Big Tv Originals: దేశ వ్యాప్తంగా వినియోగదారులకు చీప్ అండ్ బెస్ట్ లో అన్ని రకాల వస్తువులను అందిస్తుంది డిమార్ట్. నిత్యవసర సరుకుల నుంచి గృహోపకరణాల వరకు ఇందులో అగ్గువకు లభిస్తాయి. ఈ సంస్థ పెద్ద లేబుల్స్ తో పాటు సొంత బ్రాండ్ ఉత్పత్తులను కలిగి ఉంది. వీటిలో కిరాణా సామాన్లు అయిన బియ్యం, పప్పు, నూనెలతో పాటు స్నాక్స్, శుభ్రపరిచే లిక్విడ్స్, దుస్తులను ప్రీమియా, అలైన్ రిటైల్ పేరుతో అందుబాటులో ఉంచింది. అమూల్, బ్రిటానియా, కోల్గేట్ లాంటి పెద్ద బ్రాండ్లకు అదనంగా చెల్లించకుండా నేరుగా ఉత్పత్తులను తయారు చేయడం, సోర్సింగ్ చేయడం ద్వారా వినియోగదారుల ఖర్చులు తగ్గించడంలో సాయపడుతుంది. అయితే, వీటి నాణ్యత విషయంలో తరచుగా కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఇంతకీ డిమార్ట్ సొంత బ్రాండ్ల ఉత్పత్తల నాణ్యత ఎలా ఉంటుంది? ఇంతర బ్రాండ్లతో పోల్చితే ధరలు ఎలా ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
DMart ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులు
వినియోగదారుల రోజువారీ అవసరాలకు అనుగుణంగా డిమార్ట్ సొంత బ్రాండ్లను కలిగి ఉన్నాయి.
⦿ కిరాణా సామాన్లు: ప్రీమియా, బేసిక్ డిమార్ట్ లేబుల్స్ కింద కందిపప్పు, బియ్యం, గోధుమ పిండి, నూనెలను అందిస్తుంది.
⦿ స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్: బిస్కెట్లు, నామ్కీన్లు, కార్న్ ఫ్లేక్స్, కాఫీ పౌడర్ లాంటి ప్రీమియా బ్రాండ్లు కెల్లాగ్స్, హల్దిరామ్స్ తో పోటీపడతాయి.
⦿ డెయిరీ: పన్నీర్, పాల ఉత్పత్తులు, అముల్, మిల్కీ మిస్ట్ కంటే చౌకగా ఉంటాయి.
⦿ గృహోపకరణాలు: డిటర్జెంట్లు, సబ్బులు, ఫ్లోర్ క్లీనర్లు, సర్ఫ్ ఎక్సెల్, హార్పిక్ లాగానే పని చేసినా, తక్కువ ధరలకు లభిస్తాయి.
⦿ ఇతర వస్తువులు: బట్టలు, వంటగది వస్తువులు, కొన్ని ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు కూడా డిమార్ట్ సొంత ఉత్పత్తులను కలిగి ఉంది.
DMart బ్రాండ్ ఉత్పత్తుల నాణ్యత
డిమార్ట్ సొంత బ్రాండ్లు వినియోగదారుల నుండి 4 లేదంటే 5 స్టార్ల రేటింగ్ ను కలిగి ఉన్నాయి. ఇవి ప్రాథమిక వినియోగానికి మంచివి. కానీ, టాప్ లో ఉండవు. చాలా మంది కస్టమర్లు ఈ ఉత్పత్తులు తాజాగా, నమ్మదగినవిగా ఉన్నాయని చెప్తారు. ముఖ్యంగా పప్పులు, నూనెలు బాగుంటాయని చెప్తారు. అంతేకాదు, ఈ ఉత్పత్తులకు సంబంధించి డిమార్ట్ నాణ్యతా పరీక్షలను నిర్వహిస్తుంది. అయినప్పటికీ, డిమార్ట్ సొంత బ్రాండ్లు, పెద్ద బ్రాండ్లతో పోటీ పడలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
DMart ఉత్పత్తులతో లాభాలు
డిమార్ట్ ఉత్పత్తుల ధరలు పెద్ద బ్రాండ్‌లతో పోలిస్తే 20-43% తక్కువగా ఉంటాయి. కిరాణా సామాన్ల నుంచి బట్టల వరకు ఎమ్మార్పీ మీద 10% వరకు డిస్కౌంట్లు పొందుతారు. అదే సమయంలో డిమార్ట్ సొంత బ్రాండ్ల నాణ్యత అంత పక్కాగా ఉండదనే విమర్శలు ఉన్నాయి.
పెద్ద బ్రాండ్లతో DMart బ్రాండ్ ధరల పోలిక!
డిమార్ట్ బ్రాండ్ ఉత్పత్తలు ధరలు పెద్ద బ్రాండ్లతో పోల్చితే 20-43 శాతం తక్కువగా ఉంటాయి.
⦿ పప్పు (1 కిలో)
డిమార్ట్: రూ.100-120
ఇతర బ్రాండ్: రూ.140-180 (టాటా సంపన్)
తగ్గింపు: 20-40%
⦿ కార్న్ ఫ్లేక్స్ (500 గ్రా)
రూ.80-100
రూ.120-150 (కెల్లాగ్స్)
తగ్గింపు: 30-40%
⦿ కాఫీ పౌడర్ (200 గ్రా)
రూ.150-200
రూ.250-300 (నెస్కేఫ్)
తగ్గింపు: 25-40%
⦿ పన్నీర్ (200 గ్రా)
రూ.80-100
రూ.120-140 (అమూల్)
తగ్గింపు 20-30%
⦿ డిటర్జెంట్ (1 కిలోలు)
రూ.50-70
రూ.80-100 (సర్ఫ్ ఎక్సెల్)
తగ్గింపు: 30-40%
⦿పెరుగు (అధిక ప్రోటీన్, 200 గ్రా)
రూ.30-50
రూ.50+
తగ్గింపు: 20%
డిమార్ట్ ప్రతి వస్తువుపై ఎమ్మార్పీ మీద 3-10% తగ్గింపును అందిస్తుంది. బిగ్ బజార్, రిలయన్స్ మార్ట్ లాంటి వాటితో పోల్చితే తక్కువ ధరలకే అందిస్తుంది.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.