Kishkindha Puri: అల్లుడు శ్రీను(Alludu Sreenu) సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన అనంతరం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తదుపరి సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయనకు నిరాశ ఎదురవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమాని రీమేక్ చేశారు అయితే ఈ సినిమా కూడా పూర్తిగా నిరాశపరిచింది.
ట్రైలర్ కు ముహూర్తం పిక్స్..
ఈ క్రమంలోనే తిరిగి తెలుగు ఇండస్ట్రీపై ఈయన పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. ఇదివరకు భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి శ్రీనివాస్ త్వరలోనే కిష్కిందపురి(Kishkindha Puri) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అలాగే ట్రైలర్ విడుదలకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ మూడో తేదీ ట్రైలర్ విడుదల కానుంది
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజినెస్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఈ బిజినెస్ వివరాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆంధ్రాలో 3 కోట్ల బిజినెస్ జరుపుకోగా నైజాం ఏరియాలో1.5 కోట్లు,సీడెడ్ లో కోటి రూపాయలు బిజినెస్ జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల నెట్ కలెక్షన్లు, 13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే సునాయసంగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు కానీ బెల్లంకొండ శ్రీనివాస్ ఇదివరకు సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోని నేపథ్యంలో ఆ ప్రభావం ఈ సినిమాపై పడితే కష్టమని చెప్పాలి.
టార్గెట్ రీచ్ అయ్యేనా?
మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ముందున్న ఈ టార్గెట్ ను రీచ్ అవుతారా లేదంటే మరోసారి బాక్సాఫీస్ వద్ద నిరాశని ఎదుర్కొంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా హర్రర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించబోతున్నారు.. అయితే ఈ సినిమా సక్సెస్ అవడం ఇటు అనుపమ కెరియర్ కు, అటు బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ కు కూడా ఎంతో కీలకంగా మారిందని చెప్పాలి. ఇక అనుపమ పరమేశ్వరన్ ఇటీవల పరదా అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా ఆమెకు పూర్తిస్థాయిలో నిరాశను కలిగించిందని చెప్పాలి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సైతం భైరవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.
Also Read: Kishkindapuri Censor: కిష్కంధపురి సెన్సార్… అంతలా ఏం ఉందయ్యా… ఆ సర్టిఫికేట్ ఇచ్చారు