BigTV English

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి కన్నింగ్ ప్లాన్.. హనీమూన్ ప్లాన్ సక్సెస్..రామారాజు పై వేదవతి సీరియస్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లి కన్నింగ్ ప్లాన్.. హనీమూన్ ప్లాన్ సక్సెస్..రామారాజు పై వేదవతి సీరియస్..

Illu Illalu Pillalu Today Episode june 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు కి సేటు ఫోన్ చేసి రెండు రోజులు నాకు డబ్బులు ఇవ్వాలని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. కానీ చందు మాత్రం ఒక నాలుగు ఐదు రోజులు టైం ఇవ్వాలని అడుగుతాడు. సేటు మాత్రం ఏంటి నాటకాలు ఆడుతున్నావా ఇదేదో యవ్వారం తేడాగా ఉందే… నేను రెండు రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. నువ్వు కచ్చితంగా డబ్బులు ఇవ్వకుంటే మీ నాన్న దగ్గర ఈ విషయాన్ని చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. వల్లి అమ్మానాన్న పది రోజులు డబ్బులు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకు ఏదీ మాట్లాడట్లేదు. వీళ్ళకు కొంచెం కూడా సిగ్గు శరం అనేది లేదని చందు ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ సాగర్ తిరుపతి అందరూ వచ్చి ఏంట్రా టెన్షన్ పడుతున్నావ్.. ఏదైనా ఉంటే మాతో చెప్పు అని అడుగుతారు. శ్రీవల్లి వీళ్ళకి అసలు నిజం ఎక్కడ చెప్తారని టెన్షన్ పడుతూ ఉంటుంది. చందు నిజం చెప్పబోతుంటే శ్రీవల్లి వచ్చి బావ అని పిలుస్తుంది.. శ్రీవల్లి పది లక్షల విషయాన్ని తన తమ్ముళ్లతో చెప్పకుండా జాగ్రత్త పడుతుంది. ఇక ఉదయం చందు రావడానికి ముందే నాటకాన్ని మొదలు పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చందు గురించి భాగ్యంతో శ్రీవల్లి చెప్తుంది. అయితే భాగ్యం మాత్రం ఇంత వయసొచ్చినా నా మొగుడు ఇంకా నాతోనే ఉంటున్నాడు నువ్వు అలా చేసుకోవాలి గాని ఇలా దూరంగా పడుకోవడం ఏంటి అని అడుగుతుంది. నువ్వు చేసిన ఘనకార్యం వల్లే మేమిద్దరం దూరంగా పడుకోవాల్సి వచ్చిందని శ్రీవల్లి భాగ్యంపై సీరియస్ అవుతుంది. ముందు 10 లక్షలు మేటర్ పక్కన పెట్టి మీరిద్దరూ కాపురం మీద దృష్టి పెట్టండి. ఆ నర్మదకి పొరపాటున పిల్లలు పుడితే మీ అత్తయ్య నెత్తిన కూర్చుంటుంది అని భాగ్యం సలహా ఇస్తుంది.. ఇక ఉదయం లేవగానే చందు రావడం చూసి శ్రీవల్లి జ్వరం వచ్చిందని నాటకం ఆడుతుంది.

చందు లోపలికి రాగానే శ్రీవల్లి జ్వరం వచ్చిందని అంటుంది.. అదేంటి రాత్రి బాగానే ఉన్నావు కదా ఇంత సడన్గా జ్వరం ఎందుకు వచ్చింది అని చందు అడుగుతాడు. నువ్వేమో నీ తమ్ముళ్ళతో పడుకున్నావు? నాకేమో ఒంటరిగా ఈ గదిలో ఉండడంతో బెంగ పెట్టుకున్నాను అని శ్రీవల్లి అంటుంది. మీ తమ్ముళ్ళతో నువ్వు పడుకోవడం నాకు ఏమీ బాధ లేదు బావ మనిద్దరం కొత్తగా పెళ్లి అయిన వాళ్ళం. ఇలా దూరంగా ఉంటే నాకు బెంగ అనిపించదా.. ఈ బెంగ తీరిపోవాలంటే మనిద్దరం ఒకటి చేయాలి అని శ్రీవల్లి అంటుంది. అదేంటి అని చందు అడుగుతాడు. శ్రీవల్లి మనిద్దరం హనీమూన్ కి వెళ్దామా అని అడుగుతుంది.


