BigTV English

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటికి డీఆర్ఐ భారీ షాక్..ఏకంగా 102 కోట్లు ఫైన్.. మిగతా వారికి?

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటికి డీఆర్ఐ భారీ షాక్..ఏకంగా 102 కోట్లు ఫైన్.. మిగతా వారికి?
Advertisement

Ranya Rao: కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ రన్యారావు(Ranya Rao) గత కొద్ది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా నిలిచిన ఈమెకు.. ఇప్పుడు ది డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఈమెకు రూ. 102.5 కోట్ల జరిమానా విధిస్తూ…ఉత్తర్వుల జారీ చేసింది. రన్యాతో పాటు మరో నలుగురు నిందితులు ఈ కేసులో ఇరుక్కోగా వారికి రూ.168 కోట్ల పెనాల్టీ విధించారు. మొత్తంగా నిందితులకు రూ. 270 కోట్ల పెనాల్టీ విధించింది.


సకాలంలో చెల్లించకపోతే ఆస్తులు జప్తు..

గత కొన్ని రోజులుగా జైల్లోనే ఉన్న రన్యా రావుకి డీఆర్ఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు. మరొకవైపు ఇదే కేసు విషయంలో స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు, విదేశీ మారకద్రవ్య పరిరక్షణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కూడా విచారించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11 కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


14 కిలోలకు పైగా బంగారం అక్రమ రవాణా..

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది మార్చిలో దుబాయ్ నుండి 14 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బెంగళూరు విమానాశ్రయంలో నటి రన్యా రావు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈమెకు కర్ణాటక డిజిపి రామచంద్రరావు సొంత సవతి తండ్రి అని తర్వాత తెలిసింది. దీంతో పోలీసులు కూడా ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు నేరాన్ని అంగీకరిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది రన్యా రావ్

27 సార్లు దుబాయ్ కి వెళ్ళిన రన్యా రావు..

డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్న ఆమె మాట్లాడుతూ.. “నేను ఐరోపా, మధ్య ఆసియా, అమెరికా, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశాలకు పర్యటనలకు వెళ్లాను. ముఖ్యంగా నాకు తగినంత విశ్రాంతి లేకపోవడంతో ప్రస్తుతం అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను” అంటూ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఏడాది కాలంలో మొత్తం 27 సార్లు దుబాయ్ కి వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

రన్యా రావు వ్యక్తిగత జీవితం..

ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఈమె తండ్రి కె ఎస్ హెగ్డేష్ . రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈమె భర్త పేరు జతిన్ హుక్కేరీ. ఈయన ఆర్కిటెక్చర్ గా పని చేస్తున్నారట. 2014లో కిచ్చాసుదీప్ హీరోగా నటించిన కన్నడ సినిమా ‘మాణిక్య’ ద్వారా వెండితెరకు పరిచయమైంది.

ALSO READ:Bigg Boss 9: హమ్మయ్య.. ఎట్టకేలకు ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది!

Related News

Kiran Abbavaram: పవన్ సినిమాలలో అసలు నటించను…అభిమాని అయితే నటించాలా?

Samantha: డైరెక్టర్లు కూడా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. బోల్డ్ కామెంట్స్ చేసిన సమంత!

Hero Darshan: మళ్లీ సంకటంలో పడ్డ హీరో దర్శన్.. ఉన్నత న్యాయస్థానం మండిపాటు!

Hero Vishal: 8కోట్ల మంది ఇష్టాన్ని 8మంది నిర్ణయించలేరు..అవార్డులన్నీ చెత్తబుట్టలోకే!

K-Ramp: కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్!

Bandla Ganesh: నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు..చెలరేగిపోవడమే!

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Big Stories

×