వెనకాల వచ్చిన ధీరజ్ నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను పద అని అంటాడు. కానీ ధీరజ్ సైకిల్ లో వెళ్తే తను డాన్స్ క్లాస్ చెప్తున్నా విషయం తెలిసిపోతుందని ప్రేమ టెన్షన్ పడుతుంది.. లేదు నేను ఆటో కి వెళ్తానని గొడవ పడుతుంటే మధ్యలో ఒక వ్యక్తి నీకు ఉన్నాను చెల్లెమ్మ అంటూ వస్తాడు. ధీరజ్ నీ కొట్టబోతుంటే ప్రేమ వాడిని చంప పగలగొడుతుంది.. ధీరజ్ నుంచి తప్పించుకుని ప్రేమ బయటపడుతుంది.. కానీ ధీరజ్ మాత్రం ప్రేమపై అనుమానం రావడంతో వెనకాలే వస్తాడు.. ప్రేమ ధీరజ్ రావడం గమనించి దాక్కుంటుంది.. ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సేన ప్రేమ డాన్స్ క్లాస్ ను చూసి షాక్ అవుతాడు. ఏం జరుగుతుందో చూడాలి…