ఇప్పుడు హనీమూన్ కంటే నాన్న ఒప్పుకోరు. ఒక మాట నాన్నతో అడిగి చెప్తాను అని అంటాడు. ఆ తర్వాత వెంటనే ఆఫీసులో లీవ్ లు ఇస్తారు ఇవ్వరు అని చందు అంటాడు. దానికి శ్రీవల్లి నాకు తెలుసు బావా కచ్చితంగా నేనంటే నీకు ఇష్టం లేదు ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నావు అందుకే వద్దంటున్నావు కదా అని అంటుంది. చందు మాత్రం నాన్నగారిని అడిగి ఒకసారి తెలుసుకున్న తర్వాత చెప్తాను అని అంటాడు..

వేదవతి నిద్రలేచి వచ్చి బయట ఎక్కడ పనులు అక్కడే ఉండడం చూసి షాక్ అవుతుంది. శ్రీవల్లి ఈపాటికి అన్ని పనులను చేసేసి ఉంటుంది కదా మరి ఎందుకు ఎక్కడ కనిపించలేదు అని అనుకుంటుంది. ప్రేమ నర్మద ఇద్దరు కూడా నిద్రలేచి బయటకు వస్తారు. శ్రీవల్లి ఎక్కడైనా మీకు కనిపించిందా అని అడుగుతుంది.. నీ ముద్దుల కోడలు కదా మీరే వెతుక్కోండి అని నర్మదా అంటుంది. మీరిద్దరేంటి ఒకేసారి లేచి వచ్చారు మాట్లాడుకొని లేచారా అని వేదవతి అడుగుతుంది..

మీ అబ్బాయిలు అందరూ బయట పడుకున్నారు.. నాకు బోర్ కొట్టేసి అక్క దగ్గర పడుకున్నాను అని ప్రేమ అంటుంది. మరి నన్ను కూడా పిలవచ్చు కదా ఏం చెక్క కబుర్లు చెప్పుకునే వాళ్ళం అని వేదవతి అంటుంది. దానికి నర్మదా మేమంటే యూత్ మీతో కబుర్లు చెప్పేంత వాళ్ళ మా అని సెటైర్లు వేస్తుంది. దానికి వేదవతి సీరియస్ అవుతుంది. ఏంటి నేనేమన్నా ముసలిదానిలా కనిపిస్తున్నానా నీకు? గవర్నమెంట్ కోడలు కదా అని ఊరుకుంటుంటే నెత్తినెక్కి కూర్చుంటున్నావే అని అడుగుతుంది..

ఇక తర్వాత రామరాజు బయటికి వెళ్లడానికి బ్యాగు తీసుకు రమ్మని చెప్తాడు.. కానీ వేదవతి బ్యాగు తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడే శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఏదో టెన్షన్ పడుతూ కనిపిస్తున్నట్లు రామరాజు గమనిస్తాడు. ఏమైందమ్మా శ్రీవల్లి ఎందుకు మీ అమ్మతో ఏదో టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దానికి శ్రీవల్లి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు హనీమూన్ కి వెళ్లారు అంట మావయ్య. మమ్మల్ని కూడా పంపిస్తానని అంటుంది. మా అమ్మ బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తుంది మీకు అవమానం కాదా అని ఇండైరెక్టుగా రామరాజుకి కౌంటర్ ఇస్తుంది. రామరాజు చందును పిలిచి మీరిద్దరూ హనీమూన్ కి వెళ్ళండి ఎక్కడ వెళ్తున్నారో చెప్తే డబ్బులు పంపిస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి సంతోషంతో ఎగిరి గంతేస్తుంది..

నర్మదా ప్రేమలు మాత్రం పెద్ద కోడలికి అన్ని ఉంటాయా మనకు ఉండవా అని బాధపడుతూ ఉంటారు. వేదవతి బయటకు వచ్చి మీకు పెద్ద కోడలు పెద్ద కొడుకు మాత్రమే కాదు.. మీకు ఇంకా ఇద్దరు కోడలు కొడుకులు ఉన్నారు ఆ సంగతి మీరు మర్చిపోతున్నారు. వాళ్లకి కూడా కొత్తగా పెళ్లయింది కదా వాళ్ళని కూడా హనీమూన్ కి పంపించొచ్చు కదా అనేసి అంటుంది.. వాళ్ళిద్దరూ నా మాట ప్రకారం పెళ్లి చేసుకోలేదు నా మాట వినట్లేదు కదా అందుకే నేను పెద్దోడిని మాత్రమే పంపిస్తున్నానని రామరాజు అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×