BigTV English

KCR: మళ్లీ యశోదకు కేసీఆర్.. నేతలు, కార్యకర్తల్లో టెన్షన్

KCR: మళ్లీ యశోదకు కేసీఆర్..  నేతలు, కార్యకర్తల్లో టెన్షన్

KCR: ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నారా? అందుకే వైద్య పరీక్షల కోసం వెళ్తున్నారా? కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఏడాదిన్నరగా పాలకపక్షం డిమాండ్ చేస్తోంది. ఈసారి కచ్చితంగా సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు.


గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు మాజీ సీఎం కేసీఆర్. వైద్యుల సూచన మేరకే ఆసుపత్రికి వెళ్లనున్నట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు కేసీఆర్ వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. గడిచిన ఐదు రోజులుగా నందినగర్‌లోని తన నివాసంలో రెస్టు తీసుకుంటున్నారు గులాబీ బాస్.

వారం కిందట అంటే సీజనల్ ఫీవర్‌తో కేసీఆర్ బాధపడ్డారు. జులై 3న ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ ఇంటికి చేరుకున్నారు. అనంతరం యశోద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి పరీక్షలు తర్వాత ఇంటికి చేరుకున్నారు. వారంలో రోజుల వ్యవధిలో ఆయన రెండోసారి ఆసుపత్రికి వెళ్లారు.


అయితే గడిచిన నాలుగు రోజులు కేసీఆర్.. ఆ పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణకు ఎదురయ్యే ముప్పుపై చర్చించారట. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

ALSO READ: సమోసాల్లో బల్లి ప్రత్యక్షం.. ఎక్కడంటే

పార్టీ వర్గాలు మరోలా చెబుతున్నారు. కొద్దిరోజుల్లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అంటున్నాయి. ఇందులోభాగంగా హెల్త్ చెకప్ చేయించు కుంటున్నారని చెబుతున్నాయి. బీఆర్ఎస్ హయంలో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుబడుతోంది.

తాను తప్పు చేశామనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇలాంటి అపోహాలను తలొగించాలంటే ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని పెద్దాయన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ లేవనెత్తిన ప్రతీ అంశానికి కేసీఆర్ బదులు ఇస్తారని అంటున్నాయి.

ఎన్నికల తర్వాత కేసీఆర్ అంత యాక్టివ్‌గా లేరు. కేవలం ఫామ్‌హౌస్‌‌కి పరిమితమయ్యారు. చీటికి మాటికీ అధినేత అనారోగ్యానికి గురికావడంతో కొందరు నేతలతోపాటు కేడర్‌లో తెలియని అయోమయం నెలకొంది. వివిధ అంశాలపై అధికార పార్టీ సవాళ్లు విసిరినా అధినేత సైలెంట్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×