SSMB -29:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు (Mahesh Babu) అతి తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు దక్కించుకున్నారు. ఇక టాలీవుడ్ లోనే సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు తొలిసారి బౌండరీ దాటేస్తున్నారు అని చెప్పవచ్చు. అందులో భాగంగానే రాజమౌళి(Rajamouli ) దర్శకత్వం లో “ఎస్ ఎస్ ఎం బి 29” అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే..ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈసారి ఆస్కార్ అవార్డు టార్గెట్ గా రాజమౌళి చాలా పగడ్బందీగా సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.. దీనికి తోడు ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తో పాటు మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో భాగమయ్యారు.
అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 న్యూస్..
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రోజుకొక వార్త అభిమానులలో సరికొత్త అంచనాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి29 మూవీకి, రామాయణం ఇంద్రజిత్తుకి మధ్య ఒక సంబంధం ఉంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. తాజాగా రాజమౌళి ఎ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో హీరో పాత్రకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో రామాయణంలోని సంజీవనికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉంటుందని ఇప్పుడు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరో పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక గతంలో ప్రముఖ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) చెప్పినట్లు ఇండియానా జోన్స్ రేంజ్ లో కథ చెప్పాలి అంటే ఈ ప్లాట్ సరిగ్గా ఉంటుందని ఫాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
రాజమౌళి మూవీకి – రామాయణంకి లింక్ ఇదే..
ఇకపోతే ఇంద్రజిత్తుకి రాజమౌళి సినిమాకి గల సంబంధం విషయానికి వస్తే.. “రామాయణంలో మేరు పర్వతం అందరికీ గుర్తుండి ఉంటుంది కదా.. ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణాపాయం కలిగితే, తనను బ్రతికించడానికి సంజీవిని మూలికలు కావాలని సూసైనా వైద్యుడు చెబుతాడు. దాంతో అవి తీసుకురావడానికి వెళ్లిన హనుమంతుడు ఆ సంజీవిని మొక్కలను గుర్తించలేక మొత్తం పర్వతాన్నే ఎత్తుకు వచ్చి లక్ష్మణుడిని కాపాడుతాడు. ఇప్పుడు ఆ సంజీవని మూలికలే మహేష్ – రాజమౌళి మూవీలో కీలకం అని ,ఇక మహేష్ వాటిని తీసుకురావడానికి అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ ఇప్పుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇది ఎంత నిజమో తెలియదు కానీ వింటుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఎవరూ ఊహించని అల్లూరి సీతారామరాజు- కొమరం భీం కాంబో ని సాధ్యం చేసిన రాజమౌళి.. ఇప్పుడు సంజీవని ఫారెస్ట్ అడ్వెంచర్లు చూపించడం పెద్ద విషయం కాదని, త్వరలోనే ఆఫ్రికా వెళ్ళబోతున్న టీం అక్కడ ఎన్నో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇక 2027 చివరికి ఈ సినిమాను విడుదల చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